మాగ్నస్ కార్ల్‌సన్

వికీవార్త వ్యాసం

మాగ్నస్ కార్ల్‌సన్ నార్వే దేశానికి చెందిన చదరంగం ఆటగాడు. 2013 లో ఇతను చెన్నైలో జరిగిన ప్రపంచ చదరంగం పోటీలలో మనదేశానికి చెందిన విశ్వనాధన్ ఆనంద్ పై గెలిచి ప్రపంచ విజేతగా నిలిచాడు. కార్ల్‌సన్ సాధించిన అత్యుత్తమ రేటింగ్ పాయింట్లు 2872 చదరంగ పోటీలో ఒక రికార్డు.[1]

మాగ్నస్ కార్ల్‌సన్
పూర్తి పేరు2012 లో మాగ్నస్ కార్ల్‌సన్
దేశంనార్వే
టైటిల్గ్రాండ్‌మాస్టర్ (2004), ప్రపంచ విజేత (2013)
ప్రపంచ ఛాంపియన్2013
ఫిడే రేటింగ్2872 (ఫిబ్రవతి 2013)
అత్యున్నత రేటింగ్1 మొదటి స్థానము (జనవరి, 2010లో తొలిసారి ఈ ఘనత సాధించాడు. 2011 జులై నుంచి ఇప్పటివరకు నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతున్నాడు)

నేపధ్యము మార్చు

కార్ల్‌సెన్ తల్లిదండ్రులు సిగ్రున్, హెన్రిక్ అల్బెర్ట్ కుమారుడిలో ఉన్న అపార ప్రతిభను, సహజ నైపుణ్యాన్ని గుర్తించి తమవంతుగా ప్రోత్సహించారు. వీరి కుటుంబం కొంతకాలం ఫిన్‌లాండ్‌లో ఉండేది. అక్కడ కార్ల్‌సెన్‌కు మిత్రులెవరూ లేకపోవడంతో లెగో (విడివిడిగా ఉండే బొమ్మలను ఒక క్రమంలో పేర్చి ఒక రూపం ఇవ్వడం) గేమ్స్ ఆడేవాడు.నాలుగేళ్ల వయస్సులోనే లెగో ద్వారా అతను కనీసం ఆరేడు గంటలు ఏకాగ్రతతో, ఎలాంటి అలసట లేకుండా ఉండేవాడు. ఈ లక్షణాలతో అతడి తండ్రి అతను చెస్ ప్లేయర్ కాగలడనే నిర్ణయానికి వచ్చాడు. అతనికి చెస్ ఆటను పరిచయం చేయడంతోపాటు అపుడపుడూ గేమ్‌లు ఆడేవాడు. కార్ల్‌సెన్‌కు ఏడేళ్ల వయసులో అతని పెద్దక్క కూడా చెస్ ఆడటం ప్రారంభించింది. అక్క ఆటను చూసిన కార్ల్‌సెన్ ఆమెను ఓడించాలనే లక్ష్యంతో చెస్‌ను సీరియస్‌గా తీసుకొని తీవ్ర సాధన చేయడం ప్రారంభించాడు.

మూడు నెలల తర్వాత అక్కను ఓడించాడు. నార్వే జాతీయ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న తొలిసారి 11వ స్థానం పొందాడు. కార్ల్‌సెన్‌కు పదేళ్లు వచ్చేసరికి గంటలకొద్దీ చెస్ బోర్డుకే అంకితమైపోయాడు. పాఠశాల హోంవర్క్ కూడా కుటుంబ సభ్యులు గుర్తుచేసేవారు. 13 ఏళ్లకు గ్రాండ్‌మాస్టర్ హోదా సంపాదించాడు. 16 ఏళ్లు వచ్చాక కూడా ఉన్నతవిద్య అభ్యసిస్తే బాగుంటుందని కుటుంబ సభ్యులు సూచించేవారు. కానీ చెస్ తప్ప మరో లోకం తెలియకుండా కార్ల్‌సెన్ ముందుకు దూసుకెళ్లాడు. కుటుంబ సభ్యులు కూడా ఆ అబ్బాయి ఆసక్తిని గమనించి ప్రోత్సహించారు. ఆ ఫలితం గానే అతను ప్రపంచ విజేతగా నిలువగలిగాడు.

విజయాలు మార్చు

  • 2004లో ఏప్రిల్ 26న కార్ల్‌సెన్ 13 ఏళ్ల 148 రోజుల వయస్సులో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) హోదా దక్కించుకున్నాడు. చెస్ చరిత్రలో పిన్న వయస్సులో జీఎం హోదా పొందిన రెండో క్రీడాకారుడిగా నిలిచాడు.
  • 2010లో జనవరి 1న కార్ల్‌సెన్ 19 ఏళ్ల 32 రోజుల వయస్సులో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో అతను చెస్ చరిత్రలో టాప్ ర్యాంక్ దక్కించుకున్న పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు.
  • 2013 జనవరిలో కార్ల్‌సెన్ 2861 ఎలో రేటింగ్‌తో చెస్ చరిత్రలో అత్యుత్తమ రేటింగ్ సాధించాడు. ఈ తర్వాత ఫిబ్రవరిలో 2872 పాయింట్లతో తన ఎలో రేటింగ్‌ను మరింత మెరుగుపర్చుకున్నాడు. 2009లో బ్లిట్జ్ విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు.
  • 2 ప్రపంచ చెస్ చాంపియన్‌గా నిలిచిన రెండో పిన్న వయస్కుడిగా కార్ల్‌సెన్ గుర్తింపు పొందాడు. 1985లో రష్యా దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ 22 ఏళ్ల 6 నెలల 27 రోజుల వయసులో ప్రపంచ చాంపియన్‌గా నిలువగా... కార్ల్‌సెన్ 22 ఏళ్ల 11 నెలల 22 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు.
  • 16 ప్రపంచ చెస్ సమాఖ్య (ఫిడే) ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో టైటిల్ నెగ్గిన 16వ క్రీడాకారుడిగా కార్ల్‌సెన్ నిలిచాడు.

2013 ప్రపంచ చదరంగం పోటీలు మార్చు

ఐదుసార్లు విశ్వవిజేత ఆనంద్‌తో జరిగిన మ్యాచ్‌లో కార్ల్‌సెన్ 6.5-3.5 పాయింట్ల తేడాతో నెగ్గి ప్రపంచ చాంపియన్‌గా అవతరించి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చేతుల మీదుగా రూ. 9 కోట్ల 90 లక్షల బహుమతి తోపాటు ట్రోఫీని గెలుచుకున్నాడు. రెండవ స్థానంలో నిలిచిన విశ్వనాథన్ ఆనంద్‌ రూ. 6 కోట్ల 3 లక్షల బహుమతి గెలుచుకున్నాడు. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) అధ్యక్షుడు కిర్సాన్ ఇల్యూమ్‌జినవ్ వరుసగా కార్ల్‌సెన్, ఆనంద్‌లకు స్వర్ణ, రజత పతకాలను అందజేశాడు.

మూలాలు మార్చు

  1. ఈనాడు ఆదివారం 8, 2013