రొమ్ము కాన్సర్ ఒక ప్రాణాంతకమైన వ్యాధి. ఇది అత్యధికంగా స్త్రీలకు వచ్చే వ్యాధి.

రొమ్ము కాన్సర్
రొమ్ము క్యాన్సర్ ఇలస్ట్రేషన్
SpecialtyOncology Edit this on Wikidata

రొమ్ము కాన్సర్ గురించిన కొన్ని అపోహలు మార్చు

అపోహ: రొమ్ముల్లో కనిపించే గడ్డలన్నీ క్యాన్సర్ గడ్డలే మార్చు

ఇది నిజం కాదు. రొమ్ములో కనిపించే గడ్డల్లో పదింట తొమ్మిది క్యాన్సర్ గడ్డలు కావు. ఒకటి మాత్రమే క్యాన్సర్ గడ్డ కావొచ్చు. అయినా నిర్లక్ష్యం చేయడానికి లేదు. ఎలాంటి గడ్డ కనిపించినా తప్పనిసరిగా వైద్యుణ్ని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం అవసరం.

అపోహ: రొమ్ము క్యాన్సర్ పెద్ద వయసు స్త్రీలకే వస్తుంది మార్చు

ఇది పూర్తిగా నిజం కాదు. 90 శాతం రొమ్ము క్యాన్సర్ కేసులు 50 ఏళ్ల పైబడిన స్త్రీలలోనే కనిపిస్తున్నా... ఇటీవల కాలంలో చిన్న వయసు వారిలోనూ ఈ క్యాన్సర్ వస్తోంది.

అపోహ: రొమ్ము క్యాన్సర్ పురుషులకు రాదు. మార్చు

పురుషులకు స్త్రీల మాదిరి రొమ్ములు ఉండవు కాబట్టి రొమ్ము క్యాన్సర్ రాదని భావించడం నిజం కాదు. రొమ్ము కణజాలం పురుషులకూ ఉంటుంది. కొంత మంది పురుషులకూ ఈ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది.

అపోహ: రొమ్ము క్యాన్సర్ ఎందుకు వస్తుందో తెలీదు మార్చు

ఇందులో కొంతవరకే వాస్తవం ఉంది. రొమ్ము క్యాన్సర్ ముప్పును పెంచే కొన్ని అంశాలను వైద్య పరిశోధకులు గుర్తించారు. స్త్రీలకు వయసు పెరుగుతున్న కొద్దీ క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. కుటుంబంలో రొమ్ము క్యాన్సర్ చరిత్ర, 12 ఏళ్ల కంటే ముందే రజస్వల కావడం, 55 ఏళ్ల కంటే ముందే నెలసరి ఆగిపోవడం, పిల్లలు లేకపోవడం, 30 ఏళ్ల తర్వాతే తొలి సంతానం కలగడం, హార్మోన్ మాత్రలు ఎక్కువగా వాడడం, బరువు ఎక్కువగా పెరగడం...ఇవన్నీ రొమ్ము క్యాన్సర్ ముప్పును పెంచేవే.

అపోహ: వంశంలో రొమ్ము క్యాన్సర్ ఉంటే తర్వాతి తరంలో వారికీ వస్తుంది. మార్చు

ఇది నిజం కాదు. ఎందుకంటే రొమ్ము క్యాన్సర్ బారిన పడినవారి కుటుంబాల్లో చాలామంది ఆరోగ్యంగానే ఉన్నారు. ఇలా వంశ పారంపర్యంగా క్యాన్సర్ రావడానికి 10 శాతం వరకే అవకాశాలున్నాయి.

అపోహ: బిడ్డకు పాలిస్తే రొమ్ము క్యాన్సర్ రాదు మార్చు

ఇది కొంతవరకే నిజం. బిడ్డకు పాలివ్వడం వల్ల క్యాన్సర్ రాకూడదని లేదు. అయితే రాకుండా ఉండడానికి కొంతవరకే అవకాశాలున్నాయి.

అపోహ: గర్భ నిరోధక మాత్రలతో రొమ్ము క్యాన్సర్ వస్తుంది. మార్చు

ఇది నిజం కాదు. ఇప్పుడు లభిస్తున్న గర్భ నిరోధక మాత్రల్లో కొద్ది మొత్తంలోనే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు ఉంటాయి. ఈ మోతాదుతో క్యాన్సర్ వచ్చే అవకాశం లేదు.

అపోహ: రొమ్ము క్యాన్సర్ తొలిదశలో గుర్తించడం కష్టం మార్చు

ఇది నిజం కాదు. చేతికి గడ్డలు తగలడానికి కొన్నేళ్ల ముందే క్యాన్సర్‌ను గుర్తించవచ్చు. మామోగ్రఫీ పరీక్ష ద్వారా వీటిని గుర్తించడం సాధ్యమవుతుంది. ముందే గడ్డలు గుర్తించడం వల్ల చికిత్స చాలా సులువవుతుంది. అందుకే 40 ఏళ్లు పైబడిన స్త్రీలంతా మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలి.

అపోహ: మామోగ్రఫీ పరీక్ష బాధాకరంగా ఉంటుంది. మార్చు

ఇది కూడా నిజం కాదు. సాధారణ ఎక్స్‌రే మాదిరే ఈ పరీక్ష కూడా ఉంటుంది. కొంత వరకు అసౌకర్యంగా ఉన్నప్పటికీ ఎలాంటి నొప్పీ ఉండదు. ప్రత్యేకించి డిజిటల్ మామోగ్రఫీతో కలిగే అసౌకర్యం చాలా తక్కువే.

బయటి లంకెలు మార్చు

[1]

  1. "Breast European Adjuvant Studies Team (BREAST)". Breast Cancer Online. 9 (S1): 80–90. 2006-12. doi:10.1017/s1470903106009072. ISSN 1470-9031. {{cite journal}}: Check date values in: |date= (help)