అనకాపల్లి జిల్లా శంకరం గ్రామం దగ్గర గల కొండలపై గల బౌద్ధ స్థలాలు బొజ్జన్నకొండ, లింగాలకొండ. ఇవి విశాఖపట్నం నుండి 45 కి.మీ, అనకాపల్లి నుండి కొద్ది దూరంలో గలవు. ఈ స్థలాలు సా.శ. 4 నుండి 9 శతాబ్ది మధ్యవిగా నమ్ముతారు. ఒకనాడు సంఘారము (సంఘారామము) అని పిలవబడేది. మూడు రకాల బౌద్ధ మత వర్గాలు హీనయాన, మహాయాన, వజ్రయాన బాగా వృద్ధిలో వుండేవి.[1]

కూర్చొన్న భంగిమలో గల బుద్ధ విగ్రహం

ప్రత్యేకతలు మార్చు

ఏకశిలా స్తూపాలు, కొండలో తొలచబడిన గుహలు ఇచటి ప్రత్యేకతలు. నాలుగు గుహలు ఆశ్రయ స్థలాలు. మూడింటిలో ధ్యాన బుద్ధ విగ్రహాలున్నాయి. ప్రతి గుహ ద్వారము రెండుప్రక్కల పెద్ద ద్వారపాలకుల విగ్రహాలున్నాయి. గుహ అంతర్భాగము చతుర్భుజాకారములో ఉండి పదహారు స్థంబాలతో, ఇరువది గదులతో తొలచబడింది. గుహ మధ్యలో చతురస్రాకారపు తిన్నెపై రాతిలో తొలచబడిన ఘన స్తూపము గలదు. ధ్యాన ముద్రలో గల భూమిస్పర్శ బుద్ధుని విగ్రహము బహు ఉన్నతముగా ఉంటుంది.[1]

 
బొజ్జన్నకొండలోని బుద్ధుని శిల్పం.

ప్రధాన స్తూపము రాతిలో తొలచబడి ఇటుకలతో చుట్టబడి ఉంది. బొజ్జన్నకొండపై ఇటుకలతో కట్టబడిన విహారాలు, చైత్యము. భిక్షువుల గదులు ఉన్నాయి. 1907 లో జరిగిన త్రవ్వకాలలో ఇచట పలు నాణేలు దొరికాయి. 4వ శతాబ్దపు సముద్ర గుప్తుని నాణెము, చాళుక్య రాజు కుబ్జ విష్ణువర్ధనుని, ఆంధ్ర శాతవానుల కాలము నాటి నాణేలు దొరికాయి. లింగాలకొండ అంచున రాతిలో తొలచబడిన పలు స్తూపాలున్నాయి. బౌద్ధమత వ్యాప్తితోబాటు పలు ఆరామములు, విద్యాస్థలాలు వెలిశాయి. వానిలో తొట్లకొండ, బావికొండ, పావురాలకొండ మొదలగునవి దగ్గరలోనే ఉన్నాయి. రెండు వేల సంవత్సరముల క్రితము ప్రశస్తి బొందిన ఈ ప్రదేశాలు కాలక్రమములో వాటి ప్రాభవము కోల్పోయాయి.

ఇవీ చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "Sankaram Buddhist Excavations - IndiaAirport.com". indiaairport.com. Retrieved 2023-10-05.

వనరులు మార్చు

బయటి లింకులు మార్చు

http://www.youtube.com/watch?v=qvmAjRw1-VA