శాంతిప్రియ (నటి)

(శాంతిప్రియ(నటి) నుండి దారిమార్పు చెందింది)

శాంతిప్రియ భారతీయ సినీ నటి. తెలుగు, తమిళహిందీ భాషా చిత్రాల్లో ఎక్కువగా నటించింది.[1] ఆమె ప్రఖ్యాత నటి భానుప్రియ చెల్లెలు.

శాంతి ప్రియ
జననం (1969-09-22) 1969 సెప్టెంబరు 22 (వయసు 54)
క్రియాశీల సంవత్సరాలు1987–1994
1995, 2002 (TV)
2008–2012 (TV), 2022
జీవిత భాగస్వామి
(died)
పిల్లలుఇద్దరు కుమారులు, శుభమ్ రే, శిష్య రే
బంధువులుభానుప్రియ (అక్క)

కెరీర్ మార్చు

శాంతిప్రియకు నిశాంతి అని మరో పేరు ఉంది. ఆమె ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఆమె నటించిన ఎంగ ఊరు పాటుక్రన్(1988) చిత్రం ఆమె కెరీర్ లోనే అతిపెద్ద హిట్ గా నిలిచింది. 2002లో ముకేష్ ఖన్నా సరసన ఆర్యజమాన్-బ్రహ్మాండ్ కా యోధ అనే  ధారావహికలో నటించింది. అక్షయ్ కుమార్ సరసన సుగంధ్ సినిమాతో తెరంగేట్రం చేసింది శాంతిప్రియ. మేరే సజనా సాత్ నిభానా, ఫూల్ ఔర్ అంగార్, మెహెర్బాన్ వంటి విజయవంతమైన చిత్రాల్లో మిథున్ చక్రవర్తి  సరసన నటించింది ఆమె. ప్రస్తుతం ఆమె మిథుండా కొడుకు మహాక్షయ్  చక్రవర్తితో కలసి హామిల్టన్ ప్యాలస్ అనే సినిమాలో నటిస్తోంది. 

తెలుగులో మహర్షితో ఎంట్రీ ఇచ్చితర్వాత సింహస్వప్నం, రక్తకన్నీరు, నాకూ పెళ్లాం కావాలి, అగ్ని వంటి చిత్రాలు చేసింది.

కుటుంబం మార్చు

1999లో వి.శాంతారాం మనవడైన సిద్ధర్ధ రాయ్ ను వివాహం చేసుకుంది. సిద్ధార్ద రాయ్ బాజీగర్, వంశ్ వంటి సినిమాల్లో నటించాడు. 2004లో గుండె నొప్పితో శాంతిప్రియ భర్త చనిపోయాడు. ఆమెకు ఇద్దరు కొడుకులు.

రీఎంట్రీ మార్చు

స్వాతంత్ర్య సమరయోధురాలు, సుప్రసిద్ధ కవయిత్రి సరోజిని నాయుడు జీవితకథ ఆధారంగా తెరకెక్కబోయే చిత్రం ద్వారా శాంతిప్రియ తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇది పాన్ ఇండియా చిత్రం. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో తెరకెక్కనుంది. ఈ బయోపిక్ 2022 జూన్ లో సెట్స్ పైకి వెళ్లనుంది.[2]

ఆమె సినిమాల్లో కొన్ని మార్చు

మూలాలు మార్చు

  1. "Shanti Priya actress- Movie list". paaru. Archived from the original on 2015-02-14. Retrieved 2015-02-14.
  2. "Shanthi Priya to make comeback with Sarojini Naidu biopic: 'I will leave no stone unturned to do justice…' | Entertainment News,The Indian Express". web.archive.org. 2022-05-07. Archived from the original on 2022-05-07. Retrieved 2022-05-07.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)