భారతదేశంలో మహిళలు

కొన్ని సహస్రాబ్దులుగా భారతదేశంలో మహిళల పాత్ర అనేక గొప్ప మార్పులకు లోనౌతూ వచ్చింది.[4][5] ప్రాచీన కాలంలో[6] పురుషులతో సమాన స్థాయి కలిగివున్న భారతీయ మహిళలు మధ్యయుగంలో అధమ స్థాయికి అణచబడటం, అనేకమంది సంఘ సంస్కర్తలు తిరిగి వారికి సమాన హక్కుల కల్పన కోసం కృషి చేయడం, ఇలా భారతదేశంలో మహిళల చరిత్ర అనేక సంఘటనల సమాహారంగా ఉంది. ఆధునిక భారతదేశంలో మహిళలు దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్‌సభ సభాపతి, ప్రతిపక్ష నాయకురాలు వంటి అత్యున్నత పదవులను అలంకరించారు. భారతదేశపు ఇటీవలి రాష్ట్రపతి కూడా ఒక మహిళే.

భారతదేశంలో మహిళలు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గోధుమ పంట పండిస్తున్న స్త్రీ
లింగ అసమాన్యత సూచి-2017[2]
విలువ0.524 (2017)
స్థాయి సూచి160 లో 127[1]
పురిటి మరణాలు (100,000 కు)174
చట్టసభలలో మహిళలు14.5%
సెకండరీ స్థాయి విద్య నేర్చిన 25 సంవత్సరాల వయస్సు మీరిన మహిళలు39% [M: 63.5%]
శ్రామికబలంలో మహిళలు27.2% [M: 78.8%]
ప్రపంచ లింగ సమాన్యత నివేదిక[3]
విలువ0.665 (2018)
స్థాయిసూచి108th 153లో

చరిత్ర మార్చు

మహిళల పాత్ర గురించి ప్రత్యేకంగా చర్చించిన రచనలు చాలా తక్కువ. దీనికి ముఖ్యమైన మినహాయింపు త్రయంబక యజ్వ స్త్రీ ధర్మపద్ధతి. అతను తంజావూరులో సుమారుగా 1730 కాలంలో ప్రభుత్వ అధికారిగా పనిచేశాడు. ఈ రచన అపస్తంబ సూత్ర సమయం నుంచి స్త్రీ ప్రవర్తన మీద ఆక్షేపణలను కూర్చింది (సా.పూ. 4వ శతాబ్దం).[7] ప్రారంభ పాదం కింది విధంగా సాగుతుంది:

ముఖ్యో ధర్మః స్మ్రితిషు విహితో భర్త్రు శుశ్రుషాణం హి:
స్త్రీకి ఆమె భర్త సేవ ప్రాథమిక కర్తవ్యంగా విధించబడింది.

శుశ్రూష అనే పదం (నిజార్థం. "వినాలనే కోరిక") విస్తృత అర్థాలను కలిగి ఉంది. భగవంతునికి భక్తుడు చేసే ప్రణామాల నుంచి బానిస సేవల వరకు అనేక అర్థాలు దీని పరిధిలోకి వస్తాయి.[8]

ప్రాచీన భారతదేశం మార్చు

ప్రాచీన భారతదేశంలో మహిళలు జీవితపు అన్ని విభాగాలలో పురుషులతో సమాన హోదా అనుభవించారని పరిశోధకుల అభిప్రాయం.[9][10] అయితే దీనికి భిన్నమైన అభిప్రాయం వెలిబుచ్చిన వారూ ఉన్నారు. పతంజలి, కాత్యాయనుడు వంటి ప్రాచీన భారత వ్యాకరణకర్తల రచనల ప్రకారం, వేదకాలపు[11][12] ఆరంభంలో మహిళలు చదువుకోనేవారని తెలుస్తోంది. ఆ సమయంలో మహిళలు యుక్తవయస్సులో పెళ్ళి చేసుకోనేవారని, వారు భర్తను ఎన్నుకొనే హక్కుని కలిగి ఉండేవారని ఋగ్వేద శ్లోకాలు తెలుపుతున్నాయి.[13] ఋగ్వేదం, ఉపనిషత్తుల వంటి గ్రంథాలు అనేక మహిళల గురించి, ముఖ్యంగా గార్గి, మైత్రేయి వంటి, ఋషులు, ద్రష్టల గురించి తెలుపుతున్నాయి.[14]

ప్రాచీన భారతంలో కొన్ని రాజ్యాలు నగరవధు ("పట్టణపు వధువు") వంటి సంప్రదాయాలను కలిగిఉండేవి. మహిళలు నగరవధు శీర్షికని గెలుచుకోవడానికి పోటీపడుతుండేవారు. ఆమ్రపాలి నగరవధుకి మంచి ఉదాహరణ.

అధ్యయనాల ప్రకారం వేదకాలపు ఆరంభంలో మహిళలు సమాన హోదా, హక్కులను అనుభవించేవారు.[15] ఏమైనా తరువాత (సుమారుగా 500 బి.సి.) స్మృతులతో మహిళల హోదా తగ్గడం మొదలయ్యింది (ముఖ్యంగా. మనుస్మృతి)[ఆధారం చూపాలి], బాబర్ వంటి ఇస్లాం రాజుల ఆక్రమణలు, మొఘల్ సామ్రాజ్యం తరువాత క్రైస్తవ మతం మొదలైనవి మహిళల స్వేచ్ఛను, హక్కులను హరించాయి.

జైన మతం వంటి విప్లవాత్మక ఉద్యమాలు మహిళలను మతపరమైన కార్యక్రమాలకి అనుమతించినప్పటికీ, మహిళలు ఎక్కువగా నిర్బంధాన్ని, ఆంక్షలనూ ఎదుర్కొన్నారు.[15] బాల్యవివాహ సంప్రదాయం సుమారుగా ఆరవ శతాబ్దంలో ప్రారంభమయి ఉంటుందని భావిస్తున్నారు.[16]

మధ్యయుగ కాలం మార్చు

 
మొఘల్ రాజకుమారి జహనారా

మధ్యయుగ[10] సమాజంలో మహిళల స్థాయి ఇంకా దిగజారింది. కొన్ని వర్గాలలో సతీసహగమనం, బాల్య వివాహాలు, విధవా పునర్వివాహాల నిషేధం వంటివి భారతదేశంలోని కొన్ని వర్గాల సామాజిక జీవనంలో భాగమయ్యాయి. భారత ఉపఖండంపై ముస్లిం ఆక్రమణ, భారతీయ సమాజంలో పరదా ఆచారాన్ని తెచ్చింది. రాజస్థాన్ రాజపుత్రులలో జౌహర్ ఆచారం ఉండేది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో దేవదాసీలు లేదా ఆలయ స్త్రీలు లైంగికంగా వేధింపుకు గురయ్యేవారు. హిందూ క్షత్రియ రాజులలో బహుభార్యాత్వం విస్తృత వ్యాప్తిలో ఉండేది.[16] చాలా ముస్లిం కుటుంబాలలో మహిళలు జెనానా ప్రాంతాలకి మాత్రమే పరిమతమయ్యేవారు.

ఈ పరిస్థితుల మధ్య కూడా కొంత మంది మహిళలు రాజకీయ, సాహిత్యం, విద్య, మత రంగాలలో రాణించారు. రజియా సుల్తానా ఢిల్లీని పరిపాలించిన ఏకైక మహిళా చక్రవర్తి. గోండు రాణి దుర్గావతి పదిహేనేళ్ళు పరిపాలన సాగించింది. ఆమె మొఘల్ చక్రవర్తి అక్బర్ సైన్యాధిపతి అసఫ్ ఖాన్‌తో జరిగిన 1564 యుద్ధంలో ప్రాణాలు కోల్పోయింది. అక్బర్ యొక్క గొప్ప మొఘల్ సైన్యాన్ని 1590లో చాంద్ బీబీ ఎదుర్కొని అహ్మద్ నగర్‌ను రక్షించింది. జహంగీర్ భార్య నూర్జహాన్ సార్వభౌమ అధికారాన్ని ప్రతిభావంతంగా చెలాయించి మొఘల్ మకుటం వెనుక ఉన్న నిజమైన శక్తిగా గుర్తింపు పొందింది. మొఘల్ యువరాణులు జహనారా, జేబున్నీసాలు మంచి పేరున్న రచయిత్రులు. వీరు పరిపాలనను కూడా ప్రభావితం చేశారు.[ఆధారం చూపాలి] శివాజీ తల్లి జిజియాబాయి యోధురాలిగాను, పాలకురాలిగానూ చాటుకున్న సమర్థత వలన సమర్ధురాలైన రాణిగా, మంచి తల్లిగా గణుతి కెక్కింది. దక్షిణ భారతంలో చాలామంది మహిళలు గ్రామాలు, పట్టణాలు, మండలాలను పాలించారు. అనేక సామాజిక, మత సంస్థలకు ఆద్యులయ్యారు.[16]

భక్తి ఉద్యమం మహిళల హోదాని తిరిగి నిలపడానికి ప్రయత్నించి కొన్ని రకాల అణిచివేతలను అడ్డుకుంది.[15] మీరాబాయి అనే ఒక మహిళా సాధు కవయిత్రి భక్తి ఉద్యమపు ముఖ్య వ్యక్తులలో ఒకరు. ఈ కాలపు ఇతర మహిళా సాధు-కవయిత్రులు అక్క మహాదేవి, రామి జనాభాయి, లాల్ దేడ్. భక్తి హిందూ మతానికి మాత్రమే పరిమితమైనది, మహానుభవ్, వర్కారి ఇంకా అనేక ఇతర అంశాలు హిందూ మతంలోని నియమ ఉద్యమాలు, ఇవి స్త్రీ, పురుషుల మధ్య ఉన్న సామాజిక న్యాయాన్ని, సమానత్వాన్ని బహిరంగంగా చర్చించేవి.

భక్తి ఉద్యమం వెంటనే సిక్కుల మొదటి గురువు గురునానక్ కూడా స్త్రీ, పురుషుల మధ్య సమానత్వాన్ని గురించిన సందేశాన్ని బోధించారు. ఆయన స్త్రీలు కూడా మతపరమైన సమావేశాలు నిర్వహించడం లోను, గుడిలో కీర్తన లేదా భజనలు అని పిలువబడే గీతాలని పాడడం, నిర్వహించడం లోను; మత నిర్వాహక కమిటీలలో సభ్యులవడం లోను; యుద్ధరంగంలో సైన్యాన్ని నడపడం లోను; పెళ్ళి, అమ్రిత్‌లలోనూ సమానత్వం ఉండాలని సూచించారు. ఇతర సిక్కు గురువులు కూడా మహిళా వివక్షకి వ్యతిరేకంగా ప్రబోధించారు.🌷

చారిత్రక ఆచారాలు మార్చు

ఆధునిక భారతంలో కొన్ని వర్గాలలోని సతీసహగమనం, జౌహర్, దేవదాసివంటి ఆచారాలు నిషేధించబడ్డాయి, ఎక్కువగా నశించిపోయాయి. అయినప్పటికీ భారతదేశంలోని మారుమూల ప్రాంతాలలో ఈ ఆచారాలు ఇప్పటికీ ఉన్నాయి.[ఆధారం చూపాలి] కొన్ని వర్గాల భారతీయ మహిళలు పరదా సంప్రదాయాన్ని ఇంకా పాటిస్తున్నారు, ముఖ్యంగా భారతీయ చట్టాల క్రింద చట్టవ్యతిరేక చర్యలయినప్పటికీ బాల్యవివాహాలు ఇంకా కొనసాగుతున్నాయి[ఆధారం చూపాలి].

సతీసహగమనం
సతీసహగమనం ప్రాచీనమైన ఆచారం. చాలావరకు ఇది అంతరించి పోయింది. మరణించిన భర్త చితిపై సజీవంగా, స్వచ్ఛందంగా తగలబడిపోవడమే సతీసహగమనం. ఇది స్వచ్ఛంద నిర్ణయం వలే కనిపించినప్పటికీ కొన్నిసార్లు ఇది బలవంతంగా చేయించే కార్యక్రమంగా ఉండేది. 1829లో బ్రిటీష్ వారు ఈ ఆచారాన్ని నిషేధించారు. స్వతంత్రం వచ్చినప్పటినుంచి దాదాపు 40 సతీసహగమనం కేసులు నమోదయ్యాయి.[17] 1987లో రాజస్థాన్కి చెందిన రూప్ కన్వర్ కేసు సతీసహగమనం కమీషన్ (నివారణ) చట్టానికి దారితీసింది.[18]
జౌహర్
జౌహర్ అంటే ఓడిపోయిన వీరుడి భార్యలు, కూతుళ్ళు శత్రువులకు దొరికి వేధింపులకి గురి కాకుండా తమంతట తామే సొంతగా బలయిపోవడం. ఈ ఆచారం అధిక స్థాయి గౌరవాన్ని పొందే రాజపుత్ర రాజులూ ఓడిపోయినపుడు వారి భార్యలు పాటించేవారు.
పరదా
పరదా అంటే కొన్ని వర్గాలలో మహిళలు వారి దేహాన్ని కనపడకుండా కప్పుకొనే అవసరం గల ఆచారం. కొన్ని ప్రాంతాలలో ఇది స్వచ్చందంగా పాటించినా, కొన్ని ప్రాంతాలలో ఆంక్షలని విధిస్తుంది, వారు స్వేచ్చగా అందరితో మసలే హక్కుని హరిస్తుంది, బురఖా అనేది ఇస్లాం మత ఆచారాలకు గుర్తు , ఇది మతపరమైన ఆంక్షలను విధిస్తుంది. ఇది సాధారణ నమ్మకానికి విరుద్ధం అయినప్పటికీ ఇరుపక్షాల మతగురువుల అహంకారం వలన, అజ్ఞానం వలనా దురభిప్రాయం ఏర్పడింది.
దేవదాసిలు
దేవదాసి అనేది దక్షిణ భారతావనిలో కొన్నిచోట్ల ఉన్న మతాచారం, ఇందులో స్త్రీలు గుళ్ళో దేవుడిని "పెళ్ళి" చేసుకుంటారు. వీరు దేవాలయ సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండేవారు. గాన, నృత్య, వినోద కళలందు శిక్షణ పొంది ఉందేవారు. ఈ దేవదాసి సాంప్రదాయం ఎ.డి. 10వ శతాబ్దానికి బాగా వ్యాప్తిలోకి వచ్చింది.[19] తరువాతి కాలంలో భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో దేవదాసీల మీద చట్టవిరుద్ధమైన లైంగిక వేధింపులు సహజమయ్యాయి. ఆధునిక కాలంలో ఈ దేవదాసి వ్యవస్థ రద్దు జరిగినది.

బ్రిటీష్ పాలన మార్చు

యూరోపియన్ పరిశోధకులు 19వ శతాబ్దపు హిందూ స్త్రీలు మిగతా స్త్రీలకంటే "సహజంగా శీలవంతులు", "ఎక్కువ ధర్మపరులు" అని గమనించారు.[20] బ్రిటిషు పాలన సమయంలో రామ్ మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, జ్యోతిరావు ఫులే మొదలైన సంఘసంస్కర్తలు మహిళా అభ్యున్నతికి పోరాడారు. ఈ పట్టికని చూస్తే ఇందులో బ్రిటిషువారికి ప్రమేయమేమీ లేదని అనిపించవచ్చు. కానీ అది పూర్తిగా నిజం కాదు. మార్తా మౌల్ట్ నే మీడ్ అనే మిషనరీ భార్య, ఆవిడ కూతురు ఎలిజా కాల్డ్వెల్ నే మాల్ట్ లను దక్షిణ భారతావనిలో అమ్మాయిలకు విద్య అందించి, శిక్షణ ఇప్పించారు.[ఆధారం చూపాలి] ఈ చర్య సంప్రదాయానికి వ్యతిరేక చర్యగా మొదట్లో కొంత స్థానిక నిరసనని ఎదుర్కొంది. రాజా రామ్మోహన్ రాయ్ ప్రయత్నాలు 1829లో గవర్నర్-జనరల్ విలియం కావెండిష్-బెంటింక్ అధ్వర్యంలో సతీసహగమనం నిర్మూలించబడడానికి కారణమయ్యాయి. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, వేరేశలింగం పంతులు వంటి వారు విధవల పరిస్థితిలో మార్పుకు చేసిన ఉద్యమం 1856 విధవ పునర్వివాహ చట్టానికి దారితీసింది. పండిత రమాబాయి వంటి చాలామంది మహిళా సంస్కర్తలు కూడా మహిళా అభ్యున్నతికి కృషి చేసారు.

కర్ణాటకలోని కిట్టుర్ రాజ్య రాణి కిట్టుర్ చెన్నమ్మ బ్రిటిషువారి కాలదోషం పట్టిన సిద్ధాంతాలకి ప్రతిస్పందనగా వారికీ వ్యతిరేకంగా సైన్యాన్ని నడిపించింది. తీరప్రాంత కర్ణాటక రాణి అబ్బక్క రాణి యురోపియన్ సైన్యాల ఆక్రమణలకి ముఖ్యంగా 16వ శతాబ్దంలో పోర్చుగీసు ఆక్రమణలకి ఎదురునిలిచింది. రాణి లక్ష్మీ బాయి ఝాన్సీ రాణి బ్రిటిషువారికి వ్యతిరేకంగా 1857 భారతీయ తిరుగుబాటుని నడిపించింది. ఆమె నేడు జాతీయ హీరోగా భావించబడుతున్నది. అవద్ సహా-పాలకురాలు బేగం హజ్రత్ మహల్ 1857 తిరుగుబాటును నడిపించిన ఇంకో పాలకురాలు. ఈమె బ్రిటిషువారితో ఒప్పందాలని నిరాకరించి తరువాత నేపాల్ కి వెళ్ళిపోయింది. ఈసమయపు గుర్తించదగిన స్త్రీ పాలకులలో భోపాల్ బేగాలు కొందరు. వారు పరదా పద్ధతిని పాటించేవారుకాదు ఇంకా యుద్ధకళలలో శిక్షణ పొందారు.

చంద్రముఖి బసు, కాదంబినీ గంగూలీ, ఆనంది గోపాల్ జోషి వంటివారు డిగ్రీలు పొందిన తొలితరం భారతీయ మహిళలలో కొందరు.

1917లో మొదటి మహిళా సభ్య బృందం స్టేట్ సెక్రటరీని కలిసి మహిళలకు రాజకీయ హక్కులను డిమాండ్ చేసింది. వీరికి భారత జాతీయ కాంగ్రెస్ మద్దతు పలికింది. 1927లో పూణేలో అఖిల భారత మహిళా విద్యా సదస్సు జరిగింది.[15] 1929లో బాల్యవివాహ నియంత్రణ చట్టం అమలులోకి వచ్చింది, ఇందులో మహమ్మద్ ఆలీ జిన్నా ప్రయత్నాలతో వివాహ కనీస వయస్సు పద్నాలుగేళ్ళుగా ఏర్పాటు చేసారు.[15][21] మహాత్మా గాంధీ పదమూడేళ్ళకే పెళ్ళి చేసుకున్నప్పటికీ, ప్రజలను బాల్యవివాహాలను బహిష్కరించాలని పిలుపునిచ్చి యువకులను బాల విధవలను పెళ్ళి చేసుకోవలసిందిగా ప్రోత్సహించాడు.[22]

మహిళలు భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్యపాత్ర పోషించారు. కొంతమంది ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధురాళ్ళు భికాజి కామా, డా. అనీ బిసెంట్, ప్రీతిలత వడ్డేదార్, విజయలక్ష్మి పండిట్, రాజకుమారి అమ్రిత్ కౌర్, అరుణ అసఫ్ ఆలీ, సుచేత కృపలానీ, కస్తుర్బా గాంధీ. ముత్తులక్ష్మీ రెడ్డి, దుర్గాబాయి దేశ్ముఖ్ మొదలైనవారు.

సుభాష్ చంద్ర బోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ, లక్ష్మీ సెహగల్ని కెప్టన్‌గా, మొత్తం మహిళలతో కూడిన ది రాణి అఫ్ ఝాన్సీ రెజిమెంట్ ను ఏర్పాటు చేసింది. కవయిత్రి, స్వాతంత్ర్య సమర యోధురాలూ అయిన సరోజినీ నాయుడు, భారత జాతీయ కాంగ్రెసుకు అధ్యక్షురాలైన మొదటి భారతీయ మహిళ. భారతదేశంలో ఒక రాష్ట్రానికి గవర్నరయిన మొదటి మహిళ కూడా.

స్వతంత్ర భారతదేశం మార్చు

నేటి భారతీయ మహిళ విద్య, రాజకీయాలు, మీడియా, కళలు, సంస్కృతీ, సేవా విభాగాలు, విజ్ఞాన, సాంకేతిక రంగాలు వంటి అన్ని రంగాలలో పాల్గొంటోంది. పదిహేనేళ్ళపాటు భారతదేశపు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరా గాంధీ ప్రపంచంలో ప్రధానమంత్రిగా ఎక్కువకాలం పని చేసిన మహిళ.[23]

భారతదేశపు రాజ్యాంగం భారతీయ మహిళలందరికీ సమానత్వం (ఆర్టికల్ 14), రాష్ట్రాలనిబట్టి ఎటువంటి వివక్షా చూపించకుండా ఉండడం (ఆర్టికల్ 15 (1) ), అవకాశంలో సమానత్వం (ఆర్టికల్ 16), సమాన పనికి సమాన జీతం (ఆర్టికల్ 39 (డి) ) మొదలైన హామీల నిస్తున్నది. రాష్ట్రాలు స్త్రీలకు, పిల్లలకు ప్రత్యేక సదుపాయాలను అందించే వీలు కలుగజేస్తుంది (ఆర్టికల్ 15 (3)). మహిళల గౌరవానికి భంగం కలిగించే చర్యలను త్యజించాలని (ఆర్టికల్ 51 (ఎ) ) సూచిస్తోంది. అలాగే స్త్రీలకు ప్రసూతి సెలవలు ఇవ్వడానికి, వారికి అవసరమైన సదుపాయాలు కల్పించడాన్ని అనుమతిస్తుంది. (ఆర్టికల్ 42).[24]

1970 చివరిలో భారతదేశంలో స్త్రీవాద ఉద్యమం ఊపందుకుంది. మహిళా సంఘాలను దగ్గరికి చేర్చిన జాతీయ స్థాయి సమస్యలలో మొదటిది, మథుర రేప్ కేసు. మథుర అనే అమ్మాయిని పోలిసు స్టేషన్లో రేప్ చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులను విడుదల చేయడం 1979-1980లో విస్తృతంగా నిరసనలను ఎదుర్కొంది. జాతీయ మీడియా ద్వారా నిరసనలకు విస్తృత ప్రాచుర్యం లభించింది. ఇవి ఎవిడెన్స్ చట్టం, క్రిమినల్ ప్రోసిజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్ లలో కస్టోడియల్ రేప్ అనే అంశాన్ని చేర్చాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వాలకు కలిగించాయి.[24] ఆడ శిశు భ్రూణ హత్యలు, లింగ వివక్ష, మహిళా ఆరోగ్యం, స్త్రీ అక్షరాస్యతవంటి అంశాలమీద మహిళా ఉద్యమకారులు ఏకమయ్యారు.

ఆల్కహాలిజం తరచుగా భారతదేశంలో మహిళలమీద హింసతో ముడిపడి ఉండటంతో[25] అనేక మహిళా సంఘాలు మద్యపాననిషేధ ప్రచారాన్ని ప్రారంభించాయి. ఆంధ్ర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఒడిషా, మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలలో కూడా మొదలుపెట్టారు.[24] చాలామంది ముస్లిం మహిళలు షరియత్ చట్టం క్రింద స్త్రీల హక్కులగురించి మూలసిద్ధాంత నాయకుల అభిప్రాయాన్ని ప్రశ్నించి మూడుసార్లు తలాక్ చెప్పే పద్ధతిని విమర్శించారు.[15]

1990లో విదేశీ దాతల ఏజన్సీలద్వారా నిధులతో క్రొత్త మహిళా-సంబంధిత NGOలు ఏర్పడ్డాయి. సెల్ఫ్-ఎంప్లాయ్డ్ వుమెన్స్ అసోసియేషన్ (SEWA) వంటి స్వీయ-సహాయ గ్రూపులు, NGOలు భారతదేశంలో మహిళల హక్కులలో ప్రధానపాత్ర పోషించాయి. చాలామంది మహిళలు స్థానిక ఉద్యమాలలో నాయకురాళ్ళుగా అవతరించారు. ఉదాహరణకి నర్మదా బచావో ఆందోళనకి సంబంధించి మేధా పాట్కర్.

భారత ప్రభుత్వం 2001 సంవత్సరాన్ని మహిళా సాధికార సంవత్సరం - స్వశక్తిగా ప్రకటించింది.[15] మహిళా అధికార జాతీయ విధానం 2001లో అమల్లోకి వచ్చింది.[26]

2006లో ఇమ్రానా అనే ముస్లిం రేప్ బాధితురాలు మీడియాలో ఎక్కువ ప్రచారం పొందింది. ఇమ్రానా తన మామ చేతిలో అత్యాచారానికి గురయ్యింది. కొంతమంది ముస్లిం పెద్దలు ఇమ్రానా తన మామని పెళ్ళి చేసుకోవాలని తీర్పు ఇవ్వడం తీవ్ర నిరసనలకు దారితీసింది. చివరికి ఇమ్రానా మామకి 10 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ఈతీర్పును అనేక మహిళా సంఘాలు, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డూ స్వాగతించాయి.[27]

2010 మార్చి 9న అంతర్జాతీయ మహిళా దినోత్సవం తరువాతి రోజు రాజ్యసభ మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించింది, ఇది పార్లమెంటులోను, రాష్ట్ర శాసనసభల్లోనూ మహిళలకు 33% రిజర్వేషన్ను అందిస్తుంది.[28]

కాలపట్టిక మార్చు

వారి స్థాయిలలో స్థిర మార్పును ఈదేశంలో మహిళలు సాధించినదానినిబట్టి గుర్తించవచ్చు:

  • జాన్ ఇలియట్ డ్రింక్ వాటర్ బెతూనే 1849లో బెతూనే స్కూల్ ప్రారంభించింది, ఇది 1879లో బెతూనే కళాశాలగా వృద్ధి చెంది భారతదేశంలో మొదటి మహిళా కళాశాల అయింది.
  • 1883: చంద్రముఖి బసు, కాదంబినీ గంగూలీ బ్రిటిషు సామ్రాజ్యపు మొదటి మహిళా పట్టభధ్రులయ్యారు.
  • కాదంబినీ గంగూలీ, ఆనందీ గోపాల్ జోషి భారతదేశమునుండి పాశ్చాత్యవైద్యంలో శిక్షణ పొందిన మొదటి మహిళలు.
  • 1905: సుజన్నే ఆర్ డి టాటా కారు నడిపిన మొదటి భారతీయ మహిళ.[29]
  • 1916: 1916 జూన్ 2న సంఘసంస్కర్త దొండో కేశవ్ కార్వేగారి చేత కేవలం ఐదుమంది విద్యార్థులతో మొదటి మహిళా విశ్వవిద్యాలయం SNDT మహిళా విశ్వవిద్యాలయం స్థాపించబడింది.
  • 1917: అన్నే బిసెంట్ భారత జాతీయ కాంగ్రెస్కు మొదటి మహిళా అధ్యక్షురాలయింది.
  • 1919: ఆమె విలక్షణమైన సామజిక సేవకు గుర్తింపుగా పండిత రమాబాయి బ్రిటీష్ రాజ్ నుంచి కైజర్-ఇ-హింద్ పురస్కారం పొందిన మొదటి మహిళ.
  • 1925: సరోజినీ నాయుడు భారత జాతీయ కాంగ్రెస్కి భారతదేశంలో పుట్టిన మొదటి మహిళా అధ్యక్షురాలు.
  • 1927: ఆల్ ఇండియా వుమెన్స్ కాన్ఫరెన్స్ ఏర్పాటుచేయబడింది.
  • 1944: భారతీయ విశ్వవిద్యాలయంనుంచి సైన్స్ డాక్టరేట్ అందుకున్న మొదటి మహిళ అసిమా చటర్జీ.
  • 1947: 1947 ఆగస్టు 15 స్వతంత్రం తరువాత సరోజినీనాయుడు యునైటెడ్ ప్రావిన్సులకి గవర్నర్ అయింది, ఈవిడ భారతదేశపు మొదటి మహిళ గవర్నరు.
  • 1951: డెక్కన్ ఎయిర్వేస్ కు చెందినా ప్రేమ మాథుర్ భార్తదేశపు మొదటి మహిళా వాణిజ్య పైలట్.
  • 1953: విజయలక్ష్మి పండిట్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి మొదటి మహిళా (మొదటి భారతీయ) అధ్యక్షురాలు.
  • 1959: అన్నా చండీ హైకోర్టుకి మొదటి మహిళా జడ్జ్ (కేరళ హై కోర్టు) [30]
  • 1963: సుచేత కృపలానీ ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అయి, భారతదేశంలోని ఏరాష్ట్రంలోనైనా ఆస్థాయిని పొందిన మొదటి మహిళ అయ్యారు.
  • 1966: కేప్టన్ దుర్గ బెనర్జీ ఒక రాష్ట్ర ఎయిర్లైన్స్, ఇండియన్ ఎయిర్లైన్స్ కి పైలట్ అయిన మొదటి భారతీయ మహిళ.
  • 1966: కమలాదేవి చటోపాధ్యాయ వర్గ నాయకత్వానికిగానూ రామన్ మెగాసస్సే పురస్కారం గెలుచుకున్నారు.
  • 1966: ఇందిరాగాంధీ భారతదేశపు మొదటి మహిళా ప్రధానమంత్రి.
  • 1970: కమల్జిత్ సందు ఏషియన్ గేమ్స్ లో బంగారు పతకం గెలుచుకున్న మొదటి భారతీయ మహిళ.
  • 1972: కిరణ్ బేడి ఇండియన్ పోలీస్ సర్వీస్ కి ఎన్నికయిన మొదటి మహిళా అభ్యర్థి.[31]
  • 1979: మదర్ థెరిస్సా నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళా పౌరురాలు.
  • 1984: మే 23న బచేంద్ర పాల్ మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించిన మొదటి మహిళ అయ్యారు.
  • 1989: జస్టిస్ ఎం.ఫాతిమా బీవీ సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియాకి మొదటి మహిళా జడ్జ్ గా ఎన్నికయ్యారు.[32]
  • 1997: కల్పనా చావ్లా గగనంలోకి వెళ్ళిన మొదటి భారత జన్మిత మహిళ.[33]
  • 1992: ప్రియా ఝింగాన్ ఇండియన్ ఆర్మీలో చేరిన మొదటి మహిళా కాడేట్ (తరువాత 1993 మార్చి 6 నుంచి చేర్చుకోవడం మొదలుపెట్టారు) [34]
  • 1994: హరితా కౌర్ డియోల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) లో మొదటి మహిళా పైలట్, ఒంటరి పైలట్.
  • 2000: కరణం మల్లీశ్వరి ఒలంపిక్ పతకం సాధించిన మొదటి మహిళ (2000 సిడ్నీ సమ్మర్ ఒలంపిక్స్ లో కాంస్య పతకం)
  • 2002: లక్ష్మీ సెహగల్ భారతదేశ అధ్యక్ష పదవికి పోటీపడ్డ మొదటి మహిళ.
  • 2004: పునీత అరోరా ఇండియన్ ఆర్మీలో అత్యధిక స్థాయి ల్యూటినేంట్ జనరల్ స్థాయిని అందుకున్న మొదటి మహిళ.
  • 2007: ప్రతిభా పాటిల్ భారతదేశపు మొదటి మహిళా అధ్యక్షురాలు.
  • 2009: మీరా కుమార్ ఇండియన్ పార్లమెంట్ దిగువసభ లోక్ సభకి మొదటి మహిళా స్పీకర్
  • 2014:సుమిత్రా మహాజన్ లోక్ సభ స్పీకర్ గా ఎంపికైంది.

సంస్కృతి మార్చు

చీర, సల్వార్ కమీజులు మొత్తం భారతదేశపు మహిళల సామాన్య వస్త్రధారణ. బొట్టు మహిళల అలంకరణలో భాగం. సాంప్రదాయకంగా ఎర్ర బొట్టు, సిందూరం కేవలం వివాహిత హిందూ స్త్రీలు ధరిస్తారు, కానీ నేడు మహిళల శైలిలో భాగమయ్యింది.[35] . పాశ్చాత్య ప్రభావం, ఆర్థిక స్వేచ్ఛ వలన నేడు భారతీయ స్త్రీలు శరీరాన్ని అతుక్కుని ఉండే దుస్తులు, స్లీవ్‌లెస్, షార్ట్ స్కర్లు, జీన్ ప్యాంట్లు కూడా ధరిస్తున్నారు. ముగ్గు (లేదా కోలం) భారతీయ మహిళలలో బాగా ప్రాచుర్యం చెందిన సాంప్రదాయక కళ.

విద్య, ఆర్థికాభివృద్ధి మార్చు

1992-93 అంకెల ప్రకారం భారతదేశంలో కేవలం 9.2% ఇళ్ళు మాత్రమే స్త్రీలో అధ్వర్యంలో నడుస్తున్నాయి. ఏమైనా దారిద్ర్యరేఖకి దిగువున ఉన్న ఇళ్ళు సుమారు 35% వరకూ స్త్రీల అధ్వర్యంలో నడుస్తున్నాయి.[36]

విద్య మార్చు

భారతదేశంలో మహిళల అక్షరాస్యతా రేటు క్రమంగా పెరుగుతున్నప్పటికీ, పురుషుల అక్షరాస్యత రేటుకంటే తక్కువగా ఉంది. అబ్బాయిలతో పోలిస్తే చాలా తక్కువమంది అమ్మాయిలు బడులలో చేరుతున్నారు. వారిలో చాలామంది మధ్యలోనే మానేస్తున్నారు.[24] 1997 నేషనల్ సాంపిల్ సర్వే డేటా ప్రకారం కేవలం కేరళ, మిజోరాం రాష్ట్రాలు మాత్రమే ప్రపంచ మహిళా అక్షరాస్యతా శాతాన్ని చేరుకున్నాయి. అధికశాతం పరిశోధకుల ప్రకారం కేరళలో పెరిగిన మహిళల సామాజిక, ఆర్థిక హోదాలకు ప్రధాన కారణం, అక్షరాస్యతే.[24]

అనియత విద్యా కార్యక్రమం (NFE) క్రింద దాదాపు రాష్ట్రాలలో 40% కేంద్రాలు, UTలలో 10% కేంద్రాలు ప్రత్యేకంగా మహిళల కోసం ప్రత్యేకించారు. 2000 నాటికి సుమారు 3 లక్షల NFE కేంద్రాలు సుమారు 74.2 లక్షల మంది పిల్లలకు రోజువారీ భోజనాన్ని అందిస్తున్నాయి. ఇందులో 1.2 లక్షలను అమ్మాయిల కోసమే ప్రత్యేకించారు. పట్టణ భారతంలో అమ్మాయిలు విద్యా విషయంలో అబ్బాయిలతో సమంగా ఉన్నారు. గ్రామీణ భారతంలో మాఅత్రం అమ్మాయిలు అబ్బాయిల కంటే తక్కువ మంది చదువుకుంటున్నారు.

1998 యూ.ఎస్ డిపార్ట్మెంట్ అఫ్ కామర్స్ నివేదిక ప్రకారం మహిళల విద్యకి ముఖ్య అడ్డంకి సరైన సౌకర్యాలు (వైద్యసంబంధ సౌకర్యాలవంటివి) లేని బడులు, మహిళా ఉపాధ్యాయుల కొరత, పాఠ్యాంశాల అంశాలలో లింగ పక్షపాతం (ఎక్కువమంది అమ్మాయిలు బలహీనంగా, అసహాయులుగా చిత్రించబడుతున్నారు).[37]

పనిలో భాగస్వామ్యం మార్చు

 

సాధారణ అంచనాలకు భిన్నంగా భారతదేశంలో అధికశాతం మహిళలు పనిచేస్తున్నారు.[38] నేషనల్ డేటా కలెక్షన్ ఏజన్సీలు పనివారిగా మహిళల సంఖ్య మీద తీవ్రమైన తక్కువ అంచనాలు ఉన్నాయన్న నిజాన్ని ఒప్పుకున్నాయి.[24] అయినప్పటికీ పనివారిలో పురుషుల కంటే స్త్రీలు చాలా తక్కువగా ఉన్నారు. పట్టణ భారతంలో పనివారిలో మహిళల సంఖ్య ఆసక్తిదాయకంగా ఉంది. ఉదాహరణకు సాఫ్ట్ వేర్ పరిశ్రమలో 30% పనివారు మహిళలే. పని ప్రదేశంలో వారు వారి పురుషులతో జీతాలు, స్థాయిలలో సమానంగా ఉన్నారు.

గ్రామీణ భారతంలో మొత్తం స్త్రీ కూలీలలో 89.5% మంది వ్యవసాయ, తత్సంబంధిత పరిశ్రమ విభాగాలలోనే పని చేస్తున్నారు.[36] మొత్తం పంట ఉత్పత్తిలో మహిళల సగటు సహాయం మొత్తం శ్రమలో 55% నుండి 66% వరకు ఉంటుందని అంచనా వేసారు.1991 ప్రపంచబ్యాంకు ఒక నివేదిక ప్రకారం భారతదేశపు మొత్తం పాలకేంద్రాలలో మొత్తం పనిలో 94% పనిని మహిళలే చేస్తున్నారు. అటవీ ఆధారిత కుటీర పరిశ్రమలలోని పనివారిలో 51% మంది మహిళలు ఉన్నారు.[36]

అతి ప్రాచుర్య మహిళల వ్యాపార విజయ కథలలో ఒకటి శ్రీ మహిళా గృహ ఉద్యోగ్ లిజ్జత్ పాపడ్. 2006లో కిరణ్ మజుందార్ షా భారతదేశపు సంపన్న మహిళగా గుర్తింపబడ్డారు, ఈమె భారతదేశపు మొదటి బయోటెక్ కంపెనీ బయోకాన్ ను ప్రారంభించారు. లలితా గుప్తే, కల్పనా మొర్పారియా (ఇద్దరు ఫోర్బ్స్ వారి ప్రపంచపు అతి శక్తివంత మహిళల జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ మహిళలు) భారతదేశపు రెండవ అతి పెద్ద బ్యాంకు ICICI బ్యాంకుని నడుపుతున్నారు.[39]

భూ హక్కులు, ఆస్తి హక్కులు మార్చు

చాలా భారతీయ కుటుంబాలలో మహిళలు వారి పేర్ల మీద ఎటువంటి ఆస్తిని కలిగి ఉండరు. వీరు తండ్రి ఆస్తిలో భాగాన్ని కూడా పొందరు.[24] వారిని రక్షించే చట్టాల అమలు తక్కువగా ఉండటంవలన మహిళలు భూమి, ఆస్తి మీద కొంచెం హక్కునే పొందగలుగుతున్నారు.[40] ఇంకా కొన్ని చట్టాలు భూ, ఆస్తి హక్కులకి సంబంధించి మహిళలపట్ల వివక్ష చూపిస్తుంటాయి.

1956 మధ్య కాలపు హిందూ వ్యక్తిగత చట్టాలు (ఇవి హిందువులకి, బౌద్ధులకి, సిక్కులకు జైనులకు అనువర్తిస్తాయి) మహిళలకు వారసత్వ హక్కులు అందించాయి. ఏమైనా కొడుకులకు తాతల ఆస్తులలో వ్యక్తిగత వాటా ఉంటుంది. అదే కూతుర్ల వాటాలయితే తండ్రి వాటామీద ఆధారపడి ఉంటాయి. అలాగే తండ్రి పూర్వీకుల ఆస్తిలో తన వాటాని త్యజించడంద్వారా కూతురి హక్కుని తీసేయవచ్చు కానీ కొడుకు వాటామీద తన హక్కును అలాగే కలిగిఉంటాడు. అదనంగా, పెళ్ళైన కూతుళ్ళు వివాహ వేధింపులు ఎదుర్కొంటున్నప్పటికీ వారికి పూర్వీకుల ఇంటిలో నివాస హక్కులు ఉండవు. 2005లో హిందూ చట్టాల సవరణల తరువాత ప్రస్తుతం మహిళలకు పురుషులతో సమానహోదా కల్పించారు.[41]

1986లో భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం షాబానో అనే విడాకులు తీసుకున్న వృద్ధ ముస్లిం మహిళ భరణపు డబ్బుకు అర్హురాలు అని తీర్పిచ్చింది. అయినప్పటికీ ఈ నిర్ణయాన్ని ఛాందస ముస్లిం నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. కోర్టు తమ వ్యక్తిగత చట్టాలలో తలదూరుస్తోందని వారు విమర్శించారు. భారత ప్రభుత్వం తదనుగుణంగా ముస్లిం మహిళల (విడాకుల నుంచి రక్షణ హక్కులు) చట్టాన్ని అమలు చేసింది.[42]

అలాగే క్రిస్టియన్ మహిళలు కూడా విడాకుల, వారసత్వ సమానహక్కులకోసం సంవత్సరాలపాటు ఇబ్బంది పడ్డారు. 1994లో అన్ని చర్చిలు, మహిళాసంస్థలతో కలిసి సంయుక్తంగా డ్రాఫ్ట్ లా అనే క్రిస్టియన్ మారేజ్, మాట్రిమోనియల్ కాజెస్ బిల్లుని ప్రవేశపెట్టారు. అయితే ఇప్పటికీ ప్రభుత్వం చట్టాలకు అవసరమైన సవరణలు చెయ్యలేదు.[15]

మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు మార్చు

పోలీసు రికార్డులు భారతదేశంలో అధిక నేర సంఘటనలు మహిళలమీద జరుగుతున్నట్లుగా చూపుతున్నాయి. జాతీయ నేర నమోదు బ్యూరో 1998లో 2010నాటికి జనాభా వృద్ధి శాతం కంటే మహిళల మీద జరిగే నేరాల శాతం ఎక్కువగా ఉంటుందని నివేదించింది.[24] ముందు అత్యాచారం, వేధింపుల కేసులలో సామాజిక నిందల కారణంగా చాలా కేసులు పోలిసులవద్ద నమోదయ్యేవి కావు. అధికారిక గణాంకాలు మహిళల మీద జరుగుతున్న నేరాల నమోదులో నాటకీయ పెరుగుదల చూపిస్తున్నాయి.[24]

లైంగిక వేధింపు మార్చు

1990 నమోదైన మొత్తం మహిళా కేసులలో సగానికి పైగా పని ప్రదేశాలలో బాధలు, వేధింపులకు సంబంధించినవే ఉన్నాయి.[24] పురుషుడు స్త్రీని లైంగికంగా వేధించే లేదా బాధించే ప్రక్రియకు మరో పేరు ఈవ్ టీజింగ్. చాలామంది ఉద్యమకారులు మహిళలమీద పెరుగుతున్న లైంగిక వేధింపులకు కారణం "పాశ్చాత్య సంస్కృతి" ప్రభావమని ఆరోపిస్తున్నారు. 1987లో ది ఇండిసేంట్ రిప్రజెంటేషన్ అఫ్ వుమెన్ (నిషేధం) చట్టం అమలయ్యింది, [43] ఇది ప్రకటనల లేదా ప్రచురణలు, రచనలు, చిత్రలేఖనాలు, బొమ్మలు లేదా ఏ ఇతర పద్ధతులలోనైన మహిళల అసభ్య చిత్రీకరణను నిషేధించడానికి.

1997లో మైలురాయి తీర్పుగా భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం, పని ప్రదేశాలలో మహిళల లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా గట్టి చర్య తీసుకుంది. వేధింపుల నివారణకు, పరిహారానికీ వివరణాత్మక మార్గదర్శకాలను కోర్టు సూచించింది. మహిళల జాతీయ కమిషన్ ఈమార్గదర్శకాలను విస్తరింపజేసి ఉద్యోగుల ప్రవర్తనా నియమావళిగా మార్చింది.[24]

కట్నం మార్చు

1961లో భారత ప్రభుత్వం వరకట్న నిరోధ చట్టాన్ని[44] అమలుచేసింది. వివాహంలో కట్నం అడగటం చట్టవిరుద్ధం. ఏమైనా చాలా కట్న సంబంధిత గృహహింస కేసులలో ఆత్మహత్యలు, హత్యలు నమోదు చేయబడ్డాయి. 1980లలో ఇటువంటి కేసులు అనేకం నమోదయ్యాయి.[38]

1985లో కట్న నిషేధ (పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు బహుమతుల పట్టిక నిర్వహణ) నియమాలు రూపొందించారు.[45] ఈ నియమాల ప్రకారం పెళ్ళికూతురికి, పెళ్ళికొడుక్కీ పెళ్ళి సమయంలో ఇచ్చే బహుమతులతో సంతకం చేసిన జాబితాను రూపొందించాలి. ఈ జాబితాలో ప్రతీ బహుమతికి సంబంధించిన క్లుప్త వివరణ, దాని రమారమి విలువ, ఆ బహుమతి ఇచ్చిన వ్యక్తి పేరు, పెళ్ళివారితో ఆ వ్యక్తికి గల సంబంధం మొదలైన విషయాలు ఉండాలి. ఏమైనా ఇటువంటి నియమాలు అమలుచేయడం కష్టం.

1997 నివేదిక[46] ప్రకారం ప్రతి సంవత్సరం కనీసం 5,000మంది మహిళలు కట్నపు చావులు చస్తున్నారు, ప్రతిరోజూ కనీసం డజనుమంది ఉద్దేశ్యపూర్వకంగా 'వంటగది మంటల'లో మరణిస్తున్నారు. దీనికి పేరు "పెళ్ళికూతురు మండడం", ఇది భారతదేశంలోనే విమర్శించబడుతున్నది. పట్టణ అక్షరాస్యులలో ఇటువంటి కట్ననిందలు చాలావరకు తగ్గాయి.

బాల్య వివాహం మార్చు

బాల్య వివాహం బహ్రతదేశంలో సంప్రదాయకంగా చలామణిలో ఉండి నేటికీ కొనసాగుతున్నది.[ఆధారం చూపాలి] చారిత్రాత్మకంగా చిన్న అమ్మాయిలు వయస్సు వచ్చేవరకు వారి తల్లిదండ్రులతో నివశిస్తారు. గతంలో బాలవితంతువులు జీవితాన్ని వేదనతో, తల గొరిగించుకొని, ఒంటరితనంతో, సమాజంచేత విసర్జించబడి గడిపేవారు.[22] 1860లో బాల్యవివాహాలను నిషేధించదం జరిగింది. ప్రస్తుతం ఎక్కడో చాలా కొన్ని మాత్రమే జరుగుతున్నాయి.

UNICEF యొక్క స్టేట్ ఆఫ్ ది వరల్డ్స్ చిల్డ్రన్- 2009 నివేదిక ప్రకారం, 20–24 మధ్య వయస్సున్న భారతీయ మహిళల్లో 47% మందికి చట్టబద్ధ వివాహ వయస్సు 18 ఏళ్ల కంటే ముందుగానే వివాహం జరిగింది, గ్రామీణ ప్రాంతాల్లో వీరి సంఖ్య 56% వద్ద ఉంది.[22] ఈనివేదిక ప్రపంచపు బాల్య వివాహాలలో 40% భారతదేశంలో జరుగుతున్నాయని కూడా చూపించింది.[ఆధారం చూపాలి][47]

ఆడ శిశుహత్యలు, బలవంత గర్భస్రావాలు మార్చు

భారతదేశం అధిక స్థాయి పురుష లింగ నిష్పత్తిని కలిగి ఉంది, దీనికి ప్రధాన కారణం చాలామంది మహిళలు యుక్తవయస్సు రాకముందే చనిపోవడం.[24] భారతదేశంలో గిరిజన సమాజాలు మిగిలిన అన్ని కులవర్గాల కంటే తక్కువ పురుష లింగ నిష్పత్తిని కలిగిఉన్నాయి. గిరిజన వర్గాలు అతి తక్కువ స్థాయి ఆదాయం, అక్షరాస్యత, ఆరోగ్యసదుపాయాలు కలిగిఉన్నాయన్న నిజం తరువాత కూడా ఇది ఉంది.[24] చాలామంది నిపుణులు భారతదేశంలో అధిక పురుష లింగ నిష్పత్తిని ఆడ శిశుహత్యలకు, లింగ-నిర్ధారిత గర్భశ్రావాలకు ఆపాదించవచ్చని సూచించారు.

భారతదేశంలో శిశువు లింగాన్ని నిర్ధారించడానికి ఉపయోగించే అన్ని వైద్యపరీక్షలను నిషేధించారు, అవాంఛిత ఆడ శిశువులను జననానికిముందే వదిలించుకోవడానికి ఈపరీక్షలని ఉపయోగించడమే ఇందుకు కారణం. ఆడ శిశుహత్యలు (ఆడ శిశువులను చంపడం) ఇప్పటికీ కొన్ని గ్రామీణ ప్రాంతాలలో ప్రబలంగా ఉన్నాయి.[24] కట్నపు వేధింపుల సాంప్రదాయం భారతదేశంలో ఆడ శిశుహత్యలకు, లింగ-నిర్ధారిత గర్భస్రావాలకు ముఖ్యకారణాలు.

గృహహింస మార్చు

నిమ్న సామాజిక-ఆర్థిక తరగతులలో (SECs) గృహహింస సంఘటనలు ఎక్కువ. గృహహింస నుంచి స్త్రీలను రక్షించే చట్టం 2006 అక్టోబరు 26నుంచి అమలులోకి వచ్చింది.

వ్యాపారం మార్చు

1956లో అనైతిక వ్యాపార (నివారణ) చట్టం అమలులోకి వచ్చింది.[48] ఏమైనా యువతుల, మహిళల వ్యాపార కేసులు చాలా నమోదు చేయబడ్డాయి. ఈమహిళలు వేశ్యా వృత్తిలోకి, ఇంటి పని లేదా బాల కార్మిక పనిలోకి బలవంతంగా పంపబడుతున్నారు.

ఇతర విషయాలు మార్చు

ఆరోగ్యం

నేడు భారతదేశంలో మహిళల సగటు ఆయుర్ధాయం అనేక ఇతర దేశాలతో పోలిస్తే తక్కువ కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఇది క్రమవృద్ధిని చూపిస్తుంది. అనేక కుటుంబాల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బాలికలు, మహిళలు కుటుంబంలోనే పోషకాహార వివక్ష ఎదుర్కొంటున్నారు, వారు శక్తిహీనత, పోషకాహారలోపాన్ని చూస్తున్నారు.[30]

ప్రసూతి మరణాలలో భారతదేశం ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది.[15] ఈదేశంలో కేవలం 42% జననాలు మాత్రమే ఆరోగ్య నిపుణుల పర్యవేక్షణలో జరుగుతున్నాయి. చాలామంది మహిళలు కాన్పు ఇంటిలోని ఇతర మహిళల సహాయంతో జరుగుతుంది, వీరు తరచుగా తల్లి జీవనం ప్రమాదంలో ఉన్నప్పుడు వారిని కాపాడే మెళుకువలను, వసతులను కలిగిఉండరు.[24] UNDP మానవాభివృద్ధి శాఖా నివేదిక (1997) ప్రకారం 88% గర్భవతులు (15-49 మధ్య వయస్సు) రక్తహీనతతో బాధపడుతున్నారు.[36]

కుటుంబ నియంత్రణ

భారతదేశపు గ్రామీణ ప్రాంతాల సగటు మహిళ తన ప్రత్యుత్పత్తి మీద తక్కువ లేదా అసలు నియంత్రణ లేకుండా ఉంటుంది. మహిళ ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాలలో మహిళ సురక్షిత, స్వీయ-నియంత్రణ గర్భనిరోధక పద్ధతుల గురించిన అవగాహన కలిగిఉండదు. ప్రజా ఆరోగ్య వ్యవస్థ శాశ్వత పద్ధతులైన స్టెరిలైజేషన్ లేదా దీర్ఘ-కాలిక పద్ధతులైన IUD వంటి తదుపరి జాగ్రత్తలు పాటించనివాటిని సూచిస్తుంది. మొత్తం గర్భనిరోధక పద్ధతులలో స్టెరిలైజేషన్ 75% కంటే ఎక్కువ శాతాన్ని ఆక్రమిస్తే అందులో మహిళా గర్భనిరోధకత 95% ఆక్రమిస్తుంది.[24]

గుర్తించదగిన భారతీయ మహిళలు మార్చు

కళలు, వినోద రంగం

ఎమ్.ఎస్. సుబ్బులక్ష్మి, గంగుబాయి హంగల్, లతా మంగేష్కర్, ఆశా భోస్లే వంటి గాయనీమణులు, ఐశ్వర్య రాయ్ వంటి నటీమణులు భారతదేశంలో బాగా ప్రాచుర్యం ఉన్నవారు. అన్జోలియో ఇలా మీనన్ ప్రముఖ చిత్రకారిణి.

క్రీడలు

భారతదేశంలో సామాన్య క్రీడా దృశ్యం బాగాలేకపోయినప్పటికీ కొంతమంది భారతీయ మహిళలు ఈరంగంలో గుర్తించదగిన కార్యాలు సాధించారు. భారతదేశంలో ప్రముఖ క్రీడాకారిణులు పి. టి. ఉష, జే. జే. శోభ (అథ్లెటిక్స్), కుంజరాణి దేవి (వెయిట్ లిఫ్టింగ్), డయానా ఎడుల్జీ (క్రికెట్), సైనా నెహ్వాల్ (బాడ్మింటన్), కోనేరు హంపి (చెస్), సానియా మీర్జా (టెన్నిస్). కరణం మల్లీశ్వరి (వెయిట్ లిఫ్టర్) ఒలంపిక్ మెడల్ గెలిచిన ఏకైక భారతీయ మహిళ (2000లో కాంస్య పతకం).

రాజకీయాలు

పంచాయతీ రాజ్ సంస్థల ద్వారా దాదాపు పది లక్షలకు పైగా మహిళలు భారతదేశంలో రాజకీయ జీవితం ప్రారంభించారు. ఆంధ్ర ప్రదేశ్[49] తో సహా బీహారు,మధ్య ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి అనేక ఇతర రాష్ట్రాలు పంచయితీ రాజ్ సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు అమలు చేసాయి.[50] 73వ, 74వ రాజ్యాంగ సవరణల ప్రకారం స్థానికంగా ఎన్నుకొనే విభాగాలన్నీ వాటి మూడవవంతు స్థానాలని మహిళల కోసం ఉంచుతారు. వివిధ స్థాయిల రాజకీయ కార్యక్రమాలలో మహిళల శాతం గుర్తించదగినంత పెరిగినప్పటికీ, పరిపాలన, విధాన నిర్ణాయక స్థాయిలలో ఇప్పటికీ మహిళలకు ప్రాతినిధ్యం పెద్దగా లేదు.[24]

సాహిత్యం

చాలామంది ప్రముఖ మహిళా రచయితలు భారతీయ సాహిత్యంలో కవయిత్రులుగా, కథారచయితలుగా ఉన్నారు. సరోజినీ నాయుడు, కమల సూరయ్య, శోభా డే, అరుంధతి రాయ్, అనితా దేశాయ్ వారిలో కొందరు. సరోజినీ నాయుడుని నైటింగే్ల్ ఆఫ్ ఇండియా అంటారు. అరుంధతి రాయ్ తన నవల ది గాడ్ అఫ్ స్మాల్ తింగ్స్ కి గాను బుకర్ ప్రైజ్ మాన్ బుకర్ ప్రైజ్ని పొందారు.

శాస్త్ర సాంకేతిక రంగాలు

ఈ రంగాలలో కూడా అనేకమంది మహిళలు వెలుగొందుతున్నారు. కల్పనా చావ్లా, అంజు చధా, ఆషా మాథుర్, జితేందర్ కౌర్ అరోరా, అసీమా ఛటర్జీ, యమునా కృష్ణన్ వీరిలో కొందరు.

వీటిని కూడా చూడండి మార్చు

సూచనలు మార్చు

  1. "Rankings". United Nations Development Programme (UNDP)India. Archived from the original on 2021-03-06. Retrieved 2021-03-10.
  2. "Gender Inequality Index". United Nations Development Programme. Retrieved 2 October 2018.
  3. "The Global Gender Gap Report 2018" (PDF). World Economic Forum. pp. 10–11.
  4. "Rajya Sabha passes Women's Reservation Bill". The Hindu. Archived from the original on 14 మార్చి 2010. Retrieved 25 August 2010.
  5. "Rajya Sabha passes Women's Reservation Bill". The Hindu. Archived from the original on 1 ఆగస్టు 2010. Retrieved 25 August 2010.
  6. Jayapalan (2001). Indian society and social institutions. Atlantic Publishers & Distri. p. 145. ISBN 9788171569250.
  7. త్రయంబక యజ్వ రచించిన ది పెర్ఫెక్ట్ వైఫ్: స్త్రీధర్మపధ్ధతి (మహిళల బాధ్యత పై మార్గదర్శి) (అనువాదం: జూలియా లెస్లీ), పెంగ్విన్ 1995 ISBN 0-14-043598-0.
  8. స్త్రీధర్మపధ్ధతి లో నుంచి చూడుము విపులమైన నిష్ణాతులు http://www.cse.iitk.ac.in/~amit/books/tryambakayajvan-1989-perfect-wife-stridharmapaddhati.html
  9. Madhok, Sujata. "Women: Background & Perspective". InfoChange India. Archived from the original on 24 July 2008. Retrieved 24 December 2006.
  10. 10.0 10.1 Mishra, R. C. (2006). Towards Gender Equality. Authorspress. ISBN 81-7273-306-2.
  11. అష్టాధ్యాయి కు వ్యాఖ్యానం 3.3.21, పతాంజలిచే 4.1.14
  12. కాత్యాయన చే వార్త్తిక , 125, 2477
  13. R. C. మజుందార్, A. D. పుసల్కర్ (సంపాదకులు): ది హిస్టరీ అండ్ కల్చర్ అఫ్ ది ఇండియన్ పీపుల్. సంచిక I, ది వేదిక్ ఏజ్. బొంబాయి: భారతీయ విద్య భవన్ 1951, పే.394
  14. "Vedic Women: Loving, Learned, Lucky!". Archived from the original on 2006-11-20. Retrieved 2006-12-24.
  15. 15.0 15.1 15.2 15.3 15.4 15.5 15.6 15.7 15.8 "InfoChange women: Background & Perspective". Archived from the original on 2008-07-24. Retrieved 2006-12-24.
  16. 16.0 16.1 16.2 Jyotsana Kamat. "Status of Women in Medieval Karnataka". Retrieved 2006-12-24.
  17. Vimla Dang (1998-06-19). "Feudal mindset still dogs women's struggle". The Tribune. Archived from the original on 2006-12-19. Retrieved 2006-12-24.
  18. "The Commission of Sati (Prevention) Act, 1987". Archived from the original on 2006-11-21. Retrieved 2006-12-24.
  19. K. L. Kamat (2006-12-19). "The Yellamma Cult". Retrieved 2006-12-25.
  20. డుబొయిస్, జీన్ అంటోయిన్, బీచంప్, హెన్రీ కింగ్, హిందూ మేనర్స్, కస్టమ్స్, అండ్ సేరమోనీస్, క్లారెన్డన్ ప్రెస్, 1897
  21. హిందూ ముస్లిం ఐఖ్యత రాయబారి, ఇయన్ బ్రియాంట్ వెల్ల్స్
  22. 22.0 22.1 Jyotsna Kamat (2006-12-19). "Gandhi and Status of Women". Retrieved 2006-12-24.
  23. "Oxford University's famous south Asian graduates#Indira Gandhi". BBc News. 2010-05-05.
  24. 24.00 24.01 24.02 24.03 24.04 24.05 24.06 24.07 24.08 24.09 24.10 24.11 24.12 24.13 24.14 24.15 24.16 Kalyani Menon-Sen, A. K. Shiva Kumar (2001). "Women in India: How Free? How Equal?". United Nations. Archived from the original on 2006-09-11. Retrieved 2010-12-05.
  25. Velkoff, Victoria A.; Adlakha, Arjun (October 1998). Women of the World: Women's Health in India (PDF). U.S. Department of Commerce, Economics and Statistics Administration. Archived from the original (pdf) on 4 June 2011. Retrieved 25 December 2006.
  26. "National Policy For The Empowerment Of Women (2001)". Archived from the original on 2014-02-05. Retrieved 2006-12-24.
  27. "OneWorld South Asia News: Imrana". Archived from the original on 2007-09-27. Retrieved 2006-12-25.
  28. "Rajya Sabha passes Women's Reservation Bill". Archived from the original on 2010-03-14. Retrieved 2010-08-25.
  29. "Mumbai Police History". Archived from the original on 2006-12-23. Retrieved 2006-12-24.
  30. "High Court of Kerala: Former Chief Justices / Judges". Archived from the original on 2006-12-14. Retrieved 2010-12-05.
  31. "Kiran Bedi Of India Appointed Civilian Police Adviser". Retrieved 2006-12-25.
  32. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2006-12-14. Retrieved 2010-12-05.
  33. http://www.funlok.com/modules.php?name=News&file=article&sid=1498[permanent dead link]
  34. "Army'S First Lady Cadet Looks Back". Archived from the original on 2007-02-05. Retrieved 2010-12-05.
  35. [45] ^ కామత్స్ పాత్‌పూరి: ది సిగ్నిఫికాన్స్ ఆఫ్ ది హొలి డాట్ (బింది)
  36. 36.0 36.1 36.2 36.3 "Asia's women in agriculture, environment and rural production: India". Archived from the original on 2014-06-30. Retrieved 2006-12-24.
  37. Velkoff, Victoria A. (October 1998). Women of the World: Women's Education in India (PDF). U.S. Department of Commerce, Economics and Statistics Administration. Archived from the original (PDF) on 28 June 2011. Retrieved 25 December 2006.
  38. 38.0 38.1 "Women of India: Frequently Asked Questions". 2006-12-19. Retrieved 2006-12-24.
  39. ఇండియా లో అత్యంత ముఖ్యమైన బిజినెస్ ఉమేన్. Forbes.com.
  40. Coonrod, Carol S. (June 1998). "Chronic hunger and the status of women in India". thp.org. The Hunger Project. Archived from the original on 10 September 2014. Retrieved 24 December 2006.
  41. "ది హిందూ సక్సషన్ (అమెండ్మెంట్) యాక్ట్, 2005". Archived from the original on 2011-07-16. Retrieved 2010-12-05.
  42. "The Muslim Women (Protection of Rights on Divorce) Act". sudhirlaw.com. Sudhir Shah & Associates. May 1986. Archived from the original on 27 December 2007. Retrieved 14 February 2008.
  43. "The Indecent Representation of Women (Prohibition) Act, 1987". Archived from the original on 2006-11-21. Retrieved 2006-12-24.
  44. "The Dowry Prohibition Act, 1961". Archived from the original on 2015-09-09. Retrieved 2006-12-24.
  45. "The Dowry Prohibition (maintenance of lists of presents to the bride and bridegroom) rules, 1985". Archived from the original on 2006-11-21. Retrieved 2006-12-24.
  46. కిచెన్ ఫైర్స్ కిల్ ఇండియన్ బ్రిడ్స్ విత్ ఇన్అడిక్వేట్ డౌరి , జూలై 23, 1997, న్యూ ఢిల్లీ, UPI
  47. [34] ^ http://www.hindu.com/2008/07/09/stories/2008070960991200.htm Archived 2008-11-19 at the Wayback Machine
  48. "The Immoral Traffic (Prevention) Act, 1956". Archived from the original on 2007-09-27. Retrieved 2006-12-24.
  49. "50% reservation for women in AP, Bihar Panchayats". Sify News. 25 November 2011. Archived from the original on 27 జూన్ 2013. Retrieved 28 July 2013.
  50. "50% reservation for women in AP, Bihar Panchayats". Sify News. 25 November 2011. Archived from the original on 27 జూన్ 2013. Retrieved 28 July 2013.

గ్రంథ పట్టిక మార్చు

  • క్లారిస్ బాడర్ చే వొమెన్ ఇన్ ఏన్షియంట్ ఇండియా . ట్రబ్నర్స్ ఓరియన్టల్ సిరీస్. రౌలెడ్జ్, 2007 ISBN 978-0-415-24489-3.

బాహ్య లింకులు మార్చు