శ్రావ్య

భారతీయ నటి

శ్రావ్య తెలుగు, తమిళ సినిమా నటి.[1] బాలనటిగా తెలుగు సినిమారంగానికి పరిచయమైన శ్రావ్య 2014లో వచ్చిన లవ్ యు బంగారమ్ సినిమాతో హీరోయిన్ గా మారింది.

శ్రావ్య(Shravya)
విద్యాసంస్థవిజ్ఞానజ్యోతి ఇన్సిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, హైదరాబాద్
వృత్తినటి

జననం - విద్యాభ్యాసం మార్చు

శ్రావ్య హైదరాబాద్ లో జన్మించింది. విజ్ఞానజ్యోతి ఇన్సిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లో బిటెక్ పూర్తిచేసింది.

సినీరంగ ప్రస్థానం మార్చు

చిన్నతనం నుండి నటనపై ఇష్టం ఉన్న శ్రావ్య బాలనటిగా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించి సందడే సందడి, నేను సీతామహాలక్ష్మి, ఆర్య, ఔనన్నా కాదన్నా వంటి చిత్రాలలో బాలనటిగా నటించింది.[2] 2014లో వచ్చిన లవ్ యు బంగారమ్ సినిమాతో హీరోయిన్ గా మారి కాయ్ రాజా కాయ్, నందిని నర్సింగ్‌హోం వంటి సినిమాలలో నటించింది.

వెల్లికిజామై 13ఏఏం తేతి సినిమాతో తమిళ సినిమారంగంలోకి ప్రవేశంచి పగిరి, విలైయట్టు ఆరంభం వంటి చిత్రాలలో నటించింది.

నటించిన చిత్రాల జాబితా మార్చు

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2002 సందడే సందడి తెలుగు బాలనటి
2003 నేను సీతామహాలక్ష్మి తెలుగు బాలనటి
2004 ఆర్య తెలుగు బాలనటి
2005 ఔనన్నా కాదన్నా తెలుగు బాలనటి
2014 లవ్ యు బంగారమ్ మీనాక్షి తెలుగు
2015 కాయ్ రాజా కాయ్[3] తెలుగు
2016 వెళ్ళికెళమై 13ఆమ్ తేది రాసతి తమిళం
పగిరి మధు తమిళం
నందిని నర్సింగ్‌హోం అమూల్య తెలుగు
2017 విలైయట్టు ఆరంభం తమిళం

మాలాలు మార్చు

  1. ఆంధ్రజ్యోతి. "నేను తెలుగమ్మాయినే: సినీ నటి శ్రావ్య". Retrieved 9 June 2017.[permanent dead link]
  2. టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్. "Shravy,శ్రావ్య". tollywoodphotoprofiles.blogspot.in. Archived from the original on 19 మార్చి 2017. Retrieved 9 June 2017.
  3. తెలుగు ఫిల్మీబీట్. "శ్రావ్య". telugu.filmibeat.com. Retrieved 9 June 2017.[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=శ్రావ్య&oldid=2942811" నుండి వెలికితీశారు