ఎ.కే. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై అనీల్ సుంకర దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన సినిమా యాక్షన్ 3D. ఇది భారతదేశం యొక్క తొలి 3D కామెడీ చిత్రం. ఈ సినిమా 3D మరియూ 2D ఫార్మాట్లలో 2013 జూన్ 21న విడుదలైంది.

యాక్షన్ 3D
(2013 తెలుగు సినిమా)
దర్శకత్వం అనీల్ సుంకర
నిర్మాణం రామబ్రహ్మం సుంకర
తారాగణం అల్లరి నరేష్,
వైభవ్,
రాజుసుందరం,
శ్యామ్,
నీలం ఉపాధ్యాయ్,
కామ్న జఠల్మానీ,
స్నేహా ఉల్లాల్,
షీనా షబాబది
సంగీతం బప్పి లహరీ,
బప్పా లహరి,
సన్నీ ఎం.ఆర్.
ఛాయాగ్రహణం సర్వేష్ మురళీ,
కెత్ డ్రైవర్
కూర్పు ఎం.ఆర్.వర్మ
నిర్మాణ సంస్థ ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్
పంపిణీ ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్
భాష తెలుగు

కథ మార్చు

బావ అలియాస్ బాల వర్ధన్ (అల్లరి నరేష్), పురుష్ అలియాస్ పురుషోత్తం (రాజు సుందరం), శివ (వైభవ్), అజయ్ (శ్యామ్)లు నలుగురూ చిన్ననాటి నుండి ప్రాణ స్నేహితులు. ఈ నలుగురిలో బావ బ్యాచిలర్, పురుష్ కి అనిత (కామ్న జఠ్మలాని)తో పెళ్లై ఉంటుంది, శివ సంధ్య (రీతు బర్మేచ)తో ప్రేమలో ఉంటాడు, చివరిగా అజయ్ శృతి (షీన)తో ప్రేమలో ఉంటాడు. అజయ్ – శృతిల ప్రేమకి పెద్దవాళ్ళు ఒప్పుకోవడంతో వారి పెళ్ళికి ముహూర్తం పెడతారు. అప్పుడు ఈ నలుగురు ఫ్రెండ్స్ కొద్ది రోజులు గోవా వెళ్లి బాగా ఎంజాయ్ చెయ్యాలనుకుంటారు. అనుకున్నట్టుగానే హైదరాబాద్ నుండి గోవాకి కారులో బయలుదేరుతారు. మార్గ మధ్యంలో అనుకోకుండా వీరికి గీత (నీలం ఉపాధ్యాయ్) తారసపడుతుంది. తొలి చూపులోనే గీతలో బావ ప్రేమలో పడతాడు. కానీ తన మెంటాలిటీ నచ్చకపోవడంతో గీత మధ్య లోనే బావకి దూరంగా వెళ్ళిపోతుంది.

గీత మళ్ళీ వస్తుందన్న నమ్మకంతో అక్కడి నుండి వాళ్ళు గోవా చేరుకుంటారు. అజయ్ పెళ్ళి తర్వాత మన జీవితాలు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ఆ రోజు రాత్రి ఫుల్ గా ఎంజాయ్ చెయ్యాలనుకుంటారు. ఫుల్ గా మందు తాగుతారు. అప్పుడే కథలో ట్విస్ట్.. పొద్దున్న లేచే సరికి వారి లైఫ్ లో అనుకోని సంఘటనలు జరగడం మొదలు పెడతాయి. వారి లైఫ్ లోకి సమీర (స్నేహ ఉల్లాల్), సుదీప్ మరికొందరు ఎవరెవరో వారికి ఇబ్బందులు క్రియేట్ చేస్తుంటారు. ఇంతకీ వీళ్ళంతా ఎవరు? ఆ రోజు రాత్రి మందు తాగిన తర్వాత ఏం జరిగింది? సమీర ఎలా వీరి లైఫ్ లోకి వచ్చింది? ఈ ఇబ్బందులన్నిటినీ వారు దాటుకొని చివరికి అజయ్ పెళ్ళి టైంకి హైదరాబాద్ చేరుకున్నారా? లేదా అనే ఆసక్తికరమైన మలుపుల్ని మీరు తెరపైనే చూడాలి.

నటవర్గం మార్చు

పాటల జాబితా. మార్చు

సండే మండే , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.రంజిత్, సుచిత్ర

ప్రెట్టీ గర్ల్ , రచన: సిరశ్రి , గానం.రఘు కుంచె

ఓ లాల , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం . బప్పిళహరి

డింగ్ డాంగ్, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.ప్రీయ హిమేశ్ , చిన్నిచరన్

స్వాతీముత్యపు జల్లులలో , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.కార్తీక్, దివిజ

మమసిత , రచన: భువన చంద్ర, గానం . బాబా సెహగల్, బప్పిలహారి.

సాంకేతికవర్గం మార్చు

  • ఛాయాగ్రహణం -. సర్వేష్ మురళీ, కెత్ డ్రైవర్
  • సంగీతం - బప్పి లహరీ, బప్పా లహరి, సన్నీ ఎం.ఆర్.
  • కూర్పు - ఎం.ఆర్.వర్మ

బయటి లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=యాక్షన్_3D&oldid=4093645" నుండి వెలికితీశారు