రాజా నరసింహా 2020లో విడుదలైన తెలుగు సినిమా. మలయాళంలో విడుదలైన ‘మధుర రాజా’ సినిమాను తెలుగులో ‘రాజా నరసింహా’ పేరుతో జై చెన్నకేశవ పిక్చర్స్ బ్యానర్‌పై సాధు శేఖర్ తెలుగులో అనువదించగా[1], వైశాఖ్‌ దర్శకత్వం వహించాడు. మమ్ముట్టి, జై, జగపతిబాబు, మహిమా నంబియార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జనవరి 1న విడుదలైంది.[2]

రాజా నరసింహా
దర్శకత్వంవైశాఖ్‌
స్క్రీన్ ప్లేవైశాఖ్‌
నిర్మాతసాధు శేఖర్
తారాగణంమమ్ముట్టి
జై
జగపతిబాబు
మహిమా నంబియార్
ఛాయాగ్రహణంషాజీ కుమార్
కూర్పుమహేష్ నారాయణన్, సునీల్ యస్ పిళ్లై
సంగీతంగోపి సుందర్
నిర్మాణ
సంస్థ
జై చెన్నకేశవ పిక్చర్స్
విడుదల తేదీ
2020 జనవరి 1
సినిమా నిడివి
150 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

అటవీ ప్రాంతంలో డబ్బు సంపాదనే లక్ష్యంగా గీరేశం(జగపతి బాబు) తయారు చేసే కల్తీ మందుతాగి 75 మంది చనిపోతారు. ఆ సమస్యను తీర్చగలిగే ఏకైక వ్యక్తి నవ్యాంధ్ర ప్రజాసేన అధ్యక్షుడు రాజా (మమ్ముట్టి). నమ్మి తన వెంట వచ్చినవాళ్లను ప్రాణం ఇచ్చి అయినా కాపాడతాడు. అయితే పాలకొల్లుకు రాజా తన తండ్రి , తమ్ముడు చిన్నా(జై) కోసం ఆ అటవీ ప్రాంతంలో అడుగుపెడతాడు. అలా అడుగుపెట్టిన రాజా గిరీశం చేసే అవినీతిని బయటపెట్టి అక్కడ గిరీశంకి వ్యతిరేకంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు. రాజా తన అవినీతి జీవితానికి అడ్డుతగలడంతో చిన్నాను రాజాకి సహాయం చేసే మరో మహిళను తన వేట కుక్కలచేత చంపిస్తాడు. ఆ విషయం తెలుసుకున్న రాజా చివరికి గిరీశంను ఎలా అంతమొందించాడనేది మిగతా సినిమా కథ.

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: జై చెన్నకేశవ పిక్చర్స్
  • నిర్మాత:వడ్డీ రామానుజం, పురం రాధాకృష్ణ
  • కథ, స్క్రీన్‌ప్లే: ఉదయ్ కృష్ణ
  • దర్శకత్వం: వైశాఖ్‌
  • సంగీతం: గోపి సుందర్
  • సినిమాటోగ్రఫీ: షాజీ కుమార్
  • ఎడిటింగ్ : మహేష్ నారాయణన్, సునీల్ యస్ పిళ్లై[3]

మూలాలు మార్చు

  1. 10TV (6 November 2019). "'రాజా నరసింహా'గా మమ్ముట్టి 'మధుర రాజా'" (in telugu). Archived from the original on 30 April 2022. Retrieved 30 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. The Times of India (2020). "Raja Narasimha Movie". Archived from the original on 30 April 2022. Retrieved 30 April 2022.
  3. 10TV (16 November 2019). "రాజా నరసంహా : 'చాందినీ రాత్' వీడియో సాంగ్" (in telugu). Archived from the original on 30 April 2022. Retrieved 30 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)