మగ మహారాజు (2015 సినిమా)

మగ మహారాజు 2015లో విడుదలైన తెలుగు సినిమా. విశాల్‌ పిల్మ్‌ ఫ్యాక్టరీ బ్యానర్ పై విశాల్ నిర్మించిన ఈ సినిమాకు సుందర్.సీ దర్శకత్వం వహించాడు. విశాల్, హన్సిక, ప్రభు, సంతానం, సతీష్, వైభవ్ రెడ్డి, రమ్య కృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 27 ఫిబ్రవరి 2015న విడుదలైంది.[1]

మగ మహారాజు
దర్శకత్వంసుందర్.సీ
కథసుందర్.సీ
నిర్మాతవిశాల్
తారాగణంవిశాల్
హన్సిక
ప్రభు
రమ్యకృష్ణ
వైభవ్ రెడ్డి
ఛాయాగ్రహణంగోపి అమర్‌నాథ్‌
కూర్పుఎన్.బి. శ్రీకాంత్
సంగీతంహిప్హాప్ తమిజా
నిర్మాణ
సంస్థ
విశాల్‌ పిల్మ్‌ ఫ్యాక్టరీ
విడుదల తేదీ
2015 ఫిబ్రవరి 27 (2015-02-27)
సినిమా నిడివి
146 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు
బడ్జెట్₹14 కోట్లు
బాక్సాఫీసు₹26 కోట్లు

కథ మార్చు

తెనాలిలో పొలిటీషియన్స్ ని ఒక చోట చేరుస్తూ, బిజినెస్ ఈవెంట్స్ ని ప్లాన్ చేసుకునే ఏజెంట్‌ కృష్ణ (విశాల్‌) మాయ (హన్సిక)ని చూసి ప్రేమలో పడతాడు. కానీ ఓ సంఘటన వల్ల వీరిద్దరూ విడిపోతారు. ఆ తర్వాత తల్లి ద్వారా తన తండ్రి కేశవరాజు(ప్రభు) గతాన్ని తెలుసుకుని అతడిని వెతుక్కుంటూ వెళ్తాడు. కేశవరాజుని కలిసిన కృష్ణకు ఇద్దరు సొంత తమ్ముళ్లు కుమార్(వైభవ్), కిషన్(సతీష్) వున్నారని తెలుస్తుంది. అయితే ఈ ముగ్గురు కొడుకులను కేశవరాజు ఓ కోరిక కోరతాడు.

తన ముగ్గురు చెల్లెల్లు (రమ్యకృష్ణ, ఐశ్వర్య, కిరణ్ రాథోడ్) తనమీద కోపంతో వున్నారని, వారి కోపాన్ని పోగొట్టి వాళ్ల కూతుళ్లను మీరు ముగ్గురు పెళ్లి చేసుకోవాలని తన కొడుకులను కోరతాడు. దాంతో ఈ ముగ్గురు కలిసి అత్తలని ఒప్పించడానికి తెనాలి వెళ్తారు. అలా వెళ్ళిన కృష్ణ, కుమార్, కిషన్ లు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? ఆ తర్వాత ఏం జరిగింది ? ఈ ముగ్గురి పెళ్లిల్లు జరిగాయా ? లేదా అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: విశాల్‌ పిల్మ్‌ ఫ్యాక్టరీ
  • నిర్మాత: విశాల్
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుందర్.సీ
  • సంగీతం: హిప్ హాప్ తమిజా
  • సినిమాటోగ్రఫీ: గోపి అమర్‌నాథ్‌
  • మాటలు: శశాంక్ వెన్నెలకంటి

మూలాలు మార్చు

  1. The Times of India (27 February 2015). "Maga Maharaju Movie". Archived from the original on 3 September 2021. Retrieved 3 September 2021.
  2. The Hans India (27 February 2015). "Vishal's Maga Maharaju Review" (in ఇంగ్లీష్). Archived from the original on 3 September 2021. Retrieved 3 September 2021.