శత్రుఘ్నుడు

రామాయణంలో రాముని తమ్ముడు

శత్రుఘ్నుడు రామాయణంలో దశరథుని కుమారుడు, శ్రీరాముని తమ్ముడు. ఈయన తల్లి సుమిత్ర. లక్ష్మణుడు, శత్రుఘ్నుడు కవల పిల్లలు. రామాయణం ప్రకారం రాముడు విష్ణువు ఏడవ అవతారం అయితే లక్ష్మణుడు ఆదిశేషుడి అంశ. భరతుడు సుదర్శన చక్రం అంశ కాగా శత్రుఘ్నుడు శంఖం అంశ.[1]

రాముని ఆఖరి సోదరుడు శతృఘ్నుడు.

శ్రీరాముడు శివధనుర్భంగం చేసిన తరువాత, జనక మహారాజు తమ్ముడైన కుశధ్వజుని కుమార్తె అయిన శ్రుతకీర్తిని శత్రుఘ్నునితో వివాహం జరిపిస్తారు.

జననం మార్చు

శత్రుఘ్నుడు దశరథ మహారాజుకు, ఆయన ముగ్గురు పట్టపురాణులలో రెండవది, కాశీ రాకుమారి అయిన సుమిత్రకు జన్మించిన వాడు. సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు కవల పిల్లలుగా కౌసల్యకు రాముడు, కైకేయికి భరతుడు జన్మిస్తారు.

రామ వనవాస కాలం మార్చు

రాముడు అరణ్యవాసం చేస్తున్నపుడు కైకేయి మనసు విరిచి రాముడు అడవులపాలు కావడానికి కారణమైన మంథరను శతృఘ్నుడు చంపబోగా రాముడు ఇలాంటి కార్యాలను హర్షించడని భరతుడు అతడిని వారిస్తాడు.

భరతుడు వెళ్ళి రాముడిని తిరిగి రాజ్యానికి రమ్మని ఆహ్వానిస్తాడు కానీ రాముడు అందుకు అంగీకరించడు. చివరికి రాముడు పాదుకలను తనతో తీసుకుని వచ్చి రాజ్యభారాన్ని వహిస్తుంటాడు భరతుడు. పేరుకు భరతుడు రాజ్యభారం వహిస్తున్నా అందులో శత్రుఘ్నుని పాత్ర చాలా ముఖ్యమైనది. రాచకార్య నిర్వహణలో భరతుడికి సాయంగా ఉండేవాడు. అలాగే రాముడు, లక్ష్మణుడు, భరతుడు అయోధ్యలో లేనప్పుడు ముగ్గురు రాణులకీ శత్రుఘ్నుడే అండగా ఉండేవాడు.

అవతార పరిసమాప్తి మార్చు

రాముడి అవతార పరిసమాప్తి కాగానే ఆయన సరయు నదిలో ప్రవేశించి విష్ణువుగా వైకుంఠాన్ని చేరుకుంటాడు. రామునితో పాటు అతని తమ్ములైన లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు కూడా ప్రాణత్యాగం చేసేస్తారు.

మూలాలు మార్చు

  1. Naidu, S. Shankar Raju; Kampar, Tulasīdāsa (1971). A comparative study of Kamba Ramayanam and Tulasi Ramayan. University of Madras. pp. 44, 148. Retrieved 2009-12-21. {{cite book}}: |work= ignored (help)