బుడ్డా వెంగళరెడ్డి

బుడ్డా వెంగళరెడ్డి (జనవరి 1, 1840 - డిసెంబరు 31, 1900) 1866 కాలంలో సంభవించిన కరువు కాలంలో తన ఆస్తినంతా ధారపోసి ఎంతోమంది ప్రాణాల్ని కాపాడిన మహా దాత.

బుడ్డా వెంగళరెడ్డి
జననం
బుడ్డా వెంగళరెడ్డి

(1840-01-01)1840 జనవరి 1 జనవరి 1, 1840
మరణం1900 డిసెంబరు 31(1900-12-31) (వయసు 60)
సమాధి స్థలంఉయ్యాలవాడ
జాతీయతభారతీయుడు
తల్లిదండ్రులునల్లపురెడ్డి, వెంకటమ్మ

ఇతను కర్నూలు జిల్లా, ఉయ్యాలవాడ గ్రామంలో సంపన్న రైతు కుటుంబంలో నల్లపురెడ్డి, వెంకటమ్మ దంపతులను జన్మించాడు. ఇతడు పెద్దగా చదవకపోయినా తల్లినుండి దానగుణాన్ని దాని గొప్పదనాన్ని తెలుసుకున్నాడు.

వెంగళరెడ్డి మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. కానీ ఒక్క భార్యకు కూడా సంతానం కలుగలేదు. అందువలన తన తమ్ముని కుమారుని దత్తత తీసుకున్నారు.

1866 కాలంలో వీరి కీర్తి ప్రతిష్ఠలు విన్న పేద ప్రజలు బళ్ళారి, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల నుండి తండోపతండాలుగా ఉయ్యాలవాడ చేరి రెడ్డిగారిని ఆశ్రయించారు. వారి దీనస్థితిని అర్ధంచేసుకున్న రెడ్డిగారి ఇంట్లో ఉన్న ఆరు పుట్ల ధాన్యాన్ని గంజి కాయించి వేలాది కుటుంబాల ఆకలిని తీర్చారు. పూటకు ఎనిమిది వేలకు తక్కువ కాకుండా తిండి పెట్టారని అంచనా. వంటమనిషి గంగన్న ఆకాలంలో చేసిన సేవలకు మెచ్చిన రెడ్డిగారు అతనికొక బంగారు కడియం తొడిగి సత్కరించారు. అనంతర కాలంలో స్వగ్రామంలో పాఠశాలను నెలకొల్పి శివరామశాస్త్రి అనే పండితుని కుటుంబాన్ని పోషిస్తూ విద్యాదానం చేశారు.

ఇతని సేవలను గుర్తించి అప్పటి మద్రాసు ప్రభుత్వం విక్టోరియా బంగారు పతకాన్ని బహూకరించింది. ప్రభుత్వం ఈయన్ను ప్రొవిన్సియల్ జ్యూరీ యొక్క సభ్యునిగానూ, మద్రాసు గవర్నరు కౌన్సిల్ యొక్క గౌరవ సభ్యునిగానూ చేసి గౌరవించింది.[1] ఈ సన్మాన సభ ఢిల్లీలో 1877 జనవరి 1వ తేదీన జరిగింది. ఆ బంగారు పతకముపై క్రింది విధంగా చెక్కబడింది. "1866వ సంవత్సరంలో సంభవించిన క్షామకాలమందు, నిరాధారంగా నుండిన, తన స్వదేశస్థుల పట్ల జరిపించిన ఉత్కృష్ట ఔదార్యంనకు హర్ మైజెస్టి రాణిగారి వల్ల చేయబడిన శ్రేష్టమైన గణ్యతకు ఆనవాలుగా బుడ్డా వెంగళరెడ్డిగారికి బహుమానమివ్వబడినది."

రెడ్డిగారు ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు స్వగ్రామంలోని అగస్తేశ్వర దేవాలయంలో ఉత్సవాలు జరిపి, పండితులను సత్కరించి, అన్నదానాలు చేసేవారు.

మరణం మార్చు

మహాదాతగా పేరుగాంచిన వెంగళరెడ్డి 1900 డిసెంబరు 31న శివసాయుజ్యాన్ని పొందాడు. ఆతని కీర్తి ఆచంద్రతారార్కం నిలుస్తుంది. అతన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలు వివిధ జానపద కళలలో అతన్ని కీర్తిస్తుంటారు.

శ్రీవెంగళరెడ్డిగారి గురించిన ఐతిహ్యం మార్చు

ఒక పేదబ్రాహ్మణుడు వెంగళరెడ్డిని తన యింటిలో త్వరలో జరగనున్న శుభకార్యం నిమిత్తంగా ఏదైనా ద్రవ్యసహాయం చేయమని అర్థించాడు. రెడ్డిగారు అంగీలో చేయిపెట్టి ఒక నోటు తీసి ఇచ్చారు. అది చిన్నమొత్తం. ఆ బ్రాహ్మణుడు చిన్నబుచ్చుకున్నాడు. అది చూసి రెడ్డిగారు అర్థితో, "అయ్యా, మీ ప్రాప్తం అంతే ఉన్నది" అన్నారు. కానీ బ్రాహ్మణుడికి నమ్మకం కలుగలేదు. అప్పుడు రెడ్డిగారు తన కోడలిని పిలచి ఒక చేటలో బియ్యమూ, దానిలో గూడంగా ఆ బ్రాహ్మణుడికి ఇచ్చిన నోటుతో పాటు మరొక వందనోటును కూడా ఉంచి తీసుకొని రమ్మన్నారు. అలా ఆవిడ తెచ్చిన పిదప, బ్రాహ్మణోత్తముడు స్వయంగా చేయిపెట్టి బియ్యపుచేటలోనుండి తీసుకొంటే మొదట రెడ్డిగారు ఇచ్చిన నోటే తిరిగి లభించింది. తదుపరి, రెడ్డిగారు రెండవనోటుని బియ్యపుచేటనుండి ఆ బ్రాహ్మణుడికి వెలికి తీసి చూపి, తన వాక్యం సత్యం అని ఋజువు చూపారట.

  • ఉయ్యాలవాడ బుడ్డా వెంగళరెడ్డి గురించి నాకు తెలిసిన పూర్వీకులు చెప్పిన మాటలు చివరి దాన ధర్మములు.
  • ఒకానొక రోజు ఒక నిరుపేద బ్రాహ్మణుడు దూర ప్రాంతం నుండి తన కూతురి వివాహం కోసం కొంత డబ్బులు అవసరం పడ్డాయి అంటా, అప్పుడు దానకర్ణుడు మన బుడ్డా వెంగళరెడ్డి గురించి ఎవరో చెబుతుంటే విన్నారంటా, విని ఆయనను కలిసి తన బాధ తెలిపి ఆయనను దానం చేయమని అడగాలని నిశ్చయించుకున్నారు. పూర్వం బైకులు, కార్లు,, ఏ ఇతర సౌకర్యాలు లేవు. ఆయన కాలినడకన వచ్చి తన బాధ చెప్పుకుని తనకు కొంత డబ్బులు సహాయం చేయమని చాలా బాధపడుతూ విన్నవించాడు ఆ నిరుపేద బ్రాహ్మణుడు. అప్పుడు మీ కూతురి వివాహానికి సంబంధించిన ఖర్చులు మొత్తం డబ్బులు నీకు సహాయం చేస్తాను అని బ్రాహ్మణుడికి మాట ఇచ్చి ఫలానా రోజు రమ్మని సెలవిచ్చాడు. తర్వాత కొద్ది కాలానికి ఆ దేవుడు తనువు చాలించారు. ఆ తర్వాత కొద్దికాలానికి ఆ బ్రాహ్మణుడు కూతురి వివాహం నిశ్చయించుకున్నారు, ఆ నిరుపేద బ్రాహ్మణుడు కాలినడకన నడుస్తూ ఆ ఉయ్యాలవాడ గ్రామ సమీపానికి చేరుకున్నాడు, ఆ దారి మద్యలో ఆ దైవ స్వరుపుడూ ప్రత్యక్షం అయ్యాడు.

అప్పుడు ఏం స్వామి చాలా రోజులు తర్వాత వస్తున్నావు అని ఆ నిరుపేద బ్రాహ్మణుడిని అడిగారు, అప్పుడు ఆ బ్రాహ్మణుడు కొద్దిగా వివాహానికి ఆటంకాలు ఎదురై ఆలస్యం అయ్యింది అయ్యా గారు అని జరిగినా విషయం తెలియజేశారు. సరేలే నీ డబ్బులు ఫలానా గదిలో మూటకట్టి దంతెల మద్యలో ఉంచాను, మా కుటుంబ సభ్యులకు నేను చెప్పినాను అని చెప్పండి మీ కోసం దాచినా డబ్బులు మీకు ఇస్తారు మీరు జాగ్రత్తగా తీసుకెళ్లి సంతోషంగా మీ కుమార్తె వివాహం జరిపించండి అని తెలియజేస్తారు, ఆ దేవ దేవుడు బుడ్డా వెంగళరెడ్డి గారు.

ఆ బ్రాహ్మణుడికి ఆయన పరమాత్మను చేరుకున్న విషయం తెలియదు. బుడ్డా వెంగళరెడ్డి ఆస్థానానికి ( నివాసం ), వెళ్ళి దారి మద్యలో ఎదురై ఈ విధంగా చెప్పారు, మా కుటుంబ సభ్యులను అడగండి మీ డబ్బులు ఇస్తారు అని చెప్పారని కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెబుతాడు ఆ బ్రాహ్మణుడు, ఆ కుటుంబ సభ్యులకు ఆయన చెప్పిండడు, కాని దారిలో ఆయన చివరి దాన ధర్మం విజయవంతం కావాలి, ఆ బ్రాహ్మణుడికి ఫలితం దక్కాలని ఆయన కైలాసం నుండి బ్రాహ్మణుడి కోసం భువి కి, దిగివస్తాడు ఆ దేవుడు. జరిగిన సన్నివేశం ఒక మిస్టరీగా ఉంటుంది. ఆ తర్వాత ఆ కుటుంబ సభ్యులు డబ్బులు లేవు ఏం లేవు మాకు పోయేటప్పుడు మాకు చెప్పలేదు, నీ మాటలు మేము నమ్మమము అని బదులిస్తారు. ఆ బ్రాహ్మణుడు చాలా బాధ పడుతూ కన్నీరు మున్నీరుగా తన ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇప్పుడు ఆ డబ్బులు నేను ఇంటికి తీసుకెళ్ళక పోతే, మా కూతురి వివాహం ఆగిపోతుంది అని చాలా చాలా రోదిస్తాడు, అప్పుడు ఆ కుటుంబ సభ్యులకు ఆయన చెప్పెది నిజమేనని భావించి మళ్ళీ ఒకసారి ఆయనను అడిగి విషయం తెలుసుకోని ఆ గదిలోకి వెళ్ళి ఫలానా దంతెను తొలగించి చూస్తారు, ఆ బ్రాహ్మణుడు చెప్పినట్టుగా ఒక మూటలో భద్రపరిచిన డబ్బులు కనిపిస్తాయి, వెంటనే ఆ బ్రాహ్మణుడిని పిలిచి బాధపడకు అని సానుభూతి తెలియజేసి అ డబ్బును అ బ్రాహ్మణుడికి అందజేస్తారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నాకోసం ఆ పరమాత్మ స్వరూపుడైన బుడ్డా వెంగళరెడ్డి గారు నా కోసం అదేపనిగా వచ్చి నాకు దర్శన భాగ్యం కల్పించడూ అని చాలా చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు.

అలా ఆ దానకర్ణుడు ఇచ్చిన మాట కోసం తన ఆయన కోసం దాచిపెట్టిన దానం వృథా కాకుండా ఆ బ్రాహ్మణుడి కోసం భూవికి వచ్చి తన మాటను నిలబెట్టుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. నాకు తెలిసి ఈ కలియుగం ఉన్నంతకాలం మన హృదయాలలో ఎప్పటికీ ఆ దైవ స్వరుపుడూ చిరకాలం కలకాలం బ్రతికే ఉంటారు.

  • ఆయనను తలుచుకోని దానధర్మాలు చేస్తే చాలు ఆయన ఆశీస్సులు దీవెనలు ఎల్లప్పుడూ మనకు లభిస్తాయి.

రచయిత : గద్దె దస్తగిరిభాషజగన్ MBA Hr

మూలాలు మార్చు

  1. The State of Rayalaseema By A. Ranga Reddy పేజీ.337

దాన కర్ణుడు శ్రీ శ్రీ శ్రీ బుడ్డా వెంగళ రెడ్డి గారి భక్తుడు గురించి వివరణ మార్చు

  • ఊరూరా ఓ బుడ్డా వెంగళరెడ్డుంటే... డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి, ఆంధ్ర ప్రదేశ్ పత్రిక 2009 నవంబరు సంచికలో ప్రచురించిన వ్యాసం ఆధారంగా


  • ఊరూరా ఓ బుడ్డా వెంగళరెడ్డుంటే...
  • ఊరూరా ఓ బుడ్డా వెంగళరెడ్డుంటే... అన్నమాట ఎవరూ ఏ సమయంలో అన్నారో తెలియదు కాని ఒక ఊరిలో ఆయన భక్తుడు జన్మించారు.
  • కడప జిల్లా, యర్రగుంట్ల మండలం, పొట్లదుర్తి వెంకటాపురం గ్రామంలో గద్దె నెయ్యి దస్తగిరి - అలీమాల దంపతులకు బుడ్డా వెం‌గళ రెడ్డి ఆయన అడుగుజాడల్లో నడిచే ఆయన భక్తుడు గద్దె దస్తగిరి భాష అనే బాలుడు 19వ శతాబ్దంలో బుడ్డా వెం‌గళ రెడ్డి దేవుడి భక్తుడిగా జన్మించారు.
  • పైన తెలిపిన బుడ్డా వెంగళ రెడ్డి భక్తుడు గద్దె దస్తగిరి భాష, ఈయన MBA Hr అనే విద్యను అభ్యసించారు.
  • ఈ భక్తుడు దైవ సమానులైన బుడ్డా వెంగళ రెడ్డి భక్తుడిగా ఎవరికైనా ఏ విషయంలో అయినా మాట ఇచ్చాడంటే ఆ మాటకు కట్టుబడి ఉంటాడు.
  • తనదైనశైలిలో బుడ్డా వెంగళ రెడ్డి భక్తుడిగా ఇప్పటివరకు చాలా దాన ధర్మాలు చేశాడు
  • ఎవరైనా తన దగ్గరకు వచ్చి నువ్వు నిజంగా బుడ్డా వెంగళ రెడ్డి భక్తుడివైతే మాకు ఫలానాది ఇవ్వాలని కోరితే, లేదని చెప్పకుండా తక్షణమే వారికి తనదైనశైలిలో దానధర్మాలు చేస్తాడు ఈ భక్తుడు.
  • జరగబోయే కాలంలో బుడ్డా వెంగళ రెడ్డి భక్తుడిగా గద్దె దస్తగిరి భాష ఎన్నో మరెన్నో సేవ కార్యక్రమాలు చేయాలని, చేసేవిధంగా ఆయనకు సిరిసంపదలు అష్టైశ్వర్యాలు మనం నమ్మే దేవతలు దేవుళ్ళు కరుణా కటాక్షాలు ఆశీస్సులు దీవెనలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
  • హరి గోవిందా గోవిందా
  • శివ గోవిందా గోవిందా
  • ఓం నమో నారాయణాయ
  • ఓం నమః శివాయ