విద్యారణ్య ఉన్నత పాఠశాల, హైదరాబాదు

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని తెలంగాణ సచివాలయంకు సమీపంలో ఉన్న పాఠశాల

విద్యారణ్య ఉన్నత పాఠశాల (విద్యారణ్య హైస్కూల్) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని తెలంగాణ సచివాలయంకు సమీపంలో ఉన్న పాఠశాల. ఇందులో బాలబాలికలకు విద్యాబోధన చేయబడుతోంది.

విద్యారణ్య ఉన్నత పాఠశాల
విద్యారణ్య ఉన్నత పాఠశాల కొత్త భవనం
స్థానం
పటం
గ్రీన్ గేట్స్, సైఫాబాద్

,
భారతదేశం
Coordinates17°24′14″N 78°27′58″E / 17.404°N 78.466°E / 17.404; 78.466
సమాచారం
రకంప్రైవేటు పాఠశాల
స్థాపన1961; 63 సంవత్సరాల క్రితం (1961)
స్థాపకులుశ్రీమతి శాంత రామేశ్వర్ రావు
తరగతులుకిండర్-10
విద్యార్ధుల సంఖ్య700-1000

స్థాపన మార్చు

1961లో శాంత రామేశ్వర్ రావు ఈ ఉన్నత పాఠశాలను స్థాపించింది. ఇది బిర్లా మందిర్ దిగువ ప్రాంతంలో ఉంది. జిడ్డు కృష్ణమూర్తి బోధనల స్ఫూర్తితో నడపబడుతున్న ఈ పాఠశాలలో "ఉపాధ్యాయులు కూడా పిల్లలలాగే కొత్త విషయాలను నేర్చుకోవటానికి కూడా సిద్ధంగా ఉంటారు".[1]

ఐసిఎస్‌ఇ సిలబస్‌ ఆధారంగా విద్యాబోధన జరుగుతున్న ఈ పాఠశాలలో ఎనిమిదవ తరగతి వరకు పరీక్షలు ఉండవు.[2] విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠశాల యూనిఫాం (డెస్ కోడ్) లేదు, పిల్లలు వారి ఇష్టానికి తగిన దుస్తులు ధరించడం ఈ పాఠశాలలో నేర్పుతారు. ఇది ఆంగ్ల-మాధ్యమ పాఠశాల అయినప్పటికీ, భారతీయ భాషలు, భారతీయ సంగీతం, సంస్కృతితోపాటు ఆంగ్ల సాహిత్యం, భారతదేశ చరిత్ర, సాహిత్యం, పాశ్చాత్య సంగీతం (గానం), ఇతర సాంస్కృతిక కార్యకలాపాలు, చేతిపనులు, విద్యార్థులకు నాటకాలు, క్రీడల మొదలైనవాటికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది. ప్రశ్నించడం, ఆలోచించడం ద్వారా నేర్చుకోవటానికి, వివిధ రకాలైన ఆటలు ఆడటానికి విద్యార్థులను ప్రోత్సహిస్తుంటారు. ఇవన్నీకూడా పోటీతత్వంతో కాకుండా స్నేహపూర్వకంగా ఉంటాయి.[3]

ప్రవేశాలు మార్చు

 
విద్యారణ్య హైస్కూల్ పాత ప్రధాన భవనం. ఫోటో: 09-24-1984

ఈ పాఠశాలలో ప్రవేశం పొందడానికి జరిగే ప్రవేశ ప్రక్రియకు విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటర్వ్యూకు హాజరుకావాలి.[4]

పరీక్షలు మార్చు

ఇందులో ఎనమిదవ తరగతి నుండి మాత్రమే పరీక్షలు నిర్వహించబడతాయి. రెగ్యులర్ అసైన్‌మెంట్‌లతోపాటు అందరూ కలిసి చదువుకోవడం, నేర్చుకోవడం వంటివి ఈ పాఠశాలలో ప్రోత్సహించబడుతాయి. ప్రతి మూడు నెలలకొకసారి (త్రైమాసిక) విద్యార్థులందరికీ నివేదికలు ఇవ్వబడతాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చర్చించుకోవడంకోసం తల్లిదండ్రుల-ఉపాధ్యాయ సమావేశాలు కూడా జరుగుతాయి.

కార్యక్రమాలు మార్చు

అనేక సంస్థలు పాఠశాలలో క్రమం తప్పకుండా కార్యక్రమాలను నిర్వహిస్తుంటాయి:

  • మంథన్: ఫోరమ్ ఫర్ పబ్లిక్ డిస్కోర్స్[5]
  • రివాయత్ సాంస్కృతిక సంస్థ[6]
  • స్పిక్ మాకే[7]
  • ది గోథే-జెంథ్రమ్, హైదరాబాద్ [8]

పూర్వ విద్యార్థులు మార్చు

ఇవికూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Vidyaranya High School - Official Alumni Foundation" Archived 2020-10-01 at the Wayback Machine. vidyaranyaschool.com
  2. “My School Wall Archived 2019-09-08 at the Wayback Machine. myschoolwall.com. 2 September 2018
  3. "The teacher is a good learner" Archived 2012-07-19 at the Wayback Machine. The Hindu (India). 5 September 2009.
  4. Nair, Preeya. (11 January 2011). "The Education Of Life Itself (Shanta Rameshwar Rao)" Archived 2012-04-20 at the Wayback Machine. Channel6 (India).
  5. "Manthan India website". Manthanindia.com. 2012-08-31. Retrieved 2020-09-22.
  6. "Welcome to Riwaayat". Riwaayat.in. Archived from the original on 2012-04-26. Retrieved 2020-09-22.
  7. "Hyderabad". Spic Macay Society for Promotion of Indian Classical Music And Culture. Archived from the original on 2013-07-02. Retrieved 2020-09-22.
  8. "Hyderabad - Events - Goethe-Institut". Goethe.de. Retrieved 2020-09-22.
  9. "C V Anand gets top police medal, Telangana Excellence Award". 2017-08-15. Retrieved 2020-09-22.
  10. "Top cop Anand takes a stroll down memory lane". Retrieved 2020-09-22.