మహారాష్ట్రీ ప్రాకృతం

మహారాష్ట్రి లేదా మహారాష్ట్రీ ప్రాకృతం, అనేది ప్రాచీన మధ్యయుగాలనాటి భారతదేశంలో వాడుకలో ఉండిన భాష. ఆధునిక మరాఠీ, కొంకణి భాషలు దీనిని నుండే ఉద్భవించాయి.[1] ప్రాకృతంగా పిలువబడిన అనేక భాషల సమూహం (మాండలికాలు అని కూడా కొందరు వ్యవహరిస్తారు) లో, ఇది కూడా ఒకటి. అంతేగాక, ఒక ప్రధానమైన నాటక ప్రాకృతం. సుమారు 1000 సంవత్సరాలకి పైగా (క్రీ.పూ 500 - సా.శ. 500) వాడుకలో ఉండిన, మహారాష్ట్రీ ప్రాకృతంలో ఎన్నో సాహితీ గ్రంథాలు వెలువడినాయి. కాళిదాసు సంస్కృత నాటకాలలో, మహారాష్ట్రీ ప్రాకృతాన్ని విరివిగా వాడాడు.

శాతవాహన సామ్రాజ్యానికి అధికారభాష ఉండిన మహారాష్ట్రి ప్రాకృతం., సా.శ. 875 వరకూ మాట్లాడబడింది. శాతవాహన చక్రవర్తి, వ్రాసిన గాథా సప్తశతి, కర్పూరమంజరి మహారాష్ట్రి ప్రాకృతంలో వ్రాయబడింది.

అయితే, మహారాష్ట్రి అపభ్రంశ భాషలు జైన సాహిత్యంలో 13వ శతాబ్దం వరకూ వాడుకలో ఉన్నాయి. ఈ అపభ్రంశరూపాలని పునఃసంస్కృతీకరించటం వల్ల, నేటి మరాఠీభాష పుట్టింది.

విస్తృతి మార్చు

మహారాష్ట్రీ ప్రాకృతం, ఉత్తరాన మాళవ, రాజపుతానా నుండి, దక్షిణాన కృష్ణానది, తుంగ భద్ర వరకూ వాడుకలో ఉండినది.

సాహిత్యం మార్చు

ప్రాకృత సంకలనాలు, గాథా సప్తశతి, సేతుబంధం, కర్పూరమంజరి వంటివి శాతవాహన చక్రవర్తి హాలుడు రచించినట్టు భావిస్తారు. కాళిదాసు రచించిన సంస్కృత నాటకాలు, నిమ్నజాతికి చెందిన పాత్రలు, ఈ భాషని మాట్లాడుతాయి.

రాజాశ్రయం మార్చు

సా.శ. తొలి శతాబ్దాలలో., శాతవాహన సామ్రాజ్యానికి అధికారభాష. శాతవాహనులకాలం, మహారాష్ట్రీ ప్రాకృత వినియోగం, తక్కిన అన్ని ప్రాకృతాలకన్నా ఎక్కువగా ఉండినది.

మూలాలు మార్చు

  1. "Roots of Konkani" (in English and Konkani). Goa Konkani Akademi. Archived from the original on 2008-08-28. Retrieved 2009-09-03.{{cite web}}: CS1 maint: unrecognized language (link)