రిచీ రిచర్డ్‌సన్

వెస్టిండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడైన రిచీ రిచర్డ్‌సన్ (Richard Benjamin Richardson) 1962, జనవరి 12న ఆంటిగ్వాలో జన్మించాడు. ఇతడు వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు నాయకత్వం కూడా వహించాడు. 1983-84లో భారతపర్యటన సమయంలో క్లైవ్ లాయిడ్ నాయకత్వంలో తొలిసారిగా టెస్ట్ క్రికెట్ లో ప్రవేశించాడు. వివియన్ రిచర్డ్స్ తర్వాత వెస్టిండీన్ క్రికెట్ జట్టుకు నాయకత్వ బాధ్యతలు చేపట్టినాడు. 24 టెస్టులకు కెప్టెన్‌గా వ్య్వహరించి 11 టెస్టులను గెలిపించాడు. నాలుగేళ్ళ అతని నాయకత్వ సమయంలో వెస్టిండీస్ ఒకే ఒక్క సీరీస్ 1995లో ఆస్ట్రేలియాతో ఒడిపోయింది. బ్రియాన్ లారా ఇతని సమయంలోనే ప్రపంచ శ్రేణి బ్యాట్స్‌మెన్‌గా అవతరించాడు.

రిచీ రిచర్డ్‌సన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
రిచర్డ్ బెంజమన్ రిచర్డ్‌సన్
పుట్టిన తేదీ (1962-01-12) 1962 జనవరి 12 (వయసు 62)
Five Islands Village, Antigua and Barbuda
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుRight-arm medium pace
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 180)1983 నవంబరు 24 - ఇండియా తో
చివరి టెస్టు1995 ఆగస్టు 24 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 41)1983 డిసెంబరు 17 - ఇండియా తో
చివరి వన్‌డే1996 మార్చి 14 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1981–1996Leeward Islands
1993–1994Yorkshire
1996–1997Northern Transvaal
1997–1998Windward Islands
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలుs]] ఫస్ట్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 86 224 234 313
చేసిన పరుగులు 5,949 6,248 14,618 8,458
బ్యాటింగు సగటు 44.39 33.41 40.71 31.67
100లు/50లు 16/27 5/44 37/68 6/59
అత్యుత్తమ స్కోరు 194 122 194 122
వేసిన బంతులు 66 58 914 88
వికెట్లు 0 1 13 2
బౌలింగు సగటు 46.00 33.92 42.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 0/0 1/4 5/40 1/4
క్యాచ్‌లు/స్టంపింగులు 90/– 75/– 207/– 94/–
మూలం: Cricket Archive, 2010 అక్టోబరు 19

రిచర్డ్‌సన్ 86 టెస్టులు ఆడి 44.39 సగటుతో 5949 పరుగులు సాధించాడు. 16 సెంచరీలు, 27 అర్థ సెంచరీలు నమోదుచేశాడు. అందులో ఆస్ట్రేలియా పైనే 9 సెంచరీలు సాధించాడు. టెస్టులలో అతని అత్యధిక స్కోరు 194 పరుగులు 1989లో గుయానాలో భారతజట్టుపై సాధించాడు.

వన్డేలలో 224 మ్యాచ్‌లు ఆడి 33.41 సగటుతో 6248 పరుగులు చేసాడు. ఇందులో 5 సెంచరీలు, 44 అర్థ సెంచరీలు సాధించాడు. వన్డేలలో అతని అత్యధిక స్కోరు 122 పరుగులు. రిచర్డ్‌సన్ 1987, 1992, 1996 ప్రపంచకప్ క్రికెట్ పోటీలలో కూడా పాల్గొన్నాడు.

బయటి లింకులు మార్చు