శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా పరిషత్తు

శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా పరిషత్తు (ఇంగ్లీషు Council of Scientific and Industrial Research, హిందీ - वैज्ञानिक एवं औद्योगिक अनुसंधान परिषद ) అనునది 1942 స్థాపించబడిన స్వయంప్రతిపత్త సంస్థ, 39 పరిశోధనాశాలలు, 50 క్షేత్ర స్థానాలు, విస్తరణా కేంద్రాలతో, 17000కి మించిన సిబ్బందితో కూడిన భారతదేశపు అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి సంస్థ. శా.పా.ప.ప కేంద్ర శాస్త్రసాంకేతిక మంత్రిత్వ శాఖచే పోషింపబడినప్పటికీ, స్వయంప్రతిపత్తితోనే వ్యవహరిస్తుంది. దీని ప్రధాన పరిశోధనా రంగాలలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్, నిర్మాణ ఇంజనీరింగ్, సముద్ర శాస్త్రాలు, పరమాణు జీవశాస్త్రం, లోహ సంగ్రహణ, రసాయనాలు, గనుల త్రవ్వకం, ఆహారం, ముడి చమురు, తోలు, వాతావరణం వంటి ముఖ్యమైనవి కూడా ఉన్నాయి. 20వ శతాబ్దపు ఆఖరి పదేళ్లలో 1376 నూతన ఆవిష్కరణలు వాటి దత్తాంశాలను అభివృద్ధి చేసింది.

శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా పరిషత్తు
वैज्ञानिक तथा औद्योगिक अनुसंधान परिषद
మాతృ సంస్థభారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ
వ్యవస్థాపకులుఆర్కాట్ రామస్వామి ముదలియార్, శాంతి స్వరూప్ భట్నాగర్
స్థాపితం26 సెప్టెంబరు 1942
అధ్యక్షుడుభారత ప్రధాన అమ్ంత్రి
డైరక్టరు జనరల్నల్ల తంబీ కాలై సెల్వి ( తొలి మహిళా డైరెక్టర్ జనరల్)
బడ్జెట్7,144 crore (US$890 million) (2021-22)[1]
అనుబంధ సంస్థలు38 ప్రయోగశాలలు, 39 పరిశోధనా కేంద్రాలు, 3 ఇన్నోవేషన్ సెంటర్లు
ప్రదేశం
అణుసదన్ భవన్

2 Rafi Marg,

New Delhi-110 001.

విజయాలు మార్చు

  • మొదటి విజయం 20 యేళ్ళకు పుష్పించే వెదురు మొక్కలను వారాల వ్యవధిలో పుష్పించేలా చేయడం.
  • అండమాన్ లోని స్థానిక తెగల జన్యువైవిధ్యాన్ని అధ్యయనం చేయడం, 60000యేళ్ల కిందటి ఆఫ్రికా మూలాలను గుర్తించడం
  • Developed the first transgenic Drosophila model for drug screening for cancer in humans.
  • భారతదేశంలో DNA వేలిముద్రలు ప్రవేశపెట్టిన మొదటి సంస్థ.
  • ఐక్యరాజ్యసమితి సదస్సులోని సముద్ర చట్టం మీద మార్గదర్శక పెట్టుబడిదారుగా భారతదేశం నిలవడంలో సాయపడింది.
  • Invented the first ever only once a week non-steroidal family planning pill in the world by the name of Saheli.
  • Designed India's first ever parallel processing computer Flosolver.[5]
  • 5 లక్షలనుండి 500,000 కోట్ల టర్నోవర్ గల 50,000పైచిలుకు కంపెనీలతో భాగస్వామ్యం ఏర్పరుచుకున్నది.
  • Rejuvenated India's one hundred year old refinery at Digboi using the most modern molecular distillation technology.
  • Provided the critical technology for the NMP Lube Extraction Plant of capacity of 2,50,000 tonnes per year.
  • Development of a versatile portable PC-based software 'Bio-Suite' for bioinformatics.[citation needed]
  • 14 సీట్ల "SARAS" విమాన రూపకల్పన
  • ఇంగ్లీషు, జర్మన్, ఫ్రెంచ్, జపనీస్, స్పానిష్ భాషలలో వినియోగించగల, సాంప్రదాయిక విజ్ఞాన డిజిటల్ గ్రంథాలయంని ఏర్పరచడం.ప్రపంచ మొత్తమ్మీద ఈ తరహా గ్రంథాలయాల్లో ఇదే మొట్టమొదటిది.
  • Remained in Top 3 in the list of PCT patent applications amongst all developing countries.
  • Topped list of holders of U.S. patents.
  • Successfully challenged the grant of patent in the USA for use of haldi (turmeric) for wound healing and neem as insecticide.
  • In 2009, the Council of Scientific and Industrial Research (CSIR) has completed the Human Genome Sequencing.[8]
  • In 2011, successfully tested India's 1st indigenous civilian aircraft, NAL NM5 made in association with National Aerospace Laboratories and Mahindra Aerospace.

ప్రయోగశాలలు మార్చు

శా.పా.ప.ప పరిధిలోని కొన్ని ప్రయోగశాలలు,

1. ఆధునిక పదార్థాలు, ప్రక్రియల పరిశోధనా సంస్థానం(AMPRI), భోపాల్

2. గణితశాస్త్ర నమూనాల రూపకల్పన, సంగణక యంత్ర అనుకరణల కేంద్రం(C-MMACS), బెంగుళూరు

3. కేంద్రీయ భవన పరిశోధనా సంస్థానం (CBRI) Archived 2012-04-21 at the Wayback Machine

4. కణ, అణుసంబంధిత జీవశాస్త్ర కేంద్రం(CCMB), హైదరాబాద్

5. కేంద్రీయ ఔషధ పరిశోధనా సంస్థ(CDRI), లక్నో

6. కేంద్రీయ విద్యుత్ రసాయనిక పరిశోధనా సంస్థానం(CECRI), కారైకుడి

7. కేంద్రీయ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పరిశోధనా సంస్థానం(CEERI) Archived 2019-09-02 at the Wayback Machine, పిలాని

8. కేంద్రీయ ఇంధన పరిశోధనా సంస్థానం[(CFRI) ], ధన్‌బాద్

9. కేంద్రీయ ఆహార ప్రౌద్యోగికతా పరిశోధనా సంస్థానం (CFTRI) Archived 2012-08-01 at the Wayback Machine, మైసూరు

10. కేంద్రీయ గాజు, పింగాణీ పరిశోధనా సంస్థానం(CGCRI), కోల్‌కత

11. కేంద్రీయ ఔషధీ, పరిమళయుత మొక్కల పరిశోధనా సంస్థానం (CIMAP), లక్నో

12. కేంద్రీయ గనుల త్రవ్వకం, ఇంధన పరిశోధనల సంస్థానం (CIMFR), ధన్‌బాద్

13. కేంద్రీయ తోలు పరిశోధనా సంస్థానం (CLRI), కొత్త ఢిల్లీ

14. కేంద్రీయ యాంత్రిక అభియాంత్రిక పరిశోధనా సంస్థానం (CMERI)

15. కేంద్రీయ గనుల త్రవ్వకాల పరిశోధనా సంస్థానం [(CMRI) ], ధన్‌బాద్

16. కేంద్రీయ రహదారుల పరిశోధనా సంస్థానం (CRRI), కొత్త ఢిల్లీ

17. కేంద్రీయ శాస్త్రీయ సాధనాల సంస్థ (CSIO) Archived 2012-03-20 at the Wayback Machine, చండీఘఢ్

18. కేంద్రీయ ఉప్పు, సముద్ర రసాయనాల పరిశోధనా సంస్థానం(CSMCRI), భావ్‌నగర్

19. జన్యుశాస్త్ర, సమన్వయ జీవశాస్త్ర సంస్థానం(IGIB), ఢిల్లీ

20. హిమాలయ జీవవనరుల ప్రౌద్యోగికతా సంస్థానం(IHBT), పాలంపూర్

21. భారతీయ రసాయనిక జీవశాస్త్ర సంస్థానం(IICB), కోల్‌కత

22. భారతీయ రసాయనిక ప్రౌద్యోగికతా సంస్థానం(IICT), హైదరాబాద్

23. భారతీయ పెట్రోలియం(ముడినూనె) సంస్థానం(IIP), డెహ్రాడూన్

24. ఖనిజ, పదార్థ ప్రౌద్యోగికతా సంస్థానం(IMMT), భువనేశ్వర్

25. సూక్ష్మజీవ ప్రౌద్యోగికతా సంస్థానం(IMT), చండీఘఢ్

26. భారతీయ విషవిజ్ఞాన పరిశోధనా సంస్థానం(IITR), లక్నో

27. జాతీయ అంతరిక్ష పరిశోధనాశాలలు(NAL), బెంగుళూరు

28. జాతీయ వృక్షశాస్త్ర పరిశోధనా సంస్థానం(NBRI), లక్నో

29. జాతీయ రసాయనిక పరిశోధనాశాల(NCL), పూణె

30. జాతీయ పర్యావరణ అభియాంత్రికతా పరిశోధనా సంస్థానం(NEERI), నాగ్‌పూర్

31. జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ(NGRI) Archived 2011-07-07 at the Wayback Machine, హైదరాబాద్

32. జాతీయ సముద్ర విజ్ఞాన సంస్థానం(NIO), డోనా పౌలా

33. జాతీయ శాస్త్ర, సంభాషణ, సమాచార వనరుల సంస్థానం(NISCAIR), కొత్త ఢిల్లీ

34. జాతీయ శాస్త్ర, ప్రౌద్యోగికత, అభివృద్ధి అధ్యయన సంస్థానం(NISTADS), కొత్త ఢిల్లీ

35. జాతీయ ధాతువిజ్ఞానశాస్త్ర ప్రయోగశాల(NML), జంషెడ్‌పూర్

36. జాతీయ భౌతికశాస్త్ర ప్రయోగశాల(NPL), కొత్త ఢిల్లీ

37. ప్రాంతీయ పరిశోధనా ప్రయోగశాల[(RRL) ], జమ్ము

38. ఈశాన్య శాస్త్ర, ప్రౌద్యోగికతా సంస్థానం[(NEIST (RRL) ], జోర్హాత్

39. National Institute for Interdisciplinary Science and Technology, తిరువనంతపురం

40. నిర్మాణ అభియాంత్రిక పరిశోధనా కేంద్రం(SERC, M), చెన్నై

ఇవి కూడా చూడండి మార్చు

బయటి లంకెలు మార్చు

మూలాలు మార్చు

  1. https://www.indiabudget.gov.in/doc/eb/sbe90.pdf