మలేషియా ఎయిర్లైన్స్

మలేషియన్ ఎయిర్ లైన్స్ కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాలను నడిపిస్తోన్న ఓ భారీ ఎయిర్ లైన్ సంస్థ. కోటా కినబాలు, కూచింగ్ నుంచి కూడా ఆసియాలోని అన్ని గమ్యస్థానాలతో పాటు యూరప్, ఓసినియా ప్రాంతాలకు విమానాలు నడిపిస్తోంది. వన్ వరల్డ్ ఎయిర్ లైన్ భాగస్వామి అయిన మలేషియా ఎయిర్ లైన్ సంస్థ మలేషియాలో ప్రధాన విమానయాన సంస్థగా పేరుగాంచింది.

Malaysian Airlines System
IATA
MH
ICAO
MAS
కాల్ సైన్
MALAYSIAN
స్థాపన1 మే 1946; 77 సంవత్సరాల క్రితం (1946-05-01) (as Malayan Airways)
మొదలు1 అక్టోబరు 1972; 51 సంవత్సరాల క్రితం (1972-10-01)
Hub
  • Kuala Lumpur International Airport
  • Kota Kinabalu International Airport
Secondary hubsKuching International Airport
Frequent flyer program
  • Enrich
Member loungeGolden Lounge
AllianceOneworld[1]
Subsidiaries
  • Firefly
  • MASwings
  • MASkargo
  • Fleet size96
    Destinations60 exl. codeshare and subsidiaries`
    Parent companyKhazanah Nasional Berhad [2][3]
    కంపెనీ నినాదంMore than just an airline code.
    MH is Malaysian Hospitality.
    ముఖ్య స్థావరంSultan Abdul Aziz Shah Airport
    Subang, Selangor, Malaysia
    ప్రముఖులుChristoph Mueller

    చరిత్ర మార్చు

    ఈ సంస్థ 1947లో మలయాన్ ఎయిర్ వేస్ లిమిటెడ్ ద్వారా తన మొదటి వాణిజ్య విమానాలను ప్రారంభించింది. సింగపూర్కు స్వాతంత్ర్యం లభించిన తర్వాత కొంత కాలానికి 1972లో ఈ ఎయిర్ లైన్ ఆస్తులను విభజించి సింగపూర్ వాసులకోసం సింగపూర్ ఎయిర్ లైన్స్తో పాటు, మలేషియా వారికోసం మలేషియన్ ఎయిర్ లైన్ సిస్టమ్ ఏర్పాటు చేశారు.[4]

    కార్పోరేట్ సమాచారం మార్చు

    మలేషియన్ ఎయిర్ లైన్ సిస్టమ్ బెర్హాద్ పేరుతో బుర్సా మలేషియా స్టాక్ ఎక్సేంజీలో మలేషియా ఎయిర్ లైన్ సంస్థ పేరు నమోదైంది. నిర్వహణ లోపాలు, ఇంధన ధరలు పెరగడం వంటి కారణాల వల్ల ఈ సంస్థ ఆరంభంలో చాలా నష్టాలు వచ్చాయి. ఆ తర్వాత సంస్థలో భారీ సంస్కరణలు తేవడంతో నష్టాల నుంచి కోలుకుంది. గ్రేటర్ కౌలాలంపూర్ లోని సెలంగార్, సుబాంగ్ లోని సుల్తాన్ అబ్దుల్ అజీజ్ షా విమానాశ్రయంలో ఈ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం, రిజిస్టర్డ్ కార్యాలయం ఉన్నాయి.[5] ఈ భవనంలో 600 మంది ఎయిర్ లైన్ ఉద్యోగులు పనిచేస్తున్నారు.[5] ప్రధాన స్థావరాన్ని అబ్దుల్ అజీజ్ షా విమానాశ్రయం నుంచి సెపాంగ్ లోని కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రాయానికి మార్చాలని ఫిబ్రవరి 2012లో నిర్ణయించారు.[6]

    గమ్యాలు మార్చు

    విజయవంతమైన బిజినెస్ ప్రణాళిక పరిచయం చేయడానికంటే ముందు మలేషియా ఎయిర్ లైన్స్... మలేషియా వ్యాప్తంగా 118 దేశీయ మార్గాల్లో, ఆరు ఖండాల్లోని 114 అంతర్జాతీయ మార్గాల్లో విమానాలు నడిపించింది. మలేషియా ఎయిర్ లైన్స్ ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఆసియా, ఉత్తర, దక్షిణ ఆసియా, మధ్య తూర్పు, అస్ట్రేలియాసియా, యూరప్ లోని 60 గమ్య స్థానాలకు విమానాలు నడిపిస్తోంది.

    సేవలు మార్చు

    మలేషియా ఎయిర్ లైన్స్ రెండు క్యాబీన్లు, మూడు తరగతులున్న విమానాలను నడిపిస్తోంది. 777-200 రకం విమానాల్లో రెండు క్యాబీన్ల విధానంతో పాటు గోల్డెన్ క్లబ్ తరగతి, ఎకానమీ తరగతి అందుబాటులో ఉన్నాయి. ఎయిర్ బస్ A380, ఎయిర్ బస్ A330-300, బోయింగ్ 737-800, ఎయిర్ బస్ A380-800, ఎయిర్ బస్ A330-300, బోయింగ్ 737-800 విమానాల్లో ఆయా రకాల సదుపాయాలు ఉన్నాయి.[7]

    ప్రమాదాలు-సంఘటనలు మార్చు

    • 1977 డిసెంబరు 4లో మలేషియన్ ఎయిర్ లైన్స్ బోయింగ్737-200 హైజాక్ చేయబడగా అది తాంజుంగ్ కుపాంగ్ ప్రాంతంలో కూలిపోయిన ప్రమాదంలో మొత్తం 100 మంది మరణించారు.
    • 1983 డిసెంబరు 18లో  ఎయిర్ బస్ A300 సుబాంగ్ విమానం విమానాశ్రయం రన్ వే నుంచి 2 కిలోమీటర్ల ఎత్తుకు ఎగిరిన తర్వాత కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.[8]
    • 1995 సెప్టెంబరు 15లో ఫోకర్ 50 విమానం తావు విమానాశ్రయంలో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ సమయంలోలో విమానంలో ఉన్న 49 మంది ప్రయాణికులు 4 గురు విమాన సిబ్బంది ఉండగా 32 మంది ప్రయాణికులు, ఇద్దరు విమాన సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. పైలట్ విమానాన్ని సరిగ్గా నియంత్రించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు.[9]
    • 2000 మార్చి 15 సంవత్సరంలో మలేషియా ఎయిర్ లైన్స్ కు చెందిన ఎయిర్ బస్ A330-300 విమానం, 2005 ఆగస్టు 1లో బోయింగ్ 777-200ER, 2007 జూన్ 19లో ఎయిర్ బస్ A330-300 ప్రమాదానికి గురయ్యాయి.
    • 2014 మార్చి 8లో 227 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బీజింగ్ క్యాపిటల్ అంతర్జాతీయ విమానాశ్రాయానికి వెళ్తుండగా బోయింగ్ 777-200ER విమానం గల్లంతైంది.[10] ఈ విమానం దక్షిణ హిందుమహాసముద్రంలో కూలిపోయిందని విమానంలోని మొత్తం 239 మంది గల్లంతై నట్లు మలేషియా ప్రభుత్వం, ఎయిర్ లైన్స్ ప్రకటించాయి.[11]
    • జూలై 17, 2014లో మలేషియా ఎయిర్ లైన్ విమానం 17, బోయింగ్ 777-200ER  ఉక్రేయిన్ వద్ద కూలిపోయింది.[12] ఈ దుర్ఘటనలో మొత్తం 293 మంది ప్రయాణికులు, 15 మంది విమాన సిబ్బంది దుర్మరణం పాలయ్యారు.[13]

    సూచనలు మార్చు

    1. "Malaysia Airlines to Join Oneworld in February". Malaysiandigest.com. 30 October 2012. Archived from the original on 2 నవంబరు 2012. Retrieved 17 February 2013.
    2. http://www.bbc.com/news/business-28700926
    3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-04-28. Retrieved 2015-03-24.
    4. "Our Story". malaysiaairlines.com. Malaysian Airline Systems. Retrieved 28 July 2014.
    5. 5.0 5.1 Krishnamoorthy, M. "MAS-sive move Archived 2013-02-21 at Archive.today." .Saturday 7 January 2006.
    6. "MAS to axe unprofitable routes". Sidhu, B.K. Retrieved 10 November 2011.
    7. "Malaysia Airlines Services". Cleartrip.com. Archived from the original on 2016-06-08. Retrieved 2015-03-24.
    8. "Accident description". Aviation Safety Network. Archived from the original on 23 అక్టోబరు 2012. Retrieved 10 March 2011.
    9. "Accident description". Aviation Safety Network. Archived from the original on 28 జూలై 2012. Retrieved 10 March 2011.
    10. "Airliner with 239 on board missing over Asia". Malaysia Sun. Retrieved 8 March 2014.
    11. http://www.bbc.com/news/world-asia-26716572"Families told missing plane lost". BBC News. 24 March 2014. Retrieved 24 March 2014.
    12. "U.S. Says Missile Downed Malaysia Airlines Plane Over Ukraine". The Wall Street Journal (online). 17 July 2014. Retrieved 18 July 2014. {{cite web}}: Cite uses deprecated parameter |authors= (help)
    13. Anton Zverev (16 July 2014). "Malaysian Passenger Plane Crashes In Ukraine Near Russia Border". Huffingtonpost.com. Retrieved 20 July 2014.