వీరపాండ్య కట్టబ్రహ్మన (సినిమా)

వీరపాండ్య కట్టబ్రహ్మన 1959లో విడుదలైన డబ్బింగు చిత్రం. ఈ చిత్రం తెలుగులో అతి పెద్ద విజయాన్ని సాధించిన మొదటి డబ్బింగు చిత్రం. తమిళంలోని వీరపాండ్య కట్టబొమ్మన్ చిత్రాన్ని తెలుగులోకి అనువదించారు. ఈ చిత్రాన్ని పూర్తిగా గేవా కలర్లో తీశారు, ప్రింట్లను లండన్ టెక్నికలర్ లేబరేటరీలో వేయించారు. అనువాద కార్యకలాపాలన్నీ భరణీ స్టూడియోలో జరిగాయి. ముఖ్యంగా చెప్పుకోవలసిన డబ్బింగు కళాకారులు కె.వి.యస్.శర్మ (శివాజీ గణేశన్), టి.జి.కమలాదేవి (పద్మిని).

వీరపాండ్య కట్టబ్రహ్మన
(1959 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.ఆర్.పంతులు
నిర్మాణం బి.ఆర్.పంతులు
కథ శక్తి కృష్ణస్వామి
చిత్రానువాదం శక్తి కృష్ణస్వామి
తారాగణం శివాజీ గణేశన్,
ఎస్.వరలక్ష్మి,
జెమిని గణేశన్,
పద్మిని
సంగీతం జి.రామనాథన్
నేపథ్య గానం ఎస్.జానకి,
పి.బి.శ్రీనివాస్,
మాధవపెద్ది సత్యం,
ఎ.పి.కోమల
నృత్యాలు హీరాలాల్,
పి.యస్.గోపాలకృష్ణన్,
మాధవన్
గీతరచన ఆరుద్ర,
సముద్రాల జూనియర్,
కొసరాజు
సంభాషణలు డి.వి.నరసరాజు
ఛాయాగ్రహణం డబ్ల్యూ.ఆర్.సుబ్బారావు,
కర్ణన్
నిర్మాణ సంస్థ పద్మినీ పిక్చర్సు
భాష తెలుగు

సాంకేతిక వర్గం మార్చు

  • కథ : శక్తి టి.కె.కృష్ణస్వామి
  • మాటలు : డి.వి.నరసరాజు
  • సంగీతం: టి.కె.కుమారస్వామి, బి.గోపాలం

నటీనటులు మార్చు

  • శివాజీ గణేషన్
  • ఎస్.వరలక్ష్మి
  • జెమినీ గణేషన్
  • పద్మిని
  • రాగిణి
  • వి.కె.రామస్వామి
  • జావర్ సీతారామ్

కథ మార్చు

తమిళనాడుకు చెందిన, తిరుచందూర్‌కు దగ్గరలోని ప్రాంతం పాంచాలపురం. దానికి ప్రభువు కట్టబ్రహ్మన్న. వర్తకానికి భారతదేశం వచ్చిన ఈస్టిండియా కంపెనీవారు క్రమంగా పాలకుల నుండి శిస్తులు వసూలు చేసుకొనే అధికారం పొంది, అనేకులను తమ అనుయాయులుగా మార్చుకున్నారు. అట్టివారిలో ఎల్లపునాయుడు (వి.కె.రామస్వామి) ఒకరు. వారి అధికారాన్ని ఎదిరించిన తొలి విప్లవవీరుడు, మాన్యుడు వీరపాండ్య కట్టబ్రహ్మన్న (శివాజీ గణేషన్) దైవభక్తుడు, వీరుడు. భార్య జక్కమ్మ (ఎస్.వరలక్ష్మి) తమ్ముడు, మరదలు (రాగిణి) తమ్ముని కుమార్తె చిన్నారి పట్ల వాత్సల్యం కలవాడు. సేనాధిపతి వీరయ్య నాయుడు (జెమినీ గణేషన్) తన కోడెను వంచిన వానిని వివాహం చేసుకుంటాననే వీరయమ్మ (పద్మిని) మాటప్రకారం కోడెను వంచి, ఆమెను పెండ్లి చేసుకుంటాడు. ఒంటరిగా వచ్చి కలుసుకొమ్మని కోరిన జాక్సన్ దొరవద్దకు వెళ్లిన కట్టబ్రహ్మన అతనికి దీటుగా జవాబిచ్చి, అతని అనుచరుల నుంచి, సైన్యం నుంచి వీరోచితంగా పోరాడి తప్పించుకుంటాడు. జాక్సన్ దొర బదులు బ్రిటీష్‌వారు లూపింగ్‌టన్ దొరను పంపటం. అను తన సైన్యంతో ఫిరింగి దళంతో యుద్ధంలో పాంచాలపురం కోటను ధ్వంసం చేయటం, సేనాపతి, పలువురు వీరులు అస్తమించటం, గాయపడిన కట్టబ్రహ్మన అతని తమ్ముడు తప్పించుకుని పుదుచ్చేరికి చేరటం. ఆ రాజు వలన బ్రిటీష్‌వారి చేతికి చిక్కిన కట్టబ్రహ్మనపై నేరారోపణ చేసిన అధికారి అతనికి ఉరిశిక్ష విధించటం, తానూ మరణించినా మరెందరో విప్లవవీరులు మాతృభూమి దాస్యశృంఖలాలు చేధిస్తారని ఉద్వేగప్రసంగం చేసి, ఉరి త్రాటిని ముద్దాడి దాన్ని మెడకు తగిలించుకోవటం, కట్టప్ప మరణంతో బ్రిటీష్‌వారి జండా అవనతమై, భారత త్రివర్ణపతాకం, స్వాతంత్ర్య సిద్ధికి సింబాలిక్‌గా పైకి నిలవటంతో చిత్రం ముగుస్తుంది[1].

పాటలు మార్చు

  1. ‘పోనేలా, పోనేలా’ దుస్వప్నం ఇపుడే కంటి (గానం- ఎస్.జానకి)
  2. ‘ఇంపుసొంపు వెన్నెలే వెలుగులే’ (ఎస్.జానకి, పి.బి.శ్రీనివాస్)
  3. ‘చిన్నారి తల్లినీ చిరునవ్వు చోద్యాల’
  4. ‘టక్కు టక్కు దడదడ ఉరుకు’ (ఎస్.వరలక్ష్మి, ఎస్.జానకి, ఏ.పి.కోమల)
  5. ‘పసిపిల్లలైనా పాలు తాగరురా మన కట్టబొమ్మ దొర పేరంటే’ (మాధవపెద్ది)
  6. ‘పెళ్లిబండి కట్టుకొని సొమ్ములన్ని’ (మాధవపెద్ది, సుందరమ్మ)
  7. ‘ప్రభో కృపాకరా వేల్పుదొరా’ (బి.గోపాలం, ఎస్.వరలక్ష్మి)
  8. ‘జక్కమ్మా వేరేది దిక్కమ్మా’ (మాధవపెద్ది బృందం)
  9. ‘సైసైరా కట్టబ్రహ్మన్న నీ పేరు విన్న సర్దార్లే నిదుర పోరన్న’ (మాధవపెద్ది బృందం)
  10. ‘ఓ వీర పాండ్యకట్టబ్రహ్మన్న వురిపాలై ఒరిగిపోయావా’’(మాధవపెద్ది)

ఈ గీతాల రచన కొసరాజు, ఆరుద్ర, సముద్రాల (జూనియర్)

విశేషాలు మార్చు

  • వీరపాండ్య కట్టబ్రహ్మన్న చిత్రం తమిళంలో 175 రోజులు పైగా ప్రదర్శింపబడింది. తెలుగులోనూ విజయవంతంగా నడిచింది.
  • ఈ చిత్రాన్ని హిందీలో ‘అమర్ షాహిద్‌గా’ 1960లో రూపొందించారు.

లింకులు మార్చు

  1. "వీరపాండ్య కట్టబ్రహ్మన -సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి ఫ్లాష్ బ్యాక్ @ 50 ఆంధ్రభూమి దినపత్రిక 28-04-2018". Archived from the original on 2018-08-14. Retrieved 2018-10-27.