మోనార్క్ సీతాకోకచిలుక

మోనార్క్ సీతాకోకచిలుక ఉత్తర అమెరికా సీతాకోకచిలుక దీని రెక్కలు తేలికగా నలుపు, నారింజ, తెలుపు రంగులో కలిగి ఉంటాయి.ఇది చాలా చిన్నదిగా ఉంటుంది.ఈ సీతాకోక చిలుకలు రెక్కలు విప్పితే పది సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది.[1]

ఆడ సీతాకోకచిలుక

జీవిత కాలం ఆహరం మార్చు

మెనార్క సీతాకోకచిలుక జీవిత కాలం ఐదు నెలలు జీవిస్తాయి. భారతదేశం , ఆస్ట్రేలియా , కెనడా , మెక్సికో , అమెరికాల్లో కూడా ఇవి అరుదుగా కనిపిస్తాయి.ఇవి ఎక్కువగా అమెరికాలో ఉన్న మిల్క్‌వీడ్ చెట్ల ఆకులను ఆహారంగా తీసుకుంటాయి.

సంతానోత్పత్తి మార్చు

సంతానోత్పత్తి అమెరికాలో జరిపి శీతాకాలంలో రక్షణ కోసం దాదాపు 3వేల కిలోమీటర్లు ప్రయాణించి మెక్సికో, కాలిఫోర్నియా ప్రాంతాలకు వలస వెళ్లతాయి.

గుడ్లు మార్చు

వేసవి నెలలలో పాలుపట్టిన మొక్కల ఆకు అడుగున గుడ్లు ఒక్కొక్కటిగా పెడతాయి. గుడ్లు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. గుడ్లు బరువు 0.5 కలిగి ఉంటాయి. గుడ్లు పెట్టేందుకు తిరిగి ఆడ మోనార్క్ సీతాకోక చిలుకలు ఉత్తర అమెరికా, కెనడాలకు తిరిగి వెళతాయి. ఇలా ఏటా దాదాపు వంద కోట్ల మోనార్క్ సీతాకోక చిలుకలు ప్రయాణిస్తాయని అంచనా.

ప్రత్యేకత మార్చు

 

పక్షల మాదిరిగానే ప్రతి ఏటా శీతాకాలంలో కెనడ నుండి మెక్సికోకు వలస వెళ్ళాతాయి. వేసవికాలం మళ్లీ తిరుగు పయనం అవుతాయి. మెక్సికోలోని పర్వత ప్రాంతాల్లో ఉన్న పైన్ వృక్షాలు, ఒయామిల్ ఫిర్ చెట్లును అంటిపెట్టుకోని ఉంటాయి. ప్రతి ఏటా లక్షల సీతాకోకచిలుకలు ఆశ్రయం పొందుతున్నయి. సుమారు 19,200 నుంచి 44,800 వేల కి.మీ ప్రయణిస్తాయి.

ఇతర విషయాలు మార్చు

1937 లో కెనడాకు చెందిన జువాలజిస్ట్ ఉర్క్ హర్ట్ సీతాకోకచిలుక ఎక్కడికి వెళ్ళుతున్నయి అని పరిశోధనలు నిర్వహించారు. కొన్ని వేలమంది వాలంటీర్లు సహాయంతో 38 సంవత్సరాల తరువాత అవి ఎక్కడికి వెళ్ళుతున్నయి అని కనుక్కున్నారు. మెక్సికో దేశంలో సీతాకోకచిలుక వలస వెళుతున్న ప్రాంతాన్ని మోనార్క్ బట్టర్ ఫ్లై బయోస్ఫియర్ రిజర్వు గా గుర్తించారు. ఇలాంటి ప్రాంతాలు మెక్సికోలో పది ప్రాంతాలు ఉన్నాయి.

మోనార్క్ సీతాకోకచిలుక సంభోగం (వీడియో)

వలసలు ఆటంకాలు మార్చు

భూతాపం పెరగడం, గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటం వాటి వలసకు ఆటంకం ఏర్పడిందని శాస్తవ్రేత్తలు భావిస్తున్నారు. నవంబర్ ఒకటవ తేదీకల్లా మెక్సికో, కాలిఫోర్నియా ప్రాంతాలకు ఇవి వలస వెళ్లాల్సి ఉంది. అయితే కెనడా, అమెరికాల్లోని తమ నివాస ప్రాంతాల నుంచి అవి లక్షల సంఖ్యలో బయలుదేరినప్పటికీ మధ్యదారిలోనే అవి ఆగిపోయాయి. సముద్ర తీరాల్లోని చెట్లపై ఉండిపోయాయి. వాటిలో కొన్ని ఎగరే ప్రయత్నం చేస్తూ గాలుల తీవ్రతతో నీటిలో పడి మరణిస్తున్నాయి. వేల సంఖ్యలో సీతాకోక చిలుకలు దారితప్పిపోవడం జరిగింది.

మూలాలు మార్చు

  1. "Monarch Butterfly Site: Life Cycle, Migration, Pictures, News, More!". www.monarch-butterfly.com (in ఇంగ్లీష్). Retrieved 2019-11-15.