బోడేపూడి వెంకటేశ్వరరావు

బోడేపూడి వెంకటేశ్వరరావు (1922 - 1997 ఆగష్టు 5) కమ్యూనిష్టు నాయకుడు, మధిర శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గ మాజీ శాసన సభ సభ్యుడు.[1][2] ప్రజా ఉద్యమాలు చేశాడు.

బోడేపూడి వెంకటేశ్వరరావు
బోడేపూడి వెంకటేశ్వరరావు

బోడేపూడి వెంకటేశ్వరరావు


నియోజకవర్గం మధిర శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1922
తొండల గోపవరం, మధిర తాలుక, ఖమ్మం జిల్లా
మరణం ఆగష్టు 5, 1997
రాజకీయ పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా
జీవిత భాగస్వామి ధనమ్మ
సంతానం ఐదుగురు సంతనం
మతం indian hindu

జననం మార్చు

ఈయన సుబ్బమ్మ, సీతయ్య దంపతులకు ఖమ్మం జిల్లా మధిర తాలుక లోని తొండల గోపవరంలో 1922 లో జన్మించారు.

చిన్నతనం లోనే తండ్రి చనిపోవడంతో 1931 లో వైరా మండలం గండగలపాడు ఉన్న తన మేనమామ జంగా చిన్న నాగయ్య వద్ద పాలేరుగా చేరారు. పనిచేస్తునే పెద్దబాలశిక్ష చదివి ప్రయివేట్‌ ఉపాధ్యాయునిగా వాసిరెడ్డి వీరభద్ర రావు (సహకార సంఘంలో రాష్ట్రస్థాయి అధికారి), జంగా చంద్రశేఖర రావు (యస్‌.పి), వాసిరెడ్డి మల్లిఖార్జున రావు (ఉపాధ్యాయ రంగం), సంక్రాంతి మధుసుధన రావు (సి.పి.యం. సినియర్‌ నాయకులు), వాసిరెడ్డి విద్యాసాగర రావు, పూర్ణకంటి దేవయ్య, కిన్నెర రాఘువులు వంటి తదితరులకు చదువు చెప్పారు.

వివాహం - పిల్లలు మార్చు

20 సంవత్సరాల వయస్సులో గండగలపాడు గ్రామానికి చెందిన ధనమ్మతో వివాహమైంది. వీరికి ఐదుగురు సంతనం.[3]

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మార్చు

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొని అనేక సార్లు జైలుకు వెళ్లారు.[4][5] ఆ పోరాటంలో కొరియర్‌గా పనిచేసి రాత్రికి రాత్రి పార్టీ పత్రికను కొత్తగూడెం లోని సాయుధ దళ నాయకత్వనికి అందజేసే వారు. అంతేకాకుండా అనాటి వైరా ప్రాంతంలో ఉన్న ఖాజా రాధాకృష్ణమూర్తి, తన బావమరుదులైన దేవబత్తిని సీతయ్య, దేవబత్తిని సర్సయ్య, గుజ్జా బసవయ్య, పింగిళి ముత్తయ్యలను దళసభ్యులుగా, అయినాల వెంకయ్య, పి. ఏసోబు లను అనేక మంది యువకులను కొరియర్‌గా తయారుచేశారు.

ప్రజాసేవ మార్చు

దివిసీమ ఉప్పెన, అనంతపురం రైతు ఆత్మహత్యలు, పాలమూరు వలసలు, విశాఖ కార్మిక సమస్యలు వంటి కూలీ, కార్మిక, భూ పోరాటాలు జరిగిన చోట ప్రజలకు అండగా ఉన్నాడు.

పార్టీలో కృషి మార్చు

సి.పి.యం. పార్టీలో ఏ బాధ్యత అప్పగిస్తే దానిని సక్రమంగా నిర్వర్తిస్తూ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర్ట స్థాయి దాకా అంచలంచెలుగా ఎదిగారు. పార్టీలో నిర్మాణ సమస్యలు వచ్చినప్పుడు పార్టీ నుండి నక్సలైట్‌ ఉద్యమం, రజబ్‌ ఆలీ ముఠా పార్టీ నుండి విడిపోయినప్పుడు పార్టీ విచ్ఛిన్నం కాకుండా కాపాడాడు.

ప్రజాప్రతినిధిగా మార్చు

మధిర నియోజకవర్గానికి మూడు సార్లు పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తరువాత వరసగా 1983-93 వరకు విజయం సాధించారు. సి.పి.యం. శాసన సభ పక్షనేతగా పనిచేశారు.[3]

మరణం మార్చు

పేద కుటుంబంలో పుట్టి పాలేరుగా జీవితం ప్రారంభించి...పెద్ద బాలశిక్ష చదివి రాత్రి పాఠశాలలు నడిపి.. నిషేధాలు, నిర్బందాలు ఎదుర్కొంటున్న కమ్యూనిస్టు ఉద్యమంలో నిర్భయంగా పనిచేసి.. ప్రజా ఉద్యమాలకు అంకితమై తాను నమ్మిన కమ్యూనిస్టు ఉద్యమంలో కడదాక పనిచేసిన బోడేపూడి వెంకటేశ్వరరావు 1997 ఆగష్టు 5 న మరణించాడు.

బోడేపూడి విజ్ఞాన కేంద్రం మార్చు

చదువులో ముందుండి చదువుకోడానికి స్తోమతలేని పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉపయోగకంరగా ప్రజా నాయకుడు బోడేపూడి పేరుమీద ఏర్పాటుచేయబడిందే ఈ బోడేపూడి విజ్ఞానకేంద్రం. బోడేపూడి దీనిని జూన్ 27, 2007లో 55 మంది విద్యార్థులతో ప్రారంభించారు. ఆరోజు నుండి ఎంతోమంది విద్యార్థులు ఇందులో విద్యను అభ్యసించారు. 10 మంది విశ్రాంత ఉపాధ్యాయులు ఈ కేంద్రాన్ని పర్యవేక్షిస్తున్నారు.

దీనిలో గ్రంథాలయం కూడా ఉంది. అందులో 25వేలకు పైగా పుస్తకాలు ఉన్నాయి. పేద విద్యార్థులకు ఉచిత వైద్యంకోసం ప్రేమ్‌ చంద్‌ ప్రజా వైద్యశాల కూడా నడుపబడుతుంది. ప్రతి ఆదివారం మీకోసం అనే కార్యక్రమం ద్వారా అనేక విజ్ఞాన, వినోద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల అభిరుచికి తగ్గట్టుగా శాస్త్రీయ, జానపద తదితర విభాగాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ విజ్ఞాన కేంద్రం ద్వారా శిక్షణ పొందిన విద్యార్థులు రేపటి పౌరులుగా ఎదిగి సమాజంలోని అసమానతలను తొలగించడానికి వారి వంతు కృషి చేయడమే బోడేపూడి విజ్ఞాన కేంద్రం లక్ష్యం.

చిత్రమాలిక మార్చు

మూలాలు మార్చు

  1. నవ తెలంగాణ, రాష్ట్రీయం (6 August 2015). "ప్రజా నాయకుడు..బోడేపూడి". Archived from the original on 5 మార్చి 2016. Retrieved 2 May 2021.
  2. Bonthu Rambabu (5 August 2020). "Rythhu Bandhavudu Bodepudi". Khammam: Nava Telangana.
  3. 3.0 3.1 Vanam Venkateswarlu (5 August 1998). "Rythu Udyamala Pennidi - Bodepudi" (in Telugu). Khammam: Vartha.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  4. "Comrade Bodepudi Pratyakanubandam". Khammam: Prajasakhti. 5 August 1998.
  5. "Kalahrudayudu, Sahithi Priyudu Bodepudi" (in Telugu). Vijayawada: Prajasakthi. 5 August 1998. p. 5.{{cite news}}: CS1 maint: unrecognized language (link)