శంకర (2016 సినిమా)

2016లో తాతినేని సత్య దర్శకత్వంలో విడుదలైన సినిమా

శంకర 2016, అక్టోబరు 21న విడుదలైన తెలుగు చలనచిత్రం. తాతినేని సత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నారా రోహిత్, రెజీనా, ఆహుతి ప్రసాద్, ఎం. ఎస్. నారాయణ, రాజీవ్ కనకాల, ప్రగతి తదితరులు నటించగా సాయి కార్తీక్ సంగీతం అందించాడు.[2][3] తమిళంలో విజయం సాధించిన మౌన గురు చిత్రం ఆధారంగా ఇది తెరకెక్కింది.[4][5]

శంకర
శంకర సినిమా పోస్టర్
దర్శకత్వంతాతినేని సత్య
నిర్మాతఆర్.వి. చంద్రమౌళి ప్రసాద్
తారాగణంనారా రోహిత్, రెజీనా
ఛాయాగ్రహణంటి. సురేందర్ రెడ్డి
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంసాయి కార్తీక్
నిర్మాణ
సంస్థ
శ్రీ లీల మూవీస్
విడుదల తేదీ
2016 అక్టోబరు 21 (2016-10-21)[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

కథానేపథ్యం మార్చు

శంకర్ (నారా రోహిత్) హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటుంటాడు. అనుకోని పరిస్థితుల్లో ఒక పోలీసు అధికారి (జాన్ విజయ్) వల్ల శంకర్) మాదకద్రవ్యాల కేసులో ఇరుక్కుంటాడు. శంకర్ ఆ సమస్యను ఎలా పరిష్కరించాడు అనేది మిగతా కథ.

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

ఇతర వివరాలు మార్చు

  1. 2013, జనవరి 24న ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. రమేష్ ప్రసాద్ క్లాప్ కొట్టగా, చాముండేశ్వరినాథ్ కెమెరా ఆన్ చేయగా వి. వి. వినాయక్ మొదటి షాట్ కు గౌరవ దర్శకత్వం వహించారు.[6]
  2. యు మీ ఔర్ హమ్, ఎ ఫ్లాట్‌ వంటి హిందీ చిత్రాలలో నటించిన బ్రిటీష్ మోడల్‌, నటి హజెల్ క్రౌనీపై ఒక ఐటమ్ సాంగ్ చిత్రీకరించబడింది.[7]

పాటలు మార్చు

సాయి కార్తీకం సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు అదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల అయ్యాయి.

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "ఓ శరభ (రచన: అభినయ శ్రీనివాస్)"  సాయి కార్తీక్, దివిజ కార్తీక్ 1:32
2. "నీ ప్రాణం (రచన: బాలాజీ)"  రంజిత్ 4:12
3. "మరదల మరదల (రచన: రామజోగయ్య శాస్త్రి)"  సాయి కార్తీక్, దివిజ కార్తీక్ 3:25
4. "శంకర (రచన: రామజోగయ్య శాస్త్రి)"  సాయి చరణ్, ఎం.ఎల్.ఆర్. కార్తీకేయన్ 3:12
5. "ఎదలోన (రచన: రామజోగయ్య శాస్త్రి)"  సమీర్ 3:54
16:15

మూలాలు మార్చు

  1. "Shankara Telugu Movie, Wiki, Story, Review, Release Date, Trailers – Filmibeat". Retrieved 9 July 2019.
  2. "Nara Rohit, Regina's film titled 'Shankara'". timesofap.com. Archived from the original on 17 జూన్ 2013. Retrieved 9 July 2019.
  3. "Nara Rohit's 'Shankara' audio soon". 123telugu.com. Retrieved 9 July 2019.
  4. "Nara Rohit in a crime drama". timesofindia.indiatimes.com. 27 May 2013. Archived from the original on 2 December 2013. Retrieved 9 July 2019.
  5. "shankara-theatrical-trailer-nara-rohit-regina-cassandra". Archived from the original on 20 ఫిబ్రవరి 2015. Retrieved 9 జూలై 2019.
  6. "Nara Rohit's new film in the direction of Tatineni Satya Prakash". idlebrain.com. 24 January 2013. Retrieved 9 July 2019.
  7. "Hazel Crowney grooves to item song in 'Shankara'". newindianexpress.com. Archived from the original on 10 మార్చి 2016. Retrieved 9 July 2019.

ఇతర లంకెలు మార్చు