లంగ్‌డంగ్ జిల్లా

అరుణాచల్ ప్రదేశ్ లోని జిల్లా

లంగ్‌డంగ్ జిల్లా, భారతదేశం , అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా. ఇది రాష్ట్రంలో సరికొత్తగా రూపొందిన జిల్లా. తిరప్ జిల్లా దక్షిణభూభాగం వేరుచేయగా ఈ జిల్లా రూపొందింది. జిల్లా తూర్పు సరిహద్దులో మయన్మార్ దేశం, పశ్చిమ, దక్షిణ సరిహద్దులో నాగాలాండ్ రాష్ట్ర సరిహద్దులు ఉన్నాయి. ఉత్తర సరిహద్దులో తిరప్ జిల్లా ఉంది. [1]

లంగ్‌డంగ్ జిల్లా
అరుణాచల ప్రదేశ్ లోని జిల్లా
అరుణాచల్ ప్రదేశ్ లోని లాంగ్డింగ్ జిల్లా స్థానము
అరుణాచల్ ప్రదేశ్ లోని లాంగ్డింగ్ జిల్లా స్థానము
Coordinates: 26°54′N 95°18′E / 26.9°N 95.3°E / 26.9; 95.3
దేశం India
రాష్ట్రంఅరుణాచలప్రదేశ్
Area
 • Total1,192 km2 (460 sq mi)
Population
 (2011)
 • Total56,953
 • Density48/km2 (120/sq mi)
Time zoneUTC+05:30 (IST)

చరిత్ర మార్చు

లంగ్‌డంగ్ జిల్లాలో స్థానికంగా వింకో ప్రజలు నివసించేవారు. ఉత్పత్తి పరంగా ఈ జిల్లా రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాగా గుర్తించబడుతుంది. 2009 ఆగస్టు 7 స్టేట్ కాబినెట్ అప్పటి ముఖ్యమంత్రి డోర్జీ ఖదు ఆధ్వర్యంలో రూపొందించబడింది. [2] 2010 జూన్ 23న జిల్లా సరిహద్దులను నిర్ణయించడానికి రాష్ట్రప్రభుత్వం అధికారిక కమిటీని ఏర్పాటు చేసింది. 2011 ఆగస్టు 11 కమిటీ నివేదికలను పరిశీలించిన తతువాత 2011 సెప్టెంబరు 26న జిల్లా రూపొందింది. 2012 మార్చి 19 న జిల్లా ముఖ్యమంత్రి " నాబం తుకి " చేత అధికారింగా గుర్తించబడింది.[3]

విభాగాలు మార్చు

లంగ్‌డంగ్ జిల్లా 6 డివిజన్లుగా విభజించబడింది: లంగ్‌డంగ్, కనుబరి, పొంగ్చౌ, వాక్క (అరుణాచల్ ప్రదేశ్), పుమావ్, లాను..[1]

గణాంకాలు మార్చు

జిల్లాలో 2011 నాటికి 56,953 జనాభా ఉంది. జిల్లాలో ప్రధానంగా వాంచో ప్రజలు నివసిస్తున్నారు. వారు నాగా ప్రజలను సాంస్కృతికంగా పోలి ఉంటారు. వారు తుపాకీ తయారీ, చెక్క చెక్కడం, పూసల తయారీని అభ్యసిస్తారు. వారు ఝుమ్ సాగు అని పిలవబడే స్లాష్ అండ్ బర్న్ సాగును అనుసరిస్తారు. ఇప్పటికీ చాలా మంది ప్రజలు యానిమిజాన్ని అనుసరిస్తున్నారు, అయితే కొందరు క్రైస్తవ మతంలోకి మారారు.[4]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "Longding District". Veethi. Retrieved 5 November 2012.
  2. "Arunachal Pradesh gets its 17th district". timesofindia. Archived from the original on 2013-12-16. Retrieved 5 November 2012.
  3. "Longding becomes 17th Arunachal district". timesofindia. Archived from the original on 2013-01-03. Retrieved 5 November 2012.
  4. "State gets 17th district, Longding". echoofarunachal. Archived from the original on 5 March 2016. Retrieved 5 November 2012.

వెలుపలి లంకెలు మార్చు