రేస్ (2013 సినిమా)

రమేష్ రాపర్తి దర్శకత్వంలో 2013లో విడుదలైన తెలుగు చలనచిత్రం.

రేస్ 2013, మార్చి 1న విడుదలైన తెలుగు చలనచిత్రం. రమేష్ రాపర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమ్, కార్తీక్, భరత్ కిషోర్, దిశా పాండే, నికితా నారయణ్ నటించగా, వివేక్ సాగర్ & సంజయ్ సంగీతం అందించారు.[1]

రేస్
రేస్ సినిమా పోస్టర్
దర్శకత్వంరమేష్ రాపర్తి
రచనశంకర్ (మాటలు)
నిర్మాతఅన్నే రవి
తారాగణంవిక్రమ్
కార్తీక్
భరత్ కిషోర్
దిశా పాండే
నికితా నారయణ్
ఛాయాగ్రహణంఎస్. మురళీమోహన్ రెడ్డి
కూర్పుమ్యాడీ (మధు)
సంగీతంవివేక్ సాగర్ & సంజయ్
నిర్మాణ
సంస్థ
ఆనంద్ సినీ చిత్ర
విడుదల తేదీ
2013 మార్చి 1 (2013-03-01)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా నేపథ్యం మార్చు

చైతన్య (కార్తీక్), సిద్దార్థ్ (భరత్ కిషోర్), అభిరామ్ (విక్రమ్) ముగ్గురూ చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. చైతన్యకు డబ్బు ఇష్టం, సిద్ధార్థ్ కు అమ్మాయిలంటే ఇష్టం. ఇలా ఉండగా చైతన్య కు అంజలి (నిఖితా నారాయణ్) పరిచయమై ప్రేమగా మారుతుంది. అంజలికి డబ్బు లేదని తెలుసుకున్న చైతన్యకు, డబ్బున్న అమ్మాయి నేహతో పెళ్లి నిశ్చయమవుతుంది. బ్యాచిలర్ పార్టీకోసం స్నేహితులు ముగ్గురూ బ్యాంకాక్ వెళ్తారు. ఒకరోజు ముగ్గురు పార్టీకి వెళ్ళి తిరిగి వస్తుండగా బ్యాంకాక్ పెద్ద డాన్ మైఖేల్ తమ్ముడు రాబర్ట్ కి యాక్సిడెంట్ అవుతుంది. దాంతో వాటి జీవితం మలుపుతిరుగుతుంది. తరువాత ఆర్తి (దిశా పాండే) తెలుగమ్మాయిలా వచ్చి ఈ ముగ్గురితో స్నేహం చేస్తుంది. అభిరామ్ – ఆర్తి ప్రేమించుకుంటారు. ట్రిప్ అయిపోయి ముగ్గురు భారతదేశానికి బయలుదేరాల్సిన సమయంలో చైతన్య – అంజలి కిడ్నాప్ అవుతారు. వాళ్ళని ఎవరు ఎందుకు కిడ్నాప్ చేసారు, యాక్సిడెంట్ జరిగిన రోజు ఏం జరిగింది, చైతన్య – అంజలి కిడ్నాపర్స్ నుంచి ప్రాణాలతో బయట పడ్డారా, లేదా అన్నది మిగతా కథ.[2]

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • దర్శకత్వం: రమేష్ రాపర్తి
  • నిర్మాత: అన్నే రవి
  • మాటలు: శంకర్
  • సంగీతం: వివేక్ సాగర్ & సంజయ్
  • పాటలు: శ్రీమణి
  • ఛాయాగ్రహణం: ఎస్. మురళీమోహన్ రెడ్డి
  • కూర్పు: మ్యాడీ (మధు)
  • నిర్మాణ సంస్థ: ఆనంద్ సినీ చిత్ర

పాటలు మార్చు

క్రమసంఖ్య పాటపేరు గాయకులు నిడివి
1 ప్రపంచమే కార్తీక్, వివేక్ 3:35
2 యామమ్మో ప్రణవి, దీపు 4:35
3 వన్ డే లో దినకర్, అయిశన్ వలి 4:36
4 మధురమే ప్రణవి 2:27
5 రేస్ థీమ్ మసక, అయిశన్ వాలి 3:27

మూలాలు మార్చు

  1. "Race (Telugu) : Movie details". Mp3tamilan.com. Archived from the original on 11 April 2013. Retrieved 5 June 2020.
  2. 123 తెలుగు, రివ్యూ (2 March 2013). "సమీక్ష : రేస్ – రేసులూ లేవు, కథలో స్పీడూ లేదు". www.123telugu.com. Retrieved 4 June 2020.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)

ఇతర లంకెలు మార్చు