మన్నం గోపీచంద్

ప్రముఖ వైద్యుడు

మన్నం గోపిచంద్ ఒక ప్రముఖ హృద్రోగ నిపుణులు. వైద్యరంగంలో ఆయన చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రధానం చేసింది.[1] హృదయ ఫౌండేషన్ పేరుతో కేవలం భారతదేశంలోనే కాక లిబియా, ఇథియోపియా లాంటి పేద దేశాల పిల్లల్లో గుండె జబ్బుల చికిత్సకై తనవంతు సాయం చేస్తున్నాడు.

మన్నం గోపీచంద్
దస్త్రం:Dr,Mannam Gopichand.jpg
విద్యఎం. బి. బి. ఎస్, ఎఫ్. ఆర్. సి. ఎస్
విద్యాసంస్థ
  • ప్రభుత్వ వైద్య కళాశాల, గుంటూరు
  • లండన్
వృత్తివైద్యుడు
తల్లిదండ్రులు
  • మన్నం నరసింహం (తండ్రి)
  • సుబ్బమ్మ (తల్లి)
పురస్కారాలుపద్మశ్రీ పురస్కారం

బాల్యం, విద్యాభ్యాసం మార్చు

ఆయన స్వస్థలం ఒంగోలు. ఆయన తల్లిదండ్రులు మన్నం నరసింహం, సుబ్బమ్మ. గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబియస్ చేశాడు. తరువాత ఉన్నత విద్యకోసం జమైకా వెళ్ళి శస్త్రచికిత్సల్లో నైపుణ్యం సాధించాడు. తరువాత లండన్ నుంచి ఎఫ్.ఆర్.సీ.ఎస్ పట్టా కూడా అందుకున్నాడు.

వైద్య వృత్తి మార్చు

 
పద్మశ్రీపురస్కారం

కొద్ది కాలం లండన్లో పనిచేసి 1995లో హైదరాబాదు కు వచ్చేశాడు. 2008 లో స్టార్ హాస్పిటల్స్ పేరుతో ఆసుపత్రి ప్రారంభించాడు. 2016 వరకు సుమారు 25000కి పైగా శస్త్రచికిత్సలు చేశాడు. చిన్నపిల్లల్లో గుండె జబ్బుల నివారణకు హృదయ ఫౌండేషన్ పేరుతో సేవ చేస్తున్నాడు. ఈ సంస్థ ద్వారా 3000 కిపైగా గుండె జబ్బుతో బాధ పడుతున్న పిల్లలకు చికిత్సనందించాడు. ఇందులో భారతదేశమే కాక, ఇథియోపియా, లిబియా లాంటి పేద దేశాల పిల్లలు కూడా ఉన్నారు.

సాహితీ సేవ మార్చు

సోదరుడు మన్నం వెంకటరాయుడుతో కలిసి మనసు ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి రావిశాస్త్రి, శ్రీశ్రీ, బీనాదేవి, గురజాడ అప్పారావు, పతంజలి, బుచ్చిబాబు, సభా, కలువకొలను సదానంద, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి లాంటి ప్రముఖ రచయితల రచనలను ప్రచురిస్తున్నారు.

పురస్కారాలు మార్చు

వైద్యరంగంలో డా. గోపి చంద్ చేసిన కృషికి గాను 2016 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రధానం చేసింది.[1]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 తెలుగు వెలుగు మార్చి 2016 సంచిక, పేజీ 42