రాజశ్రీ పతి

భారతీయ వ్యాపారవేత్త

రాజశ్రీ పతి తమిళనాడులోని కొయంబత్తూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, వ్యాపార దక్షతగల వనిత. తెలుగు సంతతికి చెందిన మహిళ. Rajshree Sugars and Chemicals పరిశ్రమకు అధిపతి. ప్రస్తుతము భారత చక్కెర పరిశ్రమల సంఘమునకు అధ్యక్షురాలు.

రాజశ్రీ పతి

కుటుంబము మార్చు

రాజశ్రీ ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, దాతృత్వమునకు పేరొందిన P. S. గోవింద స్వామి నాయుడు వంశమునకు చెందిన శ్రీ వరదరాజు కుమార్తె. తండ్రి వరదరాజు పార్లమెంటు సభ్యుడు, పేరొందిన దాత. లక్ష్మీ మిల్స్ కూటమికి చెందిన పతి సుందరాన్ని వివాహమాడింది.

పరిశ్రమలు మార్చు

1992లో తండ్రి మరణము పిదప బాధ్యతలు స్వీకరించి అతి కొద్ది కాలములోనే కంపెనీని బహుముఖముగా విస్తరింప వచేసింది. Rajshree Sugars and Chemicals కూటమిలో చక్కెర, ఆల్కహాల్, విద్యుత్, బయోటెక్నాలజీ, ప్రత్తి, రియల్ ఎస్టేట్, పర్యాటక రంగము ముఖ్యమైనవి. 1990లో 50 కోట్లతో మొదలైన వ్యాపారము ప్రస్తుతము 300కోట్లకు విస్తరించింది[1].

పదవులు, పురస్కారములు మార్చు

  • 2004-2005 సంవత్సరములో భారత చక్కెర కర్మాగారముల సంఘమునకు తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నుకొన బడింది.
  • 2007-2009 లో దక్షిణ భారత చక్కెర కర్మాగారముల సంఘమునకు అధ్యక్షురాలిగా సేవ చేసింది.
  • World Economic Forum, Davos (Switzerland) 1996 సంవత్సరానికి "Global Leader of Tomorrow"గా ఎన్నుకున్నది.
  • 2000 సంవత్సరపు "Eisenhower Exchange Fellowship" పొందినది.
  • FICCI మహిళా సంఘము 2006 సంవత్సరపు "Woman of the Year" పురస్కారము ఇచ్చి గౌరవించినది[2].

మూలాలు మార్చు