మార్గరెట్ మిచెల్

అమెరికా రచయిత్రి మరియు పాత్రికేయురాలు

మార్గరెట్ మిచెల్ (నవంబరు 8, 1900 – ఆగస్టు 16, 1949), ప్రముఖ అమెరికన్ రచయిత్రి, ప్రాత్రికేయురాలు. ఆమె పూర్తి పేరు మార్గరెట్ మున్నెర్లియన్ మిచెల్. ఆమె జీవించి ఉన్న సమయంలో కేవలం ఒక్క నవలనే ప్రచురించింది. అమెరికా అంతర్యుద్ధం నేపధ్యంగా ఆమె రాసిన గాన్ విత్ ద విండ్ అనే నవల 1936లో ప్రచురింపబడింది. ఈ నవలకు జాతీయ బుక్ అవార్డు, పులిట్జెర్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ అవార్డు కూడా లభించింది.[1] ఈ మధ్య కాలంలో అముద్రితమైన ఆమె రచనలు కొన్ని, ఒక నవలికలను ప్రచురించారు. ఆమె యుక్తవయసులో ఉన్నప్పుడు రాసిన లాస్ట్ లయ్సెన్ అనే ఈ నవలిక విడుదలైన సంవత్సరంలో బెస్ట్ సెల్లర్ గా నిలవడం విశేషం. అలాగే ది అట్లాంటా జర్నల్ కు ఆమె రాసిన కొన్ని వ్యాసాలను ఈ మధ్య తిరిగి పుస్తకం రూపంలో ప్రచురించబడింది.

మార్గరెట్ మిచెల్

కుటుంబ చిత్రణ మార్చు

అట్లాంటా, జార్జియాల్లో తన జీవితమంతా జీవించింది మార్గరెట్. ఆమె నవంబరు 8 1900న ఒక ధనవంతుల, రాజకీయ ప్రాముఖ్యత కలిగిన కుటుంబంలో జన్మించింది. మార్గరెట్ తండ్రి ఎగెనె మ్యూస్ మిచెల్ అప్పట్లో ప్రముఖ న్యాయవాది. ఆమె తల్లి మేరీ ఇసబెల్ స్టీఫెన్స్ ఓటు హక్కు పోరాట యోధురాలు. ఆమెకు ఇద్దరు అన్నలు. 1894లో పుట్టిన పెద్ద అన్న రస్సెల్ స్టీఫెన్స్ మిచెల్ చిన్నతనంలోనే చనిపోయాడు. ఇంకో అన్న అలెగ్జాండర్ స్టీఫెన్స్ మిచెల్ 1896లో పుట్టాడు.[2][3]

మిచెల్ తండ్రి పూర్వులు స్కాట్ ల్యాండ్ లోని అబెర్డీన్ షైర్ కు చెందినవారు. వారు తామస్ మిచెల్ కు వారసులు. వారు 1777లోనే జార్జియాలోని వాకీస్ కంట్రీకు మారిపోయారు. ఆ తరువాత ఆ కుటుంబం వారు అమెరికా విప్లవ యుద్ధంలో పాల్గొన్నారు.

మూలాలు మార్చు

  1. "5 Honors Awarded on the Year's Books: .
  2. Candler, Allen D., and Clement A. Evans.
  3. Johnson, Joan Marie.