లక్షగళ సంకీర్తనార్చన

లక్షగళ సంకీర్తనార్చన (ఆంగ్లం: Laksha Gala Sankeertanarchana) సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో సుమారు లక్షా అరవై వేల మంది తన్మయత్మంతో ఏకకంఠంతో అన్నమాచార్యుని సప్తగిరి సంకీర్తనలను గానం చేసిన అపూర్వమైన సంఘటన. పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యుని 601వ జయంతిని పురస్కరించుకొని తెలుగుజాతి ఆయనకిచ్చిన ఘన నివాళి. ఆంధ్రరాష్ట్రం నలుమూలల నుంచీ భారతదేశంలోని వివిధ నగరాల నుంచి తరళివచ్చిన గాయనీ గాయకులు, ఔత్సాహికులు అన్నమయ్య రచించిన ఏడు సంకీర్తనల్ని ఏకబిగిన పాడారు. ప్రముఖ గాయకుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ సారధ్యంలో ఈ కార్యక్రమం 2009 మే 10 వ తేదీన 45 నిమిషాల పాటు సాగింది. ప్రత్యేక వేదికపై శ్రీ వేంకటేశ్వరుడు కొలువై తనను లక్షనోళ్ళ కీర్తిస్తున్న దృశ్యాన్ని తిలకించాడు.

ఈ కార్యక్రమాన్ని సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానములు, సిలికానాంధ్ర సంయుక్తంగా నిర్వహించాయి.

గిన్నీస్ ప్రపంచ రికార్డు మార్చు

 
ప్రధాన నిర్వాహకుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్

ఈ కార్యక్రమాన్ని గిన్నీస్ ప్రపంచ రికార్డు ప్రతినిధి రేమండ్ మార్షల్ పరిశీలించి, ఛాయాచిత్రాలు తీసి, లక్షా 60 వేల మంది ఉన్నారనే విషయాన్ని అధికారికంగా నమోదుచేసి ప్రపంచ రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని అప్పటికప్పుడు అందజేశారు.

సప్తగిరి సంకీర్తనలు మార్చు

  • భావములోన
  • బ్రహ్మకడిగిన పాదము
  • ఎంత మాత్రమున
  • పొడగంటిమయ్యా
  • కొండలలో నెలకొన్న
  • నారాయణతే నమో నమో
  • ముద్దుగారే యశోదా

మూలాలు మార్చు

  • ప్రపంచ సాంస్కృతిక చరిత్రను తిరగరాసిన సిలికానాంధ్ర వారి 'లక్షగళ సంకీర్తనార్చన', తెలుగు విద్యార్థి జూన్ 2009 సంచికలో ప్రచురించిన వ్యాసం.