1934, సెప్టెంబర్ 29 నాడు గయానాలోని జార్జ్‌టౌన్లో జన్మించిన లాన్స్ గిబ్స్ (Lancelot Richard Gibbs) వెస్టిండీస్కు చెందిన ప్రముఖ మాజీ క్రికెట్ క్రీడాకారుడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే గొప్ప స్పిన్ బౌలర్‌గా పేరుపొందినాడు. టెస్టులలో గిబ్స్ 309 వికెట్లను సాధించి ఫెడ్ ట్రూమన్ తర్వాత 300 వికెట్లను సాధించిన రెండో బౌలర్‌గా, మొదటి స్పిన్నర్‌గా క్రికెట్ చరిత్రలో నిలిచిపోయాడు. టెస్టులలో సగటున ఓవర్‌కు 2 పరుగుల కంటే తకువగా ఇచ్చి అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసిన ఘనతను కూడా సాధించాడు. కాని బ్యాంటింగ్‌లో మాత్రం అతని గణాంకాలు దారుణంగా ఉన్నాయి. టెస్టులలో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 25 పరుగులు దాటలేదు.

లాన్స్ గిబ్స్

1957-58లో భారతపర్యటనకు వచ్చి ఒక టెస్టు ఆడిననూ అతనికి వికెట్లు లభించలేవు. 1962-62 లోలో భారత జట్టు వెస్ట్‌ఇండీస్ పర్యటించినప్పుడు 20.41 సగటుతో 5 టెస్టులలో 24 వికెట్లు పడగొట్టినాడు. అదే సీరీస్ లో బ్రిడ్జ్‌టౌన్లో జరిగిన టెస్టులో ఒక దశలో 149/2 స్కోరుతో ఉన్న భారతజట్టును 187 పరుగులకే ఆలౌట్ చేసిన ఘనత అతనిది. ఆ టెస్టులో 15.3 ఓవర్లలోనే 8 వికెట్లు పడగొట్టినాడు. అతని అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 38/8 ఈ టెస్టు ద్వారా సాధించినదే.

1973లో 39 సంవత్సరాల వయస్సులో గిబ్స్ లీడ్స్లో ఇంగ్లాండుపై తొలి వన్డే ఆడినాడు. ఆ తర్వాత మరో వన్డేలలో మాత్రమే ప్రాతినిధ్యం వహించాడు. 1975 ప్రపంచ కప్ లో ఒకే ఒక్క వన్డే శ్రీలంకపై ఆడి 4 ఓవర్లు బౌలింగ్ చేసిననూ ఫలితం దక్కలేదు.

బయటి లింకులు మార్చు