రణధీర్ గట్ల

సినీ నటుడు

రణధీర్ గట్ల ఒక తెలుగు సినిమా నటుడు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీడేస్ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు.[1]

రణధీర్ గట్ల
జననం
హైదరాబాదు
జాతీయతభారతీయుడు
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2007-ప్రస్తుతం

వ్యక్తిగత జీవితం మార్చు

రణధీర్ హైదరాబాదు లో పుట్టి పెరిగాడు. సింబయోసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి ఎం. బి. ఏ పూర్తి చేశాడు. తరువాత ప్రముఖ సంస్థ మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం చేస్తూ కొన్నేళ్ళు బెంగళూరు లో ఉన్నాడు. సినిమాల్లో ప్రవేశించక మునుపు కొన్ని ప్రకటనల్లో కనిపించాడు.

సినిమాలు మార్చు

2007 లో శేఖర్ కమ్ముల అందరూ కొత్త వాళ్ళతో తాను తీయబోయే సినిమా కోసం నిర్వహించిన ఆడిషన్లో పాల్గొన్నాడు. అప్పటికి పూర్వ నటనానుభవం లేదు. ఈ సినిమా తర్వాత నీలకంఠ తీసిన మిస్టర్ మేధావి సినిమాలో అవకాశం వచ్చింది. తర్వాత వచ్చిన యువత సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషించాడు.

మూలాలు మార్చు

  1. "చిట్ చాట్ : రణధీర్ – ఏ సినిమాకైనా కథే హీరో.!". 123telugu.com. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్. Retrieved 24 September 2017.
  2. "jeevi review for Adda". idlebrain.com. Retrieved 16 July 2019.