వెన్నెరాడై నిర్మల

తమిళ నటి.

వెన్నెరాడై నిర్మల తమిళ సినిమా నటి. నిర్మల దక్షిణ భారత భాషలన్నింటా 100కు పైగా సినిమాలలో నటించింది.[1] శ్రీధర్ దర్శకత్వంలో వచ్చిన వెన్నెరాడై సినిమాతో రంగప్రవేశం చేయడంతో ఈమె పేరు వెన్నిరాడై నిర్మలగా స్థిరపడిపోయింది. 2007లో చాలాకాలం తర్వాత సినీరంగంలో మరల ప్రవేశించి గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న పెరియార్ సినిమాలోనూ, జీవా, భావన నటించిన రామేశ్వరం సినిమాలోనూ ముఖ్యప్రాత్రలు పోషిస్తున్నది. తన మొదటి సినిమాలో తనతో పాటు తెరపై పరిచయమైన జయలలితపై 1989 తమిళనాడు శాసనసభ ఎన్నికలలో, నిర్మల అండిపట్టి నియోజకవర్గం నుండి ఏ.ఐ.ఏ.డి.ఎం.కె (జానకి) వర్గపు అభ్యర్థిగా పోటిచేయటం విశేషం.[2]

వెన్నెరాడై నిర్మల
2007లో మాతృదినోత్సవ సందర్భంగా ఒక ఇంటర్యూలో వెన్నెరాడై నిర్మల
జననం
ఏ.బి.శాంతి

వృత్తిసినిమా నటి
క్రియాశీల సంవత్సరాలు1965–ప్రస్తుతం

నిర్మల నటీమణే కాకుండా, శిక్షణ పొందిన భరతనాట్య కళాకారిణి కూడా.[3][4]

నటించిన తెలుగు చిత్రాలు మార్చు

సంవత్సరము చిత్రము పాత్ర దర్షకత్వం తారాగణం
1967 అవేకళ్లు మాల ఎ.సి.త్రిలోకచందర్ కృష్ణ, కాంచన
1967 భక్త ప్రహ్లాద అప్సరస చిత్రపు నారాయణమూర్తి ఎస్వీ రంగారావు, రోజారమణి
1969 మూగనోము రజని డి.యోగానంద్ అక్కినేని నాగేశ్వరరావు, జమున
1971 అందరికీ మొనగాడు ఎం.మల్లికార్జునరావు కృష్ణ, భారతి
1971 బంగారు తల్లి రాధ తాపీ చాణక్య శోభన్ బాబు, జమున
1971 బొమ్మా బొరుసా రేఖ కె. బాలచందర్ చంద్రమోహన్, జి. రామకృష్ణ
1971 సతీ అనసూయ రతి బి.ఎ.సుబ్బారావు కాంతారావు, జమున
1972 కత్తుల రత్తయ్య కె.ఎస్.ఆర్.దాస్ ఘట్టమనేని కృష్ణ
1972 దత్తపుత్రుడు టి.లెనిన్ బాబు అక్కినేని నాగేశ్వర రావు, వాణిశ్రీ
1972 భలే మోసగాడు పి.సాంబశివరావు ఘట్టమనేని కృష్ణ
1972 మాయింటి వెలుగు విజయ్ కృష్ణ
1972 సోమరిపోతు వి. రామచంద్రరావు చలం
1973 ధనమా దైవమా సి.ఎస్.రావు నందమూరి తారక రామారావు, జమున, చంద్రమోహన్
1973 వారసురాలు బి.హరినారాయణ జి. రామకృష్ణ
1974 నిజరూపాలు కె.వి.నందనరావు జి. రామకృష్ణ
1974 మాంగల్య భాగ్యం పద్మనాభం భానుమతి, జగ్గయ్య, జయంతి, చంద్రమోహన్
1974 స్త్రీ గౌరవం ఎస్.ఎస్.దేవదాస్ కృష్ణంరాజు, దేవిక
1976 దేవుడే గెలిచాడు విజయనిర్మల కృష్ణ, విజయనిర్మల
1978 కరుణామయుడు ఎ.భీంసింగ్ టి.యస్.విజయచందర్
1980 కాళి ఐ.వి. శశి రజనీకాంత్‌, చిరంజీవి
1980 చుక్కల్లో చంద్రుడు సి.ఎస్. రావు చంద్రమోహన్, కాంతారావు
2002 సీమ సింహం రాంప్రసాద్ నందమూరి బాలకృష్ణ, సిమ్రాన్
1997 అరుణాచలం 2000 కలిసుందాం రా . ఉదయ్ శంకర్ వెంకటేష్ , సిమ్రాన్
2004 శంకర్‌దాదా ఎంబీబీఎస్‌

మూలాలు మార్చు

  1. Back with a brim - Venniradai Nirmala - ఇండియా గ్లిట్జ్ ఏప్రిల్ 20, 2007
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-10-22. Retrieved 2008-11-29.
  3. Randor Guy (2008-10-31). "Trend-setter". The Hindu. Archived from the original on 2008-11-03. Retrieved 2013-02-20.
  4. M. Balaganessin (2007-04-03). "She wants novel role". The Hindu. Archived from the original on 2007-04-10. Retrieved 2013-02-20.

బయటి లింకులు మార్చు