వికీపీడియా:ఈ వారపు బొమ్మలు 2007

2007 సంవత్సరంలో "ఈ వారం బొమ్మ"గా మొదటి పేజీలో ప్రదర్శించిన బొమ్మలు ఇవి.

మొదట్లో కొన్ని రోజులు ప్రయోగాత్మకంగా మొదటిపేజీలో బొమ్మలు పెట్టారు కాన అవి వారం వారం మార్చలేదు. 35వ వారంనుండి ప్రాజెక్టు అమలులోకి వచ్చింది. అప్పటిలో ఈ శీర్షిక మెయింటెయిన్ చేయగలమా అని సభ్యులు సంశయించారు గాని మొదలు పెట్టారు.

35వ వారం
గండికోట మాధవరాయాలయం

కడప జిల్లా గండికోటలోని మాధవరాయాలయం యొక్క గోపురద్వారము. పదహారవ శతాబ్దం తొలినాళ్ళలో (1501-1525 మధ్యకాలంలో) విజయనగర రాజులు నిర్మించారని భావిస్తున్న ఈ ఆలయం గురించిన ప్రస్తావన పదహారవ శతాబ్దానికి చెందిన శాసనాలలో కనిపిస్తుంది.

ఫోటో సౌజన్యం: Tvjagan
36వ వారం
భారత ప్రధాన భూభాగాన్ని రామేశ్వరం దీవితో కలుపుతున్న పాంబన్ వంతెన

తమిళనాడు రాష్ట్రములోని రామేశ్వరము వద్ద ఉన్న పాక్ జలసంధిపై నున్న ఈ వంతెన ప్రపంచములోనే అతి పురాతనమైన సముద్రంపై నున్న వంతెనలలో ఒకటి. దీనిని 1911-1913 సంవత్సరముల మధ్య నిర్మించి 1914 సంవత్సరము నుండి రైలు బండ్లు నడవడానికి తెరిచారు. 1964 సంవత్సరములో వచ్చిన తుఫానులో దెబ్బ తిన్న ఈ వంతెనను 47 రోజులలో బాగు చేశారు. 2004 సంవత్సరములో వచ్చిన సునామీలో ఈ వంతెన దెబ్బతినలేదు.

ఫోటో సౌజన్యం: బాబు.ఎం
37వ వారం
1999 సంవత్సరములొ ఫ్రాన్సు దేశములొ కనిపించిన సంపూర్ణ సూర్య గ్రహణం

చంద్రుడు భూమికి సూర్యుడు కి మధ్య కక్ష్యలొ వచ్చినప్పుడు అమావాస్య రోజు సూర్య గ్రహణం జరుగుతుంది. సంపూర్ణ సూర్య గ్రహణం పట్టినప్పుడు చంద్రుడు కక్ష్యలొకి అడ్డం రావడం వల్ల సూర్యగోళం చంద్రుడి ఛాయాతో కప్పబడి సూర్య గోళం అంచు కరోనా గా పై బొమ్మ లొ కనిపించినట్లు కనబడుతుంది. 2007 సెప్టంబర్ 11 వ తారీఖు సూర్య గ్రహణం

ఫోటో సౌజన్యం: ల్విటోర్
38వ వారం
బొమ్మల కొలువులొ ప్రదర్శిస్తున్న కొందపల్లి బొమ్మలు

ఆంధ్ర సంస్కృతి వెలువరించే వేషభూషణాలతో ఉన్న స్త్రీ పురుషల కొండపల్లి బొమ్మలు. పొనికి చెక్క ,రంపపు పొట్టు,చింతగింజల పొడి,సున్నం తో తయారు చేయబడి రంగుల పూసి అందంగా తీర్చిదిద్దబడిన కొండపల్లి బొమ్మలు.

ఫోటో సౌజన్యం: శ్రీహర్ష
39వ వారం

[[బొమ్మ:|300px|center|alt=తెలుగు భాష లిపి పరిణితి]] మౌర్యకాలము బ్రాహ్మీ లిపి నుండి శ్రీ కృష్ణ దేవరాయలు కాలము వరకు తెలుగు లిపి పరిణితిని పరిశోధించిన భద్రిరాజు క్రిష్ణమూర్తి వ్రాసిన ఆంధ్ర భాషా చరిత్ర పుస్తకములోని తెలుగు లిపి పరిణితిని సూచిస్తున్న చిత్రము.

ఫోటో సౌజన్యం: వైజాసత్య
40వ వారం

[[బొమ్మ:|300px|center|alt=బొర్రా గుహలు]] బొర్రా గుహలు తూర్పుకనుమల్లోని అనంతగిరి శ్రేణిలో విశాఖపట్నానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొర్రా గుహలను 1807లో బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ కనుగొన్నాడు. కొండలపై నుంచి గోస్తని నదివైపు ప్రవహించే చిన్న చిన్న వాగులు వల్ల సహజంగా ఏర్పడిన ఈ గుహలు 10 లక్షల ఏళ్ళ క్రితంనాటివని భావిస్తున్నారు. ఈ గుహల్లో జరిపిన తవ్వకాలలో మధ్యరాతియుగ సంస్కృతికి చెందిన రాతిపనిముట్లు లభించాయి.

ఫోటో సౌజన్యం: ఫిడరా
41వ వారం
బేలూరు చెన్నకేశ్వరాలయం

శిల్పకళలో జగత్ప్రసిద్ధిగాంచిన బేలూరు చెన్నకేశ్వరాలయం కర్ణాటక రాష్ట్రానికి చెందిన హసన్ జిల్లాలోని బేలూరులో ఉన్నది. హొయసలుల శిల్పశైలికి అద్భుత తార్కాణమైన ఈ ఆలయాన్ని విష్ణువర్ధనుడు 1117లో తలకాడు వద్ద చోళులతో యుద్ధములో సాధించిన విజయానికి స్మారకముగా నిర్మింపజేశాడు. ఈ ఆలయ నిర్మాణము పూర్తికావటానికి 103 సంవత్సరాలు పట్టిందని, విష్ణువర్ధనుని మనుమడు రెండవ వీరబల్లాలుడు దీనిని పూర్తిచేశాడని ప్రతీతి.

ఫోటో సౌజన్యం: దినేష్ కన్నంబాడి
42వ వారం
బెంగాలు బెబ్బులి

బెంగాలు బెబ్బులి (ఫాంథెర టైగ్రిస్ టైగ్రిస్) భారత దేశం, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మరియు మయన్మార్ దేశాలలో కనిపిస్తుంది. బెబ్బులి జూలు గోధుమ రంగులో ఉండి నల్లని చారలు ఉంటాయి.

ఫోటో సౌజన్యం: జాన్ మరియు కారెన్ హాల్లింగ్స్‌వర్త్
43వ వారం
బెంగాలు బెబ్బులి

బెంగాలు బెబ్బులి (ఫాంథెర టైగ్రిస్ టైగ్రిస్) భారత దేశం, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, మరియు మయన్మార్ దేశాలలో కనిపిస్తుంది. బెబ్బులి జూలు గోధుమ రంగులో ఉండి నల్లని చారలు ఉంటాయి.

ఫోటో సౌజన్యం: జాన్ మరియు కారెన్ హాల్లింగ్స్‌వర్త్
44వ వారం
శ్రీకాళహస్తి క్షేత్రము

సువర్ణముఖి నదీ తీరమున శ్రీకాళహస్తీశ్వరుడు స్వయంభూలింగముగా వెలసిన శైవ పుణ్యక్షేత్రము శ్రీకాళహస్తి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీకాళహస్తిని దక్షిణ కాశీగా వ్యవహరిస్తారు. శ్రీకాళహస్తిలోని లింగము పంచభూతలింగములలో నాల్గవదైన వాయులింగము. ఇక్కడ లింగమునకెదురుగా వున్న రెండు దీపాలలో ఒకటి ఎప్పుడూ గాలికి కదులుతూ ఉంటుంది, మరొకటి ఎల్లప్పుడు నిశ్చలముగా ఉంటుంది.

ఫోటో సౌజన్యం: కె.కళ్యాణ్
45వ వారం
కాకతీయుల కాలం నాటి మంటపం

కాకతీయులు ఓరుగల్లు రాజధానిగా ఆంధ్ర దేశాన్ని పాలించారు. గణపతి దేవుడు, రుద్రమ దేవి కాకతీయులలో ప్రసిద్ధి గాంచిన ఏలికలు. వారికాలంలో ఆంధ్రదేశంలో శిల్పకళ బాగా వృద్ధి చెందింది. ఇది వారి కాలంనాటి ఒక మంటపం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురావస్తు సంగ్రహాలయం, హైదరాబాదులో ఈ మంటపం ఉంచబడింది. (మ్యూజియం వారి సౌజన్యంతో ఫొటో తీయబడినది)

ఫోటో సౌజన్యం: సభ్యుడు:కాసుబాబు
46వ వారం
భారత జాతీయ రహదార్లు సూచించు పటం

పైన చూపబడిన మ్యాపు భారత జాతీయ రహదార్లను చూపుతోంది. ఈ చిత్రపటములొ జాతీయ రహదారి అభివృద్ధి మరియు ప్రణాళిక సంస్థ వారు 2012 సంవత్సరానికి అభివృద్ధి చేసే రహాదార్లు కూడా చిత్రీకరించబడి ఉన్నాయి.భారత జాతీయ రహదార్లు 58,000 కి.మి పొడవు ఉన్నాయి. వీటిలొ 4,885 కి.మి ఎక్స్‌ప్రెస్ హైవే. జాతీయ రహదార్లు భారత దేశములొని మొత్తం రోడ్లలలొ 2 శాతము మాత్రమే ఉండి 40% రవాణా వ్యవస్థ కి ఉపయోగపడుతున్నాయి.

ఫోటో సౌజన్యం: PlaneMad
47వ వారం
క్షీరసాగర మథనం

పైన చూపబడిన ఫొటోలో ఏలూరు వద్ద శనివారపు పేట గ్రామంలో చెన్న కేశవ స్వామి ఆలయం గోపురం పై చెక్కిన క్షీరసాగర మధన సన్నివేశాన్ని చూడవచ్చు. దేవతలు అమృతం పొందడానికి క్షీరసాగర మథనం జరుపుతారు. క్షీరసాగర మథనం ముఖ్యంగా భాగవతం లో ప్రస్తావించబడుతుంది. ఇదే గాథ రామాయణంలోని బాలకాండలోను మహాభారతంలోని ఆది పర్వములోను కూడా స్పృశించబడుతుంది. ఇదే ఇతిహాసము పురాణాలు లలో కూడా చెప్పబడింది. చాక్షుషువు మనువుగా ఉన్న సమయంలో క్షీరసాగర మథనం జరిగింది.

ఫోటో సౌజన్యం: కాసుబాబు
48వ వారం

[[బొమ్మ:|400px|center|alt=గేట్ వే ఆఫ్ ఇండియా]] దక్షిణ ముంబాయి సముద్ర తీరాన గేట్ వే ఆఫ్ ఇండియా ఉన్నది. 15 మీటర్ల వ్యాసాముతో మధ్యలొ గోపురాకముగా ఉండి గోపుర మధ్య ప్రదేశము 26 మీటర్లు ఉంటుంది.ఇండొ-సారసినిక్ శిల్పశైలి అనుసరించి దీని నిర్మాణము గావించితిరి.నౌకాయానము చేసి ముంబాయి నగరానికి వచ్చే వారికి మెదట కనిపించేది ముంబాయి నగరములొ గేట్ వే ఆఫ్ ఇండియా

ఫోటో సౌజన్యం: రీస్నీర్
49వ వారం
మర్రిచెట్టు పెరుగుదల

తాటిచెట్టు మీద మొలిచిన చిన్న మర్రి మొక్క కాలక్రమంలో మహావృక్షంగా ఎదగడంఈ బొమ్మలో గమనించ వచ్చును. ఇంకొన్ని దశాబ్దాలలో మర్రి చెట్టు వూడలు (కొమ్మలనుండి పుట్టే వ్రేళ్ళు) స్తంభాలలా ఎదిగి మర్రిచెట్టు నలుదిశలా విస్తరించడానికి దోహదం చేస్తాయి. ఆంధ్ర ప్రదేశ్లో పిల్లలమర్రి, తిమ్మమ్మ మర్రిమాను బాగా పెద్ద మర్రిచెట్లు.

ఫోటో సౌజన్యం: కాసుబాబు
50వ వారం
గద్దెవారిగూడెం ప్రాధమిక పాఠశాల

పశ్చిమ గోదావరి జిల్లాలో గద్దేవారిగూడెం అనే ఒక చిన్న గ్రామంలో ప్రాధమిక ప్రభుత్వ పాఠశాల. ఉదయం పాఠాలు ప్రారంభించే ముందు విద్యార్ధులు 'అసెంబ్లీ'లో హాజరవుతారు. జాతీయ గీతాలు, ప్రతిజ్ఞ, నీతి సూక్తులు, వార్తలు వంటివి చదువుతారు. ఇటువంటి మారుమూలల పల్లెలలో ఉన్న జనాభాలో అత్యధికులు ఆర్ధికంగా వెనుకబడినవారు. అటువంటి వర్గాలలో అక్షరాస్యత పెంచడానికి ఇలాంటి చిన్న బడులే ముఖ్యమైన పాత్ర వహిస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌లో అక్షరాస్యత 60.5% ఉన్నది. (పురుషులలో 70.3%, స్త్రీలలో 50.4%)

ఫోటో సౌజన్యం: కాసుబాబు
51వ వారం
గద్దెవారిగూడెం ప్రాధమిక పాఠశాల

పశ్చిమ గోదావరి జిల్లాలో గద్దేవారిగూడెం అనే ఒక చిన్న గ్రామంలో ప్రాధమిక ప్రభుత్వ పాఠశాల. ఉదయం పాఠాలు ప్రారంభించే ముందు విద్యార్ధులు 'అసెంబ్లీ'లో హాజరవుతారు. జాతీయ గీతాలు, ప్రతిజ్ఞ, నీతి సూక్తులు, వార్తలు వంటివి చదువుతారు. ఇటువంటి మారుమూలల పల్లెలలో ఉన్న జనాభాలో అత్యధికులు ఆర్ధికంగా వెనుకబడినవారు. అటువంటి వర్గాలలో అక్షరాస్యత పెంచడానికి ఇలాంటి చిన్న బడులే ముఖ్యమైన పాత్ర వహిస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌లో అక్షరాస్యత 60.5% ఉన్నది. (పురుషులలో 70.3%, స్త్రీలలో 50.4%)

ఫోటో సౌజన్యం: కాసుబాబు
52వ వారం
తెలుగు ఫాంటుల నమూనాలు

'ఖతి' అనే పదం ఉన్నా గాని, 'ఫాంటు' అనే ఆంగ్ల పదాన్నే తెలుగు అక్షరాల రూప కల్పనను వర్ణించడానికి సాధారణంగా వాడుతున్నారు. అన్ని భాషలలాగానే తెలుగు భాషలో కూడా అనేక ఫాంటులు వెలువడుతున్నాయి. వీటి పేర్లు 'పోతన', 'వేమన', 'గౌతమి', 'శ్రీ', 'సూరి' - ఇలా ఉంటున్నాయి. ముఖ్యంగా యూనికోడ్‌కు అనుగుణంగా ఇటీవల ఫాంటుల అభివృద్ధి జరుగుతుండడం వలన కంప్యూటరులో తెలుగు భాష వినియోగం మరింత సులభతరం అవుతున్నది.

ఫోటో సౌజన్యం: వీవెన్