వియ్యాలవారి కయ్యాలు (2007 సినిమా)

వియ్యాలవారి కయ్యాలు 2007 లో వచ్చిన చిత్రం. ఉదయ్ కిరణ్, నేహా జుల్కా నటించిన ఈ సినిమాకు ఇ.సత్తి బాబు దర్శకత్వం వహించాడు. రామలక్ష్మి క్రియేషన్స్ పతాకంపై ఎల్. శ్రీధర్ నిర్మించాడు. ఇది 2007 నవంబరు 1 న విడుదలైంది. [1] [2]

వియ్యాలవారి కయ్యాలు
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం ఇ.సత్తిబాబు
కథ రాబిన్ హెన్రీ
తారాగణం ఉదయ్ కిరణ్, శివాజీ రాజా, నేహా జుల్కా, శ్రీహరి, సాయాజీ షిండే, బ్రహ్మాజీ, వేణు మాధవ్, గిరిబాబు, జయప్రకాష్ రెడ్డి, ఎమ్.ఎస్.నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎల్.బి.శ్రీరామ్
నిర్మాణ సంస్థ రామలక్ష్మీ సినీ క్రియేషన్స్
విడుదల తేదీ 2 నవంబర్ 2007
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథ మార్చు

వంశీ (ఉదయ్ కిరణ్) ఒక హెయిర్ స్టైలిస్టు. భూపతి రాయుడు (శ్రీ హరి) సోదరి నందిని (నేహా జుల్కా) తో ప్రేమలో పడ్డాడు. భూపతి రాయుడు ఓ మంచివాడైన ఫ్యాక్షనిస్టు. వంశీ, నందిని తమ పెద్దల అంగీకారంతో మాత్రమే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. కాబట్టి వంశీ రాయలసీమలోని జూటూరు అనే గ్రామానికి వస్తాడు. తమ ప్రేమను భూపతి రాయుడు చేత ఒప్పించటానికి. మొదట్లో భూపతికి వంశీ నచ్చలేదు. తాను హెయిర్ స్టైలిస్ట్ నని అతడు చెప్పినప్పుడు అందరూ నవ్వుతారు. కానీ ఈ జంట నిజమైన ప్రేమ ఎప్పటికీ వీగిపోదని, మొదట్లో తిరస్కరించబడినా తర్వాత ధైర్యంగా నిలుస్తుందనీ ఈ జంట నమ్ముతుంది.

భూపతి తన కుటుంబ సభ్యుల్లో ఎవరిచ్చిన మాటకైనా సరే విలువ ఇస్తాడు, ఆ మాటకు నిలబడతాడు. రెండవ భాగంలో రెండు వైపుల పెద్దల మధ్య జగడాలు వస్తాయి. వెంగళ్ రెడ్డి (జయ ప్రకాష్) హింస చేసైనా సరే, ఎమ్మెల్యే కావడానికి ప్రయత్నిస్తాడు. భూపతి సహాయం తీసుకోవాలనుకుంటాడు గానీ అతడు ఒప్పుకోడు. వంశీ భూపతిని ఒప్పించినా కూడా, తన తల్లిదండ్రులను ఎలా ఒప్పించాలా అని ఆందోళన చెందుతూంటాడు. ఉదయ్ ఒక జడ్జి (సయాజీ షిండే) కుమారుడు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని నమ్మే వ్యక్తి. అవినీతిపరులను ద్వేషిస్తాడు. ఈ జంట భూపతినీ, జడ్జినీ ఎలా ఒప్పిస్తారనేది మిగతా కథ.

నటవర్గం మార్చు

పాటలు మార్చు

ఈ చిత్రానికి రమణ గోగుల సంగీతం అందించారు. పాటల ఆడియోకు భారీ స్పందన వచ్చింది. ఆడియోను 2007 సెప్టెంబరు 6 న ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేసారు. అక్కినేని నాగేశ్వరరావు ఆడియోను విడుదల చేసి, మొదటి క్యాసెట్‌ను డాక్టర్ డి రామానాయుడుకు అందజేశాడు. సుప్రీం సంగీతం ఆల్బమ్‌ను మార్కెటింగ్ చేసింది. [3]

పాటల జాబిఉతా

  • తెలుసా చెలీ - నవీన్, గంగా
  • సురుడే సరే అన్నాడు - కె.ఎస్.చిత్ర, రమణ, శ్రీ కృష్ణ
  • నీలాలా నీకళ్ళు - శ్రీ కృష్ణ, సునీత
  • మన్మథా - కల్పన, విజయలక్ష్మి
  • హే హ్యాండ్ సమ్ - రమణ గోగుల, కల్పన
  • మల్లెచెండా - ఆర్‌పి పట్నాయక్, గంగా
  • నీలాలా నీకళ్ళు (ఇంగ్లీష్ రీమిక్స్) - రమణ

మూలాలు మార్చు

  1. https://www.rediff.com/movies/2007/nov/02vk.htm
  2. https://www.sify.com/movies/viyyalavari-kayyalu-review--pclwy1fdcicbb.html
  3. http://www.idlebrain.com/news/functions/audio-vvk.html