ఛాయాచిత్రకళలో బహిర్గతం (exposure) అనగా ఛాయాచిత్రాన్ని బంధించే సమయంలో ఛాయాగ్రాహక మాధ్యమము (ఛాయాగ్రాహక ఫిలిం లేదా ఇమేజ్ సెన్సర్) యొక్క యూనిట్ ఏరియా పై అనుమతింపబడే కాంతి యొక్క పరిమాణము. ఇది లక్స్ సెకన్లలో కొలవబడుతుంది. బహిర్గతపు విలువ (exposure value - EV), దృశ్య కాంతిమత్తతను ఆధారం చేసుకొని లెక్కింపబడుతుంది.

దక్షిణ, ఉత్తర ఖగోళ స్తంభాలను చుట్టూ తిరిగే నక్షత్రాలు చూపించే దీర్ఘ బహిర్గతం.
సూర్యాస్తమయం తర్వాత 15 సెకన్ల బహిర్గత సమయంతో తీసిన సముద్రపు ఫోటో. తరంగాల ఎగసిపాటు మంచుతెర వలె కనిపిస్తున్నది.

ఛాయాచిత్ర పరిభాషలో బహిర్గతం అనగా ఒక షట్టరు చక్రం. ఉదాహరణకి సుదీర్ఘ బహిర్గతం అనగా కాంతి తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు ఒకే ఒక, ఎక్కువ నిడివి షట్టరు చక్రంతో బంధించటం. అదే బహుళ బహిర్గతం అయితే ఒక చిత్రం పై మరొక చిత్రం పొరలు పొరలుగా ఒకే చిత్రంగా ఏర్పడే తక్కువ నిడివి గల పలు షట్టరు చక్రాలు. రెండు సందర్భాలలోనూ ఫిలిం వేగం ఒకటే అయి ఉండి, సంకరిత ఫోటోమెట్రిక్ ఎక్స్పోజర్ (Hv) కూడా ఒకటే అయి ఉండాలి.

ఉత్తమమైన బహిర్గతం మార్చు

ఛాయాగ్రహకుడు కోరుకున్న ప్రభావాన్ని సాధించగలగటం సరైన బహిర్గతానికి నిర్వచనం.

మరింత సాంకేతిక విధానం ఫిలిం లేదా సెన్సర్ యొక్క పరిమిత ఉపయోగిత బహిర్గత పరిధి అనగా క్రియాశీలక పరిధిని గుర్తిస్తుంది. ఒకవేళ, ఛాయాచిత్రం యొక్క ఏదేని భాగము యొక్క వాస్తవ బహిర్గతం ఈ పరిధిని దాటితే ఫిలిం దానిని నమోదు చేయడంలో కచ్చితత్వం దెబ్బ తింటుంది. ఉదాహరణకి ఒక అతి సాధరణ నమూనాలో పరిధుల దాటిన విలువలు సూక్ష్మాలని వివరించేందుకు అవసరమైన రంగుల్లో కనబడే బదులు నల్లగా (కావలసిన దానికంటే తక్కువ బహిర్గతం - underexposed) కనబడటం, లేదా తెల్లగా (కావలసిన దానికంటే ఎక్కువ బహిర్గతం - overexposed) కనబడటం. అందుచేత, బహిర్గతాన్ని/కాంతిని సరి చేయటం వలన నీడల లేదా వెలుగులో స్పష్టంగా చూపించదలచుకొన్న వివరాలు ఫిలిం యొక్క ఉపయోగిత బహిర్గత పరిధిని మించకుండా, వస్తువు నుండి వెలువడుతున్న కాంతిని ఫిలిం పై అనుమతించబడే కాంతిని నియంత్రించటం. ఈ ప్రక్రియ చిత్రాన్ని బంధించే సమయంలో ప్రాముఖ్యత కలిగిన ఏ సమాచారమూ నష్టపోకుండే చేస్తుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=బహిర్గతం&oldid=3163708" నుండి వెలికితీశారు