వికీ లవ్స్ మాన్యుమెంట్స్

వికీ లవ్స్ మాన్యుమెంట్శ్ (Wiki Loves Monuments) ప్రతి సంవత్సరం సెప్టెంబరు నెలలో జరిగే అంతర్జాతీయ ఫోటో కాంపిటీషన్. ఇందులో పాల్గొనే వ్యక్తులు చారిత్రాత్మక కట్టడాలు, స్మారక చిహ్నాల అందమైన చిత్రపటాలను తీసి వికీమీడియా కామన్స్ (en:Wikimedia Commons) లో చేరుస్తారు. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఆయా దేశాలలోని చారిత్రాత్మక కట్టాల ప్రాధాన్యతను గుర్తించండం.

Logo officiel de Wiki Loves Monuments
Logo officiel de Wiki Loves Monuments

ఈ పోటీ మొట్టమొదట నెదర్లాండ్స్ లో 2010 వ సంవత్సరం నిర్వహించబడినది. 2011 లో ఇది ఐరోపా ఖండంలో నిర్వహించబడగా, ఈ సంవత్సరం (2012) ప్రపంచవ్యాప్తంగా 35 దేశాలలో నిర్వహించబడుతున్నది.

చరిత్ర మార్చు

 
The 35 participating countries in 2012

దీనికి ప్రామాణికమైన "Rijksmonument" (అనగా, "జాతీయ కట్టడం") నెదర్లాండ్స్ లోని చిత్రకారులు డచ్ జాతీయ కట్టడాలపై దృష్టిసారించారు. ఇలాంటి Rijkmonuments లో నిర్మాణాత్మకంగాను, సామాన్యమైన అందం, శాస్త్రీయత, సాంస్కృతిక ప్రాముఖ్యత లాంటి విషయాలను కూడా దృష్టిలో ఉంచుకుంటారు. మొదటి పోటీలో ఇలాంటి నిర్మాణాలను 12,500 కన్నా అధికంగా చేర్చడమైనది.[1]

ఈ పోటీ ఘనవిజయం సాధించడంతో ఐరోపా ఖండంలోని 18 దేశాలు 2011 సంవత్సరం పోటీలో పాల్గొన్నాయి.[2][3] రెండవ సంవత్సరంలోనే సుమారు 170,000 చిత్రాలను పరిరక్షించారు.

2012 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 35 దేశాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి.

కార్యక్రమ వివరాలు మార్చు

వికీ లవ్స్ మాన్యుమెంట్స్ ఒక విశిష్టమైన పోటీ. ఇది సెప్టెంబరు 1st నుండి సెప్టెంబరు 30th తేదీల మధ్యన జరుగుతుంది. పాల్గొనే పోటీదారులు వారు తీసిన ఫోటోలను నేరుగా వికీమీడియా కామన్స్ Wikimedia Commons లోనికి ఎక్కించాలి. వారు తీసిన పాతవైనా కావచ్చును. కానీ వాటిని కొత్తగా కామన్స్ లోకి చేర్చి తప్పనిసరిగా ఉచిత లైసెన్స్ CC-BY-SA 3.0 క్రింది విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ పాల్గొనేందుకు ఫోటోలు చారిత్రాత్మక కట్టడాలు లేదా ప్రదేశాలకు సంబంధించినవిగా ఉండాలి.

2012 పోటీ దేశాలు మార్చు

ఈ క్రింది దేశాలు 2012 సంవత్సరంలో జరిగే వికీ లవ్స్ మాన్యుమెంట్స్ లో పాల్గొంటున్నాయి.

  1. అండోరా
  2. అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  3. అర్జెంటీనా
  4. ఆస్ట్రియా
  5. ఇజ్రాయిల్
  6. ఇటలీ
  7. ఉక్రెయిన్
  8. ఎస్టోనియా
  9. కెనడా
  10. కెన్యా
  11. కెటలోనియా
  12. కొలంబియా
  13. చిలీ
  14. చెక్ రిపబ్లిక్
  15. జర్మనీ
  16. బెలారస్
  17. బెల్జియం
  18. డెన్మార్క్
  19. దక్షిణ ఆఫ్రికా
  20. నార్వే
  21. పనామా
  22. నెదర్లాండ్స్
  23. ఫిలిప్పీన్స్
  24. పోలెండ్
  25. ఫ్రాంస్
  26. భారతదేశం
  27. మెక్సికో
  28. రొమానియా
  29. రష్యా
  30. లిచిటెంస్టీన్
  31. లగ్జంబర్గ్
  32. సెర్బియా
  33. స్పెయిన్
  34. స్వీడన్
  35. స్విట్జర్లాండ్
  36. హంగేరి

మూలాలు మార్చు

  1. మూస:Fr Virginie Malbos, Le monumental concours de Wikimédia, dans Libération, 9 September 2011, consulted 22 August 2012.
  2. మూస:It Bologna su 'Wiki loves monuments' La raccolta delle foto più belle Archived 2019-06-29 at the Wayback Machine, dans Il Resto del Carlino, 11 août 2012, consulté le 22 août 2012.
  3. మూస:Fr Isabelle Chenu, Le site Wikipédia aime les monuments, dans Radio France Internationale, 25 September 2011, consulted 22 August 2012.

బయటి లింకులు మార్చు