శకుంతలా పరాంజపే

శకుంతలా పరాంజపే (17 జనవరి 1906 – 3 మే 2000) ఒక భారతీయ రచయిత్రి, ప్రసిద్ధ సంఘ సేవకురాలు. ఈమె 1958–64 ల మధ్య కాలంలో మహారాష్ట్ర శాసనమండలి సభ్యురాలు, 1964–70 ల మధ్య రాజ్యసభలో నామినేటెడ్ సభ్యురాలు. [1] .[2][3] కుటుంబ నియంత్రణ క్షేత్రంలో 1938 నుండి ఈమె చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 1991లో ఈమెకు పద్మభూషణ్ పురస్కారం ప్రదానం చేసింది.[4]

శకుంతలా పరాంజపే
వి.శాంతారాం నిర్మించిన దునియా న మానె (1937) చిత్రంలో శకుంతలా పరాంజపే.
జననం17 జనవరి 1906
మరణం3 మే 2000
వృత్తిమహారాష్ట్ర శాసనమండలి సభ్యురాలు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
రచయిత్రి, ప్రసిద్ధ సంఘ సేవకురాలు

జీవిత చరిత్ర మార్చు

ఈమె ప్రఖ్యాత గణిత మేధావి ఆర్.పి. పరాంజపే కుమార్తె. అతడు 1944-1947ల మధ్య ఆస్ట్రేలియా దేశానికి భారత హై కమీషనర్‌గా పనిచేశాడు.[5]

ఈమె కేంబ్రిడ్జిలో 1929లో గణితశాస్త్రం చదివింది.[6]మరుసటి సంవత్సరం లండన్ విశ్వవిద్యాలయం నుండి డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసింది.[7]

ఈమె 1930లలో స్విట్జర్లాండ్, జెనీవాలోని అంతర్జాతీయ కార్మిక సంస్థలో పనిచేసింది.[8] ఈమె 1930 - 40 దశకాలలో కొన్ని మరాఠీ, హిందీ సినిమాలలో నటించింది. ఈమె నటించిన సినిమాలలో వి.శాంతారాం నిర్మించిన దునియా న మానే ప్రసిద్ధి చెందింది. ఈమె మరాఠీ భాషలో ఎన్నో నాటకాలు, కథలు, నవలలు వ్రాసింది. కొన్ని ఇంగ్లీషు భాషలలో కూడా వ్రాసింది.

ఈమె మరాఠీలో వ్రాసిన ఒక కథ ఆధారంగా 2003లో హిందీలో యే హై చక్కడ్ బక్కడ్ బంబే బో అనే బాలల సినిమా తీయబడింది. [9]

వ్యక్తిగత జీవితం మార్చు

శకుంతల రష్యాకు చెందిన యౌరా స్లెట్జాఫ్ అనే పేయింటర్‌ను వివాహం చేసుకుంది. వీరికి 1938లో సాయి పరాంజపే జన్మించింది. [5] కూతురు పుట్టిన కొద్ది రోజులకే ఈమె యౌరాతో విడాకులు తీసుకుంది.

సాయి పరాంజపే హిందీ సినిమాల దర్శకురాలిగా, సినిమా రచయిత్రిగా పేరు గడించింది. ఈమెకు కూడా 2006లో పద్మభూషణ్ పురస్కారం లభించింది. [4]

నటన మార్చు

శకుంతలా పరాంజపే ఈ క్రింది సినిమాలలో నటించింది:

  • గంగా మయ్యా (1955)
  • లోక్ షాహిర్ రాం జోషి (1947)
  • రామశాస్త్రి(1944)
  • జవానీ కా రంగ్ (1941)
  • పైసా(1941)
  • స్త్రీ (1938)
  • దునియా నా మానే (1937)
  • జీవన్ జ్యోతి (1937)
  • కుంకు(1937)
  • సుల్తానా చాంద్ బీవీ (1937)
  • బహద్దూర్ బేటీ(1935)
  • ఖాళీ వ్యాగన్ (1935)
  • టైపిస్ట్ గర్ల్ (1935)
  • భక్త ప్రహ్లాద్ (1934)
  • భేది రాజకుమార్ (1934)
  • పార్థ కుమార్ (1934)
  • సైరంధ్రి (1933)

రచనలు మార్చు

  • త్రీ ఇయర్స్ ఇన్ ఆస్ట్రేలియా (ఇంగ్లీషు), పూనా, 1951.[10]
  • సెన్స్ అండ్ నాన్‌సెన్స్ (ఇంగ్లీషు), న్యూ ఢిల్లీ, ఓరియెంట్ లాంగ్మన్ 1970.[1][permanent dead link]
  • కాహి ఆంబట్ కాహి గోద్ Kāhi Āmbat, Kāhi Goad, (మరాఠీ), పూణే. 1979.
  • దేశ్ విదేశీయ లోక్ కథ్, (మరాఠీ)

మూలాలు మార్చు

  1. Members Of Rajya Sabha Since 1952 Archived 2008-01-28 at the Wayback Machine Rajya Sabha website.
  2. Rajya Sabha website Archived 2007-09-27 at the Wayback Machine Nominated members
  3. "NOMINATED MEMBERS OF RAJYA SABHA". Archived from the original on 2007-09-27. Retrieved 2017-04-30.
  4. 4.0 4.1 Padma Bhushan Awardees Shakuntala Pranjpye, 1991, Maharashtra, Social Work. Sai Paranjpye, Arts, Maharashtra, 2006.
  5. 5.0 5.1 "Sai Paranjpye at ASHA". Archived from the original on 2007-12-17. Retrieved 2017-04-30.
  6. Aparna Basu; Malavika Karlekar (2008). In So Many Words: Women's Life Experiences from Western and Eastern India. Routledge. p. 89. ISBN 978-0-415-46734-6.
  7. Shakuntala Profile Archived 2016-03-04 at the Wayback Machine Graduates of the University of Cambridge.
  8. Sai speak! The Times of India,8 July 2002.
  9. yeh hai chakkad bakkad bumbe bo Archived 2007-10-10 at the Wayback Machine upperstall.
  10. Three Years In Australia Archived 2012-02-09 at the Wayback Machine Item: 13460, booksandcollectibles.

మూలాలజాబితా మార్చు