బిర్సా వ్యవసాయ విశ్వవిద్యాలయం


బిర్సా వ్యవసాయ విశ్వవిద్యాలయం (Birsa Agricultural University) జార్ఖండ్ రాష్ట్రం రాంచీ జిల్లా కన్కేలో ఉన్న విశ్వవిద్యాలయం. భారతదేశ మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ చే 1981, జూన్ 26న అధికారికంగా ప్రారంభించబడింది.[1]

బిర్సా వ్యవసాయ విశ్వవిద్యాలయం
రకంప్రజా
స్థాపితం1981
ఛాన్సలర్ద్రౌపది ముర్ము
వైస్ ఛాన్సలర్పర్వీందర్ కౌశల్
స్థానంరాంచీ, జార్ఖండ్, భారతదేశం
కాంపస్పట్టణ
అనుబంధాలుయూజీసీ

వివరాలు మార్చు

సాంకేతికతను ఉపయోగించుకొని బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలలోని వ్యవసాయం, పశు, అటవీ సంపదను అభివృద్ధి చేయడం ఈ విశ్వవిద్యాలయం ప్రధాన లక్ష్యం. అంతేకాకుండా, గిరిజన, ఇతర వెనుకబడిన తరగతుల వారి ఆర్థికాభివృద్ధికి కావలసిన కార్యకలాపాలను విద్య, పరిశోధనల ద్వారా నిర్వహిస్తున్నది.

ప్రాంగణం మార్చు

రాంచీ - పట్రారు రోడ్డులో ఆధునిక ప్రాంగణంతో ఉన్న ఈ విశ్వవిద్యాలయం బిర్సా ముండా విమానాశ్రయం నుండి 17 కిలోమీటర్ల దూరంలో, రాంచీ రైల్వేస్టేషన్ నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇందులో తొమ్మిది బాలుర, ఐదు బాలికల హాస్టళ్లు ఉన్నాయి.

విభాగాలు మార్చు

  • వ్యవసాయ విభాగం
  • పశు సంవర్థక విభాగం
  • అటవీ విభాగం
  • బయో-టెక్నాలజీ కళాశాల

మూలాలు మార్చు

  1. Sarvgyan, Colleges. "Birsa Agricultural University, Ranchi". www.sarvgyan.com. Retrieved 1 July 2018.

బాహ్య లింకులు మార్చు