రాహుల్ రామకృష్ణ

నటుడు, రచయిత

రాహుల్ రామకృష్ణ తెలంగాణా రాష్ట్రానికి చెందిన నటుడు, రచయిత, విలేఖరి. సైన్మా అనే లఘుచిత్రంతో నటుడిగా రంగ ప్రవేశం చేసి తర్వాత అర్జున్ రెడ్డి సినిమాలో కథానాయకుడి స్నేహితుడి పాత్ర పోషించాడు. జాతీయ పురస్కారం గెలుచుకున్న పెళ్ళి చూపులు సినిమాలో రెండు పాటలు కూడా రాశాడు.[2][3]

రాహుల్ రామకృష్ణ
జననం (1991-01-15) 1991 జనవరి 15 (వయసు 33)
వృత్తినటుడు, రచయిత, విలేఖరి
క్రియాశీల సంవత్సరాలు2014–ప్రస్తుతం
జీవిత భాగస్వామిహరిత[1]
పిల్లలు1

జననం మార్చు

తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాదు లో జన్మించాడు. తండ్రి యోగా అధ్యాపకుడు కాగా తల్లి ఓ వ్యాపార పత్రికలో సహాయ సంపాదకురాలు. హైదరాబాదులోని విజేఐటి కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం వరకు చదివి ఆపేశాడు.

వృత్తి మార్చు

ఇతను పోస్ట్ నూన్, మెట్రో ఇండియా అనే దినపత్రికల్లో విలేఖరిగా పనిచేశాడు. ఏదైనా పనిమీద హైదరాబాదుకు వచ్చిన విలేఖరులకు అనువాదకుడిగా సహకరించేవాడు. హిందుస్థాన్ టైమ్స్ పత్రిక నడిపే ఒక సినిమా సమీక్షల వెబ్ సైటులో రచయితగా కొద్దికాలం పనిచేశాడు. ఇలాంటివి కాకుండా పాటల రచయితగా, స్క్రీన్ రైటరుగా, టివిల్లో వంటల కార్యక్రమాల్లో వ్యాఖ్యాత లాంటి వైవిధ్యభరితమైన పనులు చేశాడు.

సినిమారంగం మార్చు

నాటకరంగం మీద ఆసక్తితో కొన్ని నాటకరంగ సంస్థల నిర్మాణ పనులు చూసేవాడు. అలా అతనికి నటనతో పరిచయం కలిగింది. నాటక రచయితలైన ఎన్. మధుసూదన్, డా. సాగరి రాందాస్ నిర్వహించిన వర్క్ షాపుల్లో పాల్గొన్న తర్వాత అతనికి నటన మీద ఆసక్తి ఎక్కువైంది. వారిద్దరినీ తన గురువులుగా, మార్గనిర్దేశకులుగా భావించుకున్నాడు. తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో వచ్చిన సైన్మా అనే లఘుచిత్రంతో అతని కెరీర్ ప్రారంభమైంది.[4] ఈ సినిమాకు మంచి ప్రశంసలు రావడంతో జయమ్ము నిశ్చయమ్మురా (2016) అనే సినిమాలో కథానాయకుడి సహాయ పాత్ర చేసే అవకాశం లభించింది. శివరాజ్ కనుమూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీనివాస రెడ్డి, పూర్ణ ప్రధాన పాత్రధారులు.

తర్వాత అతను అర్జున్ రెడ్డి (2017) చిత్రంలో కథానాయకుడి స్నేహితుడు శివగా నటించాడు. ఈ పాత్ర స్నేహితుడు ఏ స్థితిలో ఉన్నా అతనికి అండగా నిలుస్తూ అతనికి నైతిక బలం ఇచ్చే ప్రధామైన పాత్ర. దానికి తగ్గట్టు కొద్దిపాటి హాస్యం కూడా ఈ పాత్రకు జోడించబడింది. ఈ సినిమాతో ఇతనికి నటుడిగా మంచి పేరు వచ్చింది. అర్జున్ రెడ్డి తెచ్చిన పేరుతో 2018 లో భరత్ అనే నేను, సమ్మోహనం లాంటి చిత్రాల్లో నటించాడు. తర్వాత అమెజాన్ నిర్మించిన గ్యాంగ్ స్టర్ అనే వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్ర పోషించాడు. 2018 లో వచ్చిన గీతగోవిందం సినిమాలో అర్జున్ రెడ్డి లాగానె నాయకుడు విజయ్ దేవరకొండకు స్నేహితుడిగా కనిపించాడు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. 2020 లో అల వైకుంఠపురములో సినిమాలో ఓ పాత్ర పోషించాడు.

నటించిన చిత్రాలు మార్చు

సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2014 సైన్మా రాము షార్ట్ ఫిల్మ్
2016 జయమ్ము నిశ్చయమ్ము రా యాదగిరి డైలాగ్ రైటర్ కూడా
షీష్‌మహల్ ఫిల్మ్ మేకర్
2017 అర్జున్ రెడ్డి శివుడు
2018 ఇంటెలిజెంట్ రాహుల్
భరత్ అనే నేను రమణ
సమ్మోహనం మూర్తి
చి.ల.సౌ. పోలీసు అధికారి
గీత గోవిందం రామకృష్ణ
హుషారు రాజ్ బొల్లం
మిఠాయి సాయి
2019 కల్కి దేవ దత్తా
బ్రోచేవారెవరురా రాంబో
2020 అలా వైకుంఠపురములో రవీంద్ర
ప్రెజర్ కుక్కర్ చంద్రశేఖర్
గువ్వ గోరింక అమెజాన్ ప్రైమ్ వీడియో ఫిల్మ్
2021 ఏ 1 ఎక్స్‌ప్రెస్ రాహుల్
జాతి రత్నాలు జోగిపేట రవి
గుడ్ లక్ సఖీ
వై బాలు ఆహా సినిమా
షాదీ ముబారక్ డ్రైవర్
పాగల్ యువ నాయకుడు
నెట్ లక్ష్మణ్
రిపబ్లిక్ మణి
స్కైలాబ్ సుబేదార్ రామారావు
2022 ఆర్.ఆర్.ఆర్ లచ్చు
విరాట పర్వం
అంటే సుందరానికి డాక్టర్ గురువేష్
హ్యాపీ బర్త్‌డే గుండ
కృష్ణ వ్రింద విహారి
ఓరి దేవుడా దేవుని సహాయకుడు
2023 ఇంటింటి రామాయణం శీను
విమానం కోటి
ఖుషి ఆర్కే
2024 ఓం భీమ్ బుష్

పురస్కారాలు మార్చు

మూలాలు మార్చు

  1. Sakshi (9 May 2022). "రాహుల్‌ రామకృష్ణ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరంటే." Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.
  2. "Rahul Ramakrishna redefines on-screen friendship in 'Arjun Reddy'". The Hindu. Retrieved 2017-08-31.
  3. "Arjun Reddy: In red and black". The Hindu. Retrieved 2017-08-31.
  4. ch, Susil Rao (22 January 2020). "Was raped as a child, says Telugu film actor Rahul Ramakrishna". The Times of India. Retrieved 16 March 2020.