మోల్లెం జాతీయ ఉద్యానవనం

మోల్లెం జాతీయ ఉద్యానవనం గోవా రాష్ట్రంలోని మోల్లెం అనే ప్రాంతానికి చేరువలో ఉంది.

మోల్లెం జాతీయ ఉద్యానవనం
మోల్లెం వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం
National Park
Mollem National Park
Mollem National Park
మోల్లెం జాతీయ ఉద్యానవనం is located in Goa
మోల్లెం జాతీయ ఉద్యానవనం
మోల్లెం జాతీయ ఉద్యానవనం
Location in Goa, India
మోల్లెం జాతీయ ఉద్యానవనం is located in India
మోల్లెం జాతీయ ఉద్యానవనం
మోల్లెం జాతీయ ఉద్యానవనం
మోల్లెం జాతీయ ఉద్యానవనం (India)
Coordinates: 15°22′25″N 74°15′31″E / 15.37361°N 74.25861°E / 15.37361; 74.25861
దేశంభారతదేశం
రాష్ట్రాలుగోవా
జిల్లాదక్షిణ గోవా
స్థాపన1978
Area
 • Total107 km2 (41 sq mi)
Elevation
890 మీ (2,920 అ.)
భాషలు
 • అధికారికకొంకణి
Time zoneUTC+5:30 (భారతకాలమన ప్రకారం)
పట్టణంమార్గో
IUCN categoryII

చరిత్ర మార్చు

ఈ ఉద్యానవనాన్ని 1978 లో జాతీయ ఉద్యనవనంగా ప్రకటించారు. ఇది 107 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది.[1] ఈ ప్రాంతాన్ని మొదటగా మొల్లెం వినోద(గేమ్) ఉద్యానవనంగా ఉండేది. ఇది 1969 లో వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించి భగవాన్ మహావీర్ అభయారణ్యంగా నామకరణం చేసి 1978 లో భగవాన్ మహావీర్ మోల్లెం జాతీయ ఉద్యానవనంగా ప్రకటించారు. [2]

జంతు, వృక్ష సంపద మార్చు

ఈ ఉద్యానవనంలో చిరుతపులులు, బెంగాల్ పులులు, జింకలు, మూషిక జింకలు, అడవి పందులు లాంటి ఎన్నో రకాల జంతువులకు ఆవాసంగా ఉంది.[3] ఈ ఉద్యానవనంలో సతత హరిత అడవులు, ఆకురాల్చే అడవులు ఉన్నాయి. ఇందులో సతత హరిత అడవులు అధిక ఎత్తులో ఉండి నది ఒడ్డున కనిపిస్తాయి.

మరిన్ని విశేషాలు మార్చు

ఈ ఉద్యానవనంలో దుధ్‌సాగర్ జలపాతం ఉంది. ఈ జలపాతం ఉద్యానవనం నైరుతి భాగంలో ఉన్న కర్ణాటక సరిహద్దు వద్ద ఉన్న మాండోవి నదిపై ఉంది. ఇది గోవాలో ఉన్న ఎతైన జలపాతం (310 మీ), భారతదేశం లో ఐదవ ఎత్తైన జలపాతం. ఇదేకాక ఈ ఉద్యానవనంలో 12 వ శతాబ్దం కాలం నాటి శివాలయం ఉంది.

మూలాలు మార్చు

  1. "(9/10/2005) The Hindu, Bhagwan Mahavir Sanctuary". Archived from the original on 2006-06-24. Retrieved 2019-10-04.
  2. The Department of Science, Technology & Environment, Saligao – Bardez, Goa WILDLIFE SANCTUARIES & NATIONAL PARKS Archived 2016-10-24 at the Wayback Machine
  3. ATREE, Eco-Informatics Center, Bhagwan Mahavir or Mollem Wildlife Sanctuary Archived 2014-03-12 at the Wayback Machine, 2006