రాగ దీపం (ఇంగ్లీష్: మ్యూజికల్ లైట్ ) 1982 లో తెలుగు సినుమా. దీనిని వీర రాణి ఎంటర్ప్రైజెస్ నిర్మాణ సంస్థ [1] లో కొడాలి బోసుబాబు దాసరి నారాయణరావు దర్శకత్వంలో నిర్మించాడు.[2] ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ ప్రధాన పాత్రల్లో నటించారు. చక్రవర్తి సంగీతం సమకూర్చాడు.[3][4]

రాగదీపం
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
జయసుధ ,
లక్ష్మి
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ శ్రీ మురళీకృష్ణ ఆర్ట్ క్రియేషన్స్
భాష తెలుగు

కథ మార్చు

చక్రవర్తి (అక్కినేని నాగేశ్వరరావు) సంగీత విద్వాంసుడు. కోటీశ్వరుడైన గోపాలరావు (రావు గోపాలరావు) కుమార్తె కల్యాణి (జయసుధ) అనే అందమైన అమ్మాయిని ప్రేమిస్తాడు. వారి పెళ్ళికి ముందు, ఊహించని పరిస్థితి తలెత్తుతుంది. చక్రవర్తి తనను పెంచి పెద్దచేసిన మాస్టర్ (గుమ్మడి) ను కలుస్తాడు. ఆ సమయంలో, మాస్టర్ తన ఏకైక కుమార్తె గౌరీ (లక్ష్మి)కి పెళ్ళి చేయలేకపోవడంతో ఆమె మానసిక అనారోగ్యానికి గురైందని అతనికి తెలుస్తుంది. ఆమెను ఆ పరిస్థితి నుండి రక్షించడానికి, తానామెను పెళ్ళి చేసుకోబోతున్నానని అబద్ధం చెప్పమని చక్రవర్తిని మాస్టరు కోరతాడు. తరువాత, చక్రవర్తికి ఇప్పటికే పెళ్ళి కుద్రిందని తెలుసుకున్న మాస్టరు కళ్యాణిని కలిసి చక్రవర్తి తన కుమార్తెను పెళ్ళి చేసుకునేలా ఒప్పించమని కోరతాడు. కళ్యాణి చక్రవర్తిని అందుకు ఒప్పిస్తుంది. ఆ తరువాత, చక్రవర్తి ఒక గొప్ప వ్యక్తి రంగనాథ్ (రంగనాథ్) తో కల్యాణి పెళ్ళి చేస్తాడు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, చక్రవర్తి జంటకు ఇద్దరు పిల్లలు కలుగుతారు. కానీ గౌరి తన భర్త పట్ల అసభ్యంగా ప్రవర్తించే గయ్యాళి, ఇతరులతో దురుసుగా ప్రవర్తిస్తుంది. ఇంతలో చక్రవర్తి, కల్యాణిని పిల్లవాడితో వీధుల్లో తిరుగుతూండగా చూస్తాడు. గోపాలరావు దివాళా తీయడంతో రంగనాథ్ ఆమెను విడిచిపెట్టినట్లు తెలుసుకుంటాడు చక్రవర్తి ఆమెకు ఆశ్రయం ఇస్తాడు. ఇది అతని కుటుంబంలో అనేక వివాదాలకూ, అపార్థాలకూ దారితీస్తుంది. చక్రవర్తి, కళ్యాణి ల మధ్య గౌరి అక్రమ సంబంధాన్ని ఆపాదించడంతో కల్యాణి ఇల్లు విడిచిపోతుంది. అది తెలిసి, కోపంతో చక్రవర్తి గౌరీని మందలించి అసలు సత్యాన్ని వెల్లడిస్తాడు. అది తెలుసుకున్న గౌరి, తన భర్తకు తన పట్ల ఉన్నది జాలి తప్ప ప్రేమ కాదని తెలిసి ఆమె కూడా ఇల్లు వదలి పోతుంది. కల్యాణి ఆత్మహత్య చేసుకుంటుంది. గౌరీ తన తప్పు తెలుసుకుని క్షమించమని వేడుకుంటుంది. ఆ దంపతులు కల్యాణి బిడ్డను దత్తత తీసుకుంటారు.

తారాగణం మార్చు

సాంకేతిక సిబ్బంది మార్చు

పాటలు మార్చు

ఎస్. పాట పేరు సాహిత్యం సింగర్స్ పొడవు
1 "అదిగో అదిగో అదిగో" దాసరి నారాయణరావు ఎస్పీ బాలు, పి.సుశీల 4:36
2 "నీ కారు నెంబర్ 1" దాసరి నారాయణరావు ఎస్పీ బాలు, పి.సుశీల 4:31
3 "కుంకుమ పూసిన ఆకాశంలో" వేటూరి సుందరరామమూర్తి ఎస్పీ బాలు, పి.సుశీల 4:26
4 "తెల్లావారే తెల్లావారే" దాసరి నారాయణరావు ప్రకాష్ రావు, పి.సుశీల 4:32
5 "వయ్యారానికి ఓటిస్తా" వేటూరి సుందరరామమూర్తి ఎస్పీ బాలు, పి.సుశీల 4:24
6 "పూసీ పూయని" వేటూరి సుందరరామమూర్తి ఎస్పీ బాలు 4:05
7 "పసుపుతాడుకు ముడులు" సి.నారాయణ రెడ్డి ఎస్పీ బాలు 4:26

మూలాలు మార్చు

  1. "Raaga Deepam (Banner)". Filmiclub.
  2. "Raaga Deepam (Direction)". Spicy Onion.
  3. "Raaga Deepam (Cast & Crew)". gomolo.com. Archived from the original on 2018-10-15. Retrieved 2020-08-08.
  4. "Raaga Deepam (Review)". Know Your Films.
"https://te.wikipedia.org/w/index.php?title=రాగదీపం&oldid=3558453" నుండి వెలికితీశారు