వికీపీడియా:పాఠం (ఫార్మాటింగు)

మొదటి పేజీ   దిద్దుబాటు   ఫార్మాటింగు   వికీపీడియా లింకులు   బయటి లింకులు   చర్చాపేజీలు   గుర్తుంచుకోండి   ఖాతా   ముగింపు    

వికీపీడియాలో ఫార్మాటింగు సాధారణ వర్డు ప్రాసెసర్ల కంటే భిన్నంగా ఉంటుంది. ఏది రాస్తే అదే కనబడే పద్ధతిలో గాక, వికీపీడియా కొన్ని టెక్స్టు కోడ్లను ఫార్మాటింగు కోసం వాడుతుంది. దీన్ని వికిటెక్స్ట్ లేదా వికీ-మార్కప్ అని అంటారు.

బొద్దు ఇటాలిక్స్

చాలా ఎక్కువగా వాడే వికీ ట్యాగులు బొద్దు, ఇటాలిక్. పదానికి అటూ ఇటూ అపాస్ట్రఫే (సింగిలు కోట్) (') లను పెట్టడం ద్వారా అలా చెయ్యవచ్చు:

ఇలా టైపు చేస్తే ఇలా కనిపిస్తుంది
''ఇటాలిక్'' ఇటాలిక్

'''బొద్దు'''

బొద్దు

'''''బొద్దు ఇటాలిక్'''''

బొద్దు ఇటాలిక్

శీర్షికలు, ఉపశీర్షికలు

వ్యాసాన్ని ఓ క్రమపద్ధతిలో అమర్చడానికి శీర్షికలు, ఉపశీర్షికలు ఉపయోగపడతాయి. వ్యాసంలో రెండు మూడు విషయాల గురించి రాస్తూ ఉంటే, వాటిని విభాగాలుగా విడగొట్టి ప్రత్యేక శీర్షికల కింద పెట్టవచ్చు.

శీర్షికలను ఇలా సృష్టించవచ్చు:

ఇలా టైపు చేస్తే ఇలా కనిపిస్తుంది

== శీర్షిక ==

శీర్షిక

=== ఉపశీర్షిక===

ఉపశీర్షిక

వ్యాసంలో కనీసం నాలుగు శీర్షికలుంటే, ఆ వ్యాసానికి ఆటోమాటిగ్గా విషయ సూచిక వచ్చి చేరుతుంది. ఈ పేజీ ప్రయోగశాల లో ఓ శీర్షిక పెట్టి చూడండి.

ఫార్మాటింగు పద్ధతులు

వ్యాసంలో ఆ వ్యాసం పేరు మొదటగా ఎక్కడ వస్తుందో అక్కడ దాన్ని బొద్దు గా చెయ్యడం వికీపీడియా ఆనవాయితీ. ఉదాహరణకు అల్లూరి సీతారామరాజు వ్యాసం ఇలా మొదలవుతుంది:

భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (Alluri Sitaramaraju) ఒక మహోజ్వల శక్తి. ఆయన జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం.

పుస్తకం, సినిమా, వీడియో గేము, సంగీత ఆల్బము మొదలైన వాటి పేర్లను ఇటాలిక్ లో రాయడం కూడా వికీపీడియా ఆనవాయితీ. ఈ పేర్లకు చెందిన వ్యాసాల్లో మొదటిసారి పేరు వచ్చినపుడు దాన్ని బొద్దు, ఇటాలిక్ లలో రాయాలి. ఉదాహరణకు కన్యాశుల్కం వ్యాసం ఇలా మొదలవుతుంది:

కన్యాశుల్కం నాటకం గురజాడ అప్పారావు పంతులు రాసిన సాంఘిక నాటకం.


దిద్దుబాట్ల గురించి మరింత సమాచారానికై దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి, గైడు చూడండి.
మీరు నేర్చుకున్న దానిపై ప్రయోగశాల లో ప్రయోగాలు చెయ్యండి
తరువాతి పాఠం:వికీపీడియా లింకులు