బొమ్మరిల్లు (2006 సినిమా)

బొమ్మరిల్లు 2006 సంవత్సరంలో విడుదలైన చలనచిత్రం. భాస్కర్ దర్శకత్వం, దిల్ రాజు నిర్వహణలో చిత్రీకరించిన బొమ్మరిల్లులో సిద్ధార్థ్ నారాయణ్ తో జతగా జెనీలియా ప్రథమ పాత్రల్లో నటించగా ప్రకాష్ రాజ్, జయసుధ లు సిద్ధార్థ్ ధరించిన పాత్రకి తల్లితండ్రులుగా ద్వితీయ పాత్రల్లో నటించారు. ఈ సినిమా బాక్స్-ఆఫీసు సఫాలత్వం వల్లనా తమిళంలో సంతోష్ సుబ్రమణ్యం (2008) గా, బెంగాళీలో భలోబస భలోబస (2008)గా, ఒరియాలో డ్రీంగాళ్ (2009) గా రీ-మేక్ చేయబడింది.[1]

బొమ్మరిల్లు
(2006 తెలుగు సినిమా)
దర్శకత్వం భాస్కర్
తారాగణం సిద్దార్థ్
జెనీలియా
నేహా బాంబ్
జయసుధ
ప్రకాష్ రాజ్
కోట శ్రీనివాసరావు
తనికెళ్ళ భరణి
సునీల్
సత్యా కృష్ణన్
చిత్రం శ్రీను
సంగీతం దేవిశ్రీప్రసాద్
కూర్పు మార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర ఫిలిమ్స్
భాష తెలుగు

ఈ చలనచిత్రం ముఖ్యంగా తండ్రీ కొడుకుల బంధుత్వం గురించి ప్రస్తావించింది. ఇందులో కొడుకు గురించి అతిగా పట్టించుకునే తండ్రి, తండ్రి వైపు ప్రేమ, కోపం మధ్య నలిగే కొడుకు పడే ఘర్షణ ప్రముఖంగా చూపించడం జరిగింది.

అవార్డులు. ఉత్తమ చిత్రంగా బంగారు నంది పురస్కారం.

ఉత్తమ సహాయ నటుడు, ప్రకాష్ రాజ్

ఉత్తమ నటి స్పెషల్ జ్యూరీ అవార్డు, జెనీలియా

పాత్రలు-పాత్రధారులు మార్చు

బొమ్మరిల్లు చిత్ర కథ మార్చు

సిద్ధు వాళ్ళ నాన్న తనకు అవసరమైనవన్ని తన ఇష్ట ప్రకారం చేస్తున్నాను అని అనుకొంటున్నాడు. కాని సిద్ధుకి వాళ్ళ నాన్న చేసే విషయాలేమి నచ్చవు. సిద్ధు వాళ్ళ నాన్న తనకి చెప్పకుండా పెళ్ళి సంబంధం తీసుకొస్తాడు. కాని సిద్ధు హాసిని అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఈ విషయం కొన్ని రోజుల తరువాత సిద్ధు వాళ్ళింట్లో తెలుస్తుంది. సిద్ధు వాళ్ళ నాన్నకి ఈ విషయం నచ్చదు. అప్పుడు సిద్ధు హాసిని వారం రోజులు మన ఇంట్లో ఉంటే తను మనకు అనుగుణంగా అనుకూలంగా ఏలా ఉండాలో తెలుసుకుని ఆ విధంగా తాను మారుతుంది అప్పుడు మీ అందరికి సరేనా అని అంటాడు. వారం రోజుల్లో అది సాధ్యమయ్యే పని కాదు అని వాళ్ళ నాన్న అంటాడు. నేను సాధ్యమని నిరూపిస్తాను అని చెప్పి, ఆ అమ్మాయిని సిద్ధు తన ఇంటికి తీసుకొస్తాడు. సిద్ధు హాసినిని తన ఇంటికి తీసుకొచ్చిన తరువాత సిద్ధు వాళ్ళ నాన్నకి సిద్ధు గురించి కొన్ని నిజాలు తెలుస్తాయి. అప్పుడు సిద్ధు వాళ్ళ నాన్నకి తన మనస్తత్వాన్ని తండ్రి తన దగ్గర చూపించిన తీరును వివరించి చెప్తాడు. ఆ తరువాత సిద్ధు, హాసిని ఒకటవుతారు.

పాటలు మార్చు

పాట రచయిత సంగీతం గాయకులు
అపుడో ఇపుడో ఎపుడో కులశేఖర్ దేవీశ్రీ ప్రసాద్ సిద్ధార్థ్ నారాయణ్
ఉయ్ హేవ్ ఎ రోమియో చంద్రబోస్ దేవీశ్రీ ప్రసాద్ రంజిత్, ఆండ్రియా
కన్నులు తెరిచే కలగంటామని.. కానీ ఇప్పుడు భాస్కరభట్ల దేవీశ్రీ ప్రసాద్ దేవీశ్రీ ప్రసాద్
నమ్మక తప్పని నిజమైనా సిరివెన్నెల దేవీశ్రీ ప్రసాద్ సాగర్, సుమంగళి
బొమ్మని గీస్తే నీలా వుంది భాస్కరభట్ల రవికుమార్ దేవీశ్రీ ప్రసాద్ గోపికా పూర్ణిమ, జీన్స్ శ్రీనివాస్
లాలూ దర్వాజ కాడ కులశేఖర్ దేవీశ్రీ ప్రసాద్ నవీన్, మురళి, ప్రియా ప్రకాష్

మూలాలు మార్చు

  1. Namasthe Telangana (10 August 2021). "Bommarillu Movie | బ్లాక్ బాస్ట‌ర్ 'బొమ్మరిల్లు' కు 15 ఏళ్లు..క‌లెక్ష‌న్స్ ఎంతో తెలుసా..?". Archived from the original on 10 ఆగస్టు 2021. Retrieved 10 August 2021.
  2. ఈనాడు, సినిమా (18 April 2019). "ఇలా వచ్చారు.. అలా వెళ్ళారు". Archived from the original on 5 January 2020. Retrieved 5 January 2020.

బయటి లింకులు మార్చు