రిచర్డ్ బ్రింస్లే షెరిడాన్


రిచర్డ్ బ్రింస్లే షెరిడాన్ (అక్టోబర్ 30, 1751 - జూలై 7, 1816) ఐర్లాండ్ దేశానికి చెందిన ఆంగ్ల కవి, నాటక రచయిత, నాటకశాల అధినేత, పార్లమెంట్ సభ్యుడు.[1]

రిచర్డ్ బ్రింస్లే షెరిడాన్
రిచర్డ్ బ్రింస్లే షెరిడాన్

పదవీ కాలం
1806 – 1807
ప్రధాన మంత్రి లార్డ్ గ్రెంవిల్లె
ముందు జార్జ్ క్యానింగ్
తరువాత జార్జ్ రోజ్

వ్యక్తిగత వివరాలు

జననం (1751-10-30)1751 అక్టోబరు 30
డబ్లిన్, ఐర్లాండ్
మరణం 1816 జూలై 7(1816-07-07) (వయసు 64)
14 సవిలే రో, లండన్, ఇంగ్లాండ్
రాజకీయ పార్టీ విగ్
జీవిత భాగస్వామి ఎలిజబెత్ అన్ లిన్లీ, ఎస్తేర్ జేన్ ఓగిల్
వృత్తి నాటక రచయిత

జననం - విద్యాభ్యాసం మార్చు

రిచర్డ్ బ్రింస్లే షెరిడాన్ 1751, అక్టోబర్ 30న డబ్లిన్ లో జన్మించాడు. హారోలో తన విద్యాభ్యాసం పూర్తిచేశాడు.[2] 1758లో ఏడేళ్ళ వయసులో షెరిడాన్ కుటుంబం ఇంగ్లాండ్ కు వెళ్ళిపోయింది.[3]

రంగస్థల ప్రస్థానం మార్చు

చిన్నతనం నుండి సాహిత్యంపై మక్కువ పెంచుకున్న రిచర్డ్ బ్రింస్లే షెరిడాన్ తన 23వ ఏట ది రైవల్స్ అనే నాటకాన్ని రాశాడు. 1775లో ఈ నాటకం ప్రదర్శించబడింది. 1776లో నాటకశాలను కొన్న షెరిడాన్ 1794లో దానిని బాగుచేయించాడు. 1809లో ఆ నాటకశాల కాలిపోయింది.

నాటక రచనలు మార్చు

ఈయన రాసిన నాటకాలను కందుకూరి వీరేశలింగం పంతులు, భమిడిపాటి కామేశ్వరరావు తెలుగులోకి అనువదించారు.[4]

  1. ప్రత్యర్థులు (1775)
  2. ది స్కీమింగ్ లెఫ్టనెంట్ (1775)
  3. ది డ్యూయెన్నా (1775)
  4. అపవాద తరంగిణి (1777)
  5. ఎ ట్రాజెడీ రిహార్స్‌డ్ (విమర్శకుడు) (1779)
  6. స్కార్‌బరో ప్రయాణం (1777)
  7. పిజారో (1799)

మరణం మార్చు

రిచర్డ్ బ్రింస్లే షెరిడాన్ 1816, జూలై 7న మరణించాడు.

మూలాలు మార్చు

  1. రిచర్డ్ బ్రింస్లే షెరిడాన్, నాటక విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట. 605.
  2. Rae 1897, p. 78.
  3. Thomas Sheridan Biography Archived 2018-11-19 at the Wayback Machine at James Boswell Info; retrieved 30 June 2013.
  4. రిచర్డ్ బ్రింస్లే షెరిడాన్, నాటక విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట. 606.