యాలాల్ మండలం

తెలంగాణ, వికారాబాదు జిల్లా లోని మండలం


యాలాల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం.[1] యాలాల్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన తాండూరు నుండి 12 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం తాండూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వికారాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో  34  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.

యాలాల్ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, యాలాల్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, యాలాల్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, యాలాల్ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°12′51″N 77°38′20″E / 17.214264°N 77.638779°E / 17.214264; 77.638779
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వికారాబాదు జిల్లా
మండల కేంద్రం యాలాల్
గ్రామాలు 33
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 45,295
 - పురుషులు 22,128
 - స్త్రీలు 23,167
అక్షరాస్యత (2011)
 - మొత్తం 41.90%
 - పురుషులు 54.72%
 - స్త్రీలు 29.44%
పిన్‌కోడ్ 501144

గణాంకాలు మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త రంగారెడ్డి జిల్లా పటంలో మండల స్థానం

మండల జనాభా మార్చు

2001 భారత జనగణన గణాంకాల ప్రకారము యాలాల మండల జనాభా 39451 (పురుషుల సంఖ్య 19537, మహిళలు 19914).అక్షరాస్యత (2011) - మొత్తం 41.90% - పురుషులు 54.72% - స్త్రీలు 29.44%. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 198 చ.కి.మీ. కాగా, జనాభా 45,295. జనాభాలో పురుషులు 22,128 కాగా, స్త్రీల సంఖ్య 23,167. మండలంలో 9,514 గృహాలున్నాయి.[3]

సమీప మండలాలు మార్చు

ఈ మండలానికి సమీపంలో తాండూరు మండలం ఉత్తరాన, బొంరాస్పేట తూర్పున, కొడంగల్ దక్షిణాన, పెద్దేముల్ మండలం ఉత్తరాన ఉన్నాయి. బొమ్మరాస్ పల్లి మండలం తూర్పున, బషీరాబాద్ మండలం పడమరన ఉన్నాయి.[4]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు మార్చు

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 248  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016   
  2. "వికారాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. http://www.onefivenine.com/india/villages/Rangareddi/Yalal/Yalal[permanent dead link]

వెలుపలి లంకెలు మార్చు