శ్రీహరి (నటుడు)

నటీనటులు మహానటుడు నటుడు

శ్రీహరి (ఆగష్టు 15, 1964 - అక్టోబరు 9, 2013) తెలుగు సినిమా నటుడు. ప్రతినాయకునిగా తెలుగు తెరకు పరిచయమై తరువాత నాయకుడిగా పదోన్నతి పొందిన నటుడు.

శ్రీహరి

శ్రీహరి ఛాయాచిత్రం
జననం (1964-08-15)1964 ఆగస్టు 15 [1]
యలమర్రు, భారతదేశం India
ఇతర పేర్లు రియల్ స్టార్
భార్య/భర్త శాంతి
ప్రముఖ పాత్రలు పోలీస్
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
మగధీర షేర్ ఖాన్
భద్రాచలం

జీవితసంగ్రహం మార్చు

శ్రీహరి మంచి వ్యక్తిత్వం కలిగిన నటుడు, సాయం కోసం తన దగ్గరకు వెళ్లిన వారికి లేదు అనకుండా సాయం చేసే గుణం కలిగిన మనిషి.[2] శ్రీహరి తాత రఘుముద్రి అప్పలస్వామికి ఐదుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. శ్రీకాకుళం జిల్లా నుంచి కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం యలమర్రు గ్రామానికి వలస వచ్చారు. వీరిలో నాలుగవ కుమారుడు శ్రీహరి తండ్రి సత్యన్నారాయణ, తల్లి సత్యవతి. యలమర్రులో రోడ్డు పక్కన చిన్న పాక వేసుకొని సైకిలు షాపు, సోడాలు అమ్మి జీవనం సాగించారు. శ్రీహరికి శ్రీనివాసరావు, శ్రీధర్ అన్నదమ్ములు. 1977 లో యలమర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీహరి ఏడవ తరగతి పాసయ్యారు. తరువాత గ్రామంలోని అరెకరం భూమిని అమ్ముకొని హైదరాబాదుకు మకాం మార్చారు. ఏటా యలమర్రు గంగానమ్మ జాతరకు శ్రీహరి తప్పనిసరిగా వెళ్ళేవాడు.

యుక్తవయసు నుండే శారీరక ధారుడ్యంపై ఎంతో ఆసక్తి కలిగివుండేవాడు. ఉదయం చదువుకుంటూ, సాయంత్రం శోభన థియేటర్ ఎదురుగా ఉన్న అన్న శ్రీనివాసరావు షెడ్డులో మెకానిక్ గా పనిచేస్తూ ఖాళీ దొరికిన సమయంలో సినిమాలు శోభన థియేటర్ లో చూసేవాడు. హైదరాబాద్ లో నిర్వహించిన అనేక శారీరక ధారుడ్య పోటిల్లో పాల్లొని ‘మిస్టర్ హైదరాబాద్’గా ఏడుసార్లు అవార్డును సొంతం చేసుకున్నారు. విశ్వవిద్యాలయం తరపున రెండుసార్లు జాతీయస్థాయి పోటీలలో పాల్గొని, బహుమతులు గెలుచుకున్నారు. ఏషియన్ గేమ్స్ లో భారతదేశం తరపున ఆడాలనే కోరిక ఉన్నా అది తీరలేదు.

సినీ జీవితం మార్చు

1986లో సినిమాలోకి స్టంట్ మాస్టర్‌గా కెరీర్ మొదలు పెట్టిన శ్రీహరి...అంచెలంచెలుగా నటుడిగా ఎదిగారు. 1989లో తమిళ సినిమా మా పిళ్ళై, తెలుగు 'ధర్మక్షేత్రం' చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన ఆయన విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, నిర్మాతగా వివిధ రకాలుగా రాణించారు.

పోలీస్ చిత్రంతో హీరోగా ఆయనకు మంచి పేరు లభించింది. హీరోగా చేసిన మొదటి చిత్రం 'పోలీస్' అయితే.. హీరోగా చేసిన చివరి చిత్రం 'పోలీస్ గేమ్' కావడం విశేషం. క్యారెక్టర్ ఆర్టిస్టుగా చివరి చిత్రం తుఫాన్.ఇప్పటి వరకు 28 చిత్రాల్లో హీరోగా నటించారు. రియల్ స్టార్‌గా ఖ్యాతి గడించారు. ఇప్పటి వరకు ఆయన దాదాపు వంద చిత్రాల్లో నటించారు.

జిమ్నాస్టిక్స్‌లో రాష్ట్ర స్థాయి చాంపియన్ అయిన శ్రీహరి అథ్లెట్ అవ్వాలనుకున్నారు. జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్‌లో పాల్గొనాల్సి ఉన్నా....సినిమాలపై మక్కువతో ఈ రంగంవైపు అడుగులు వేసారు. దాసరి దర్శకత్వంలో వచ్చిన ‘బ్రహ్మనాయుడు’లో ఆయనకు తెలుగు సినిమాలో నటుడిగా అవకాశం దక్కింది. తాజ్ మహల్ చిత్రంలో పూర్తిస్థాయి విలన్ పాత్రలో కనిపించారు.

2000వ సంవత్సరంలో వచ్చిన ‘పోలీస్' చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. గణపతి, ఆయోధ్య రామయ్య, శ్రీశైలం, భద్రాచలం, హనుమంతు, విజయరామరాజు చిత్రాల్లో హీరోగా నటించారు. హీరోగా చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బృందావనం, ఢీ, కింగ్, మగధీర, తుఫాన్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.

పృధ్వీపుత్రుడు సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన శ్రీహరి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీరలో షేర్ ఖాన్ పాత్రతో అందరినీ ఆకట్టుకున్న శ్రీహరి, ఇటీవల రామ్ చరణ్ హీరోగా నటించిన తుఫాన్‌,రఫ్‌ (2014) సినిమాల్లో నటించారు.

తెలంగాణ యాసకు గౌరవం మార్చు

సినిమాల్లో తెలంగాణ యాసకు గొప్ప గౌరవాన్ని తీసుకువచ్చిన నటుడు శ్రీహరి. ఢీ, కింగ్, డాన్ శీను, బృందావనం, తుఫాన్ వంటి చిత్రాలలో ఆయన పలికించిన సంభాషణలు తెలంగాణ యాసలోఉన్న సౌందర్యాన్ని ఆవిష్కరించాయి. నిజజీవితంలో హైదరాబాదీ తెలంగాణయాసలో ఆయన సంభాషణ అందరినీ ఆకట్టుకునేలా సాగేది.

వ్యక్తిగత జీవితం మార్చు

శ్రీహరి శాంతిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె అక్షర.

నాలుగు నెలలకే కుమార్తె అకాల మరణం చెందగా, తన కూతురు అక్షర పేరుతో ఫౌండేషన్ నెలకొల్పి, మేడ్చల్ పరిధిలోని నాలుగు గ్రామాలను దత్తత తీసుకొని అక్కడి ప్రజలకు మినరల్ వాటర్ ను అందించడంతోపాటు గ్రామంలో అనేక మౌలిక సదుపాయాల సాదనకు కృషిచేశారు.

తమ గ్రామానికి చెందిన శ్రీహరి రాష్ట్రస్థాయికి ఎదిగి గ్రామం పేరును నలుదిశలా చాటినందుకు గర్వంగా యలమర్రు గ్రామ ప్రముఖులు 1989 సంవత్సరంలో శ్రీహరిని హైదరాబాద్‌లో ఘనంగా సన్మానించారు.

ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాంబో రాజ్‌కుమార్ సినిమా షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లిన శ్రీహరి అక్కడ తీవ్ర అస్వస్థతకు గురవడంతో వెంటనే అతన్ని లీలావతి ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్టోబరు 9, 2013 న కాలేయ సంబంధ వ్యాధివలన ముంబై లో కన్నుమూసారు.

నటించిన చిత్రాలు మార్చు

సం. సంవత్సరం సినిమా పేరు పాత్రపేరు తోటి నటీనటులు దర్శకులు ఇతర వివరాలు
1 2013 శ్రీ జగత్ గురు ఆదిశంకర జె.కె. భారవి
2 2013 తుఫాన్ షేర్ ఖాన్ రాం చరణ్ తేజ అపూర్వ లాఖియా హిందీలో జంజీర్
3 2012 యమహో యమ యముడు సాయిరాం శంకర్ వై. జితేంద్ర
4 2012 తిక్క
5 2011 అహ నా పెళ్ళంట అల్లరి నరేష్, సుబ్బరాజు వీరభద్రం
5 2010 బృందావనం జూ. ఎన్టీయార్ వంశీ పైడిపల్లి
6 2010 బ్రోకర్ ధర్మతేజ ఆర్.పి. పట్నాయక్ ఆర్.పి. పట్నాయక్
7 2010 డాన్ శీను నర్సింగ్, డాన్ రవితేజ గోపిచంద్ మలినేని
9 2010 ఉల్లాసం
10 2010 భైరవ ఎ సి పి భైరవ సింధు తులానీ పోలూరి శ్రీనివాసరెడ్డి
11 2010 దాసన్నా దాసన్న మీనా డి.ఎస్.పి
12 2009 మగధీర షేర్ ఖాన్, సాల్మన్ రాం చరణ్ తేజ ఎస్.ఎస్. రాజమౌళి
13 2009 రోమియో సాయిరాం శంకర్ గోపి గణేష్
14 2009 శ్రీశైలం శ్రీశైలం, ఆర్మీ మేజర్ సజిత కె.ఎస్. నాగేశ్వరరావు
15 2009 సామ్రాజ్యం మాళవిక, సమీక్ష వీరు ద్వైత్
16 2009 వెట్టాఇక్కరన్ (తమిళం) విజయ్, అనుష్క బాబు సివన్
17 2008 కింగ్ జ్ఞానేశ్వర్, డాన్, డాక్టర్ నాగార్జున శ్రీను వైట్ల
18 2008 మేస్త్రీ హరి దాసరి నారాయణరావు దాసరి నారాయణరావు
19 2008 సరోజ వెంకటప్రభు
20 2008 పోరు హరి అమ్మ రాజశేఖర్
21 2008 ప్రేమాభిషేకం హరి బాయ్, డాన్ వేణుమాధవ్ ఎస్.ఎస్.విక్రమ్ గాంధీ
21 2008 భద్రాద్రి
22 2007 ఢీ శంకర్ గౌడ్, డాన్ మంచు విష్ణు శ్రీను వైట్ల
23 2007 వియ్యాళ వారి కయ్యాలు ఉదయ్ కిరణ్ ఇ. సత్తిబాబు
24 2006 శ్రీమహాలక్ష్మి లాయర్ లక్ష్మి క్రిష్న దేవరాయ షమ్న విజయన్
25 2006 హనుమంతు హనుమంతు మధుశర్మ చంద్రమహేష్
26 2005 నువ్వొస్తానంటే నేనొద్దంటానా శివరామ కృష్ణ సిద్ధార్థ్ ప్రభుదేవా
27 2005 మహానంది స్వామి, ఫ్యాక్షన్ లీడర్ సుమంత్ సముద్ర
28 2005 ఒక్కడే ఎస్.పి. యుగంధర్ సంతోషి చంద్రమహేష్
29 2004 కేడి. నెం. 1 రమ్యకృష్ణ రవిరాజా పినిశెట్టి
30 2004 గురి సంఘవి భరత్
31 2004 శేషాద్రి నాయుడు నాయుడు గారు నందిత సురేష్ వర్మ
32 2003 సింహాచలం సింహాచలం మీనా ఇంద్రకుమార్
33 2003 కూలీ రాశి
34 2003 భధ్రాచలం భధ్రాచలం సింధూ మీనన్ ఎన్. శంకర్
35 2002 పరశురాం పరశురాం సంఘవి మోహన్ గాంధీ
36 2002 పృథ్వీనారాయణ పృథ్వీనారాయణ మేఘన పి. వాసు
37 2002 కుబుసం శివరాం, నక్సల్ లీడర్ గిరి, స్వప్న ఎల్. శ్రీనాథ్
38 2002 ప్రేమ దొంగ ఆకాష్
39 2001 అప్పారావుకి ఒక నెల తప్పింది రాజేంద్రప్రసాద్ రేలంగి నరసింహారావు
40 2001 థాంక్యూ సుబ్బారావ్ సుబ్బారావ్ అభిరామి ఇ.వి.వి. సత్యనారాయణ
41 2001 ఎవడ్రా రౌడీ దాన్వి సంఘవి పోసాని కృష్ణమురళి
42 2001 ఒరేయ్ తమ్ముడు శ్రీనివాస్ యాదవ్ సంఘవి సాయి బాలాజీ
43 2001 మా ఆయన సుందరయ్య మల్లేష్ సంగీత హరిబాబు
44 2001 చెలియా చెలియా చిరుకోపమా కె. సాయి శ్యామ్
45 2000 బాగున్నారా వడ్డే నవీన్ ఫకృద్ధీన్
46 2000 శివాజీ శివాజి రాశి సాయి బాలాజీ
47 2000 అయోధ్య రామయ్య అయోద్య రామయ్య, ఎస్.పి.పట్నాయక్ భానుప్రియ చంద్రమహేష్
48 2000 విజయరామరాజు విజయరామ రాజు ఊర్వశీ వీరశంకర్
49 2000 బలరాం బలరాం రాశి రవిరాజా పినిశెట్టి
50 2000 గణపతి గణపతి అశ్వనీ హరిబాబు
51 1999 పోలీస్ అశ్వనీ
52 1999 సాంబయ్య రాధికా చౌదరి కె.యస్. నాగేశ్వరరావు
53 1999 తెలంగాణ సురేష్, వినోద్, ఇంద్రజ భరత్ నందన్
54 1999 తమిళ్
55 1999 సముద్రం జగపతిబాబు కృష్ణవంశీ
56 30.07.1999 రాజకుమారుడు మహేష్ బాబు కె. రాఘవేంద్రరావు
57 06.08.1999 బొబ్బిలి వంశం డాక్టర్ రాజశేఖర్ కె.యస్. అదియామన్
58 06.08.1999 ప్రేమకు వేళాయెరా జె. డి. చక్రవర్తి యస్.వి. కృష్ణారెడ్డి
59 1999 అల్లుడుగారు వచ్చారు జగపతిబాబు రవిరాజా పినిశెట్టి
60 19.11.1999 ప్రేయసి రావే శ్రీకాంత్ మహేష్ చంద్ర
61 28.09.1999 శ్రీరాములయ్య మోహన్ బాబు యన్. శంకర్
62 1998 ఓ పనై పోతుంది బాబు రవితేజ శివ నాగేశ్వరరావు
63 30.10.1998 ప్రేమంటే ఇదేరా మురళీధర్, పోలీస్ ఆఫీసర్ అక్కినేని నాగార్జున జయంత్ సి. పరాన్జీ
64 14.01.1998 ఆవిడ మా ఆవిడే అక్కినేని నాగార్జున ఇ.వి.వి. సత్యనారాయణ
65 1998 బావగారు బాగున్నారా చిరంజీవి జయంత్ సి. పరాన్జీ
66 1998 సూర్యుడు డాక్టర్ రాజశేఖర్ ముత్యాల సుబ్బయ్య
67 1998 వైభవం
68 1998 శుభవార్త అర్జున్ పి.యన్. రామచంద్రారావు
69 01.07.1998 రాయుడు మోహన్ బాబు రవిరాజా పినిశెట్టి
70 1998 పెళ్ళాడి చూపిస్తా బ్రహ్మానందం ఓం సాయి ప్రకాష్
71 1997 ప్రేమించుకుందాం రా అక్కినేని నాగార్జున జయంత్ సి. పరాన్జీ
72 25.04.1997 ముద్దుల మొగుడు నందమూరి బాలకృష్ణ ఎ.కోదండరామిరెడ్డి
73 1997 బొబ్బిలి దొర ఘట్టమనేని కృష్ణ బోయపాటి కామేశ్వరరావు
74 1997 గోకులంలో సీత హరి పవన్ కళ్యాణ్ ముత్యాల సుబ్బయ్య
75 1997 వీడెవడండీ బాబూ మోహన్ బాబు ఇ.వి.వి. సత్యనారాయణ
76 1997 జై భజరంగబలి రాజేంద్రప్రసాద్ టి. ప్రభాకర్
77 25.04.1996 రాముడొచ్చాడు అక్కినేని నాగార్జున ఎ.కోదండరామిరెడ్డి
78 16.05.1996 శ్రీ కృష్ణార్జున విజయం దుర్యోధన నందమూరి బాలకృష్ణ సింగీతం శ్రీనివాసరావు
79 09.02.1996 సాహసవీరుడు - సాగరకన్య[3] రత్నాలు దగ్గుబాటి వెంకటేష్ కె. రాఘవేంద్రరావు
80 1995 అల్లుడా మజాకా చిరంజీవి ఇ.వి.వి. సత్యనారాయణ
81 1995 తాజ్ మహల్ శ్రీకాంత్ ముప్పలనేని శివ
82 07.04.1994 ఘరానా అల్లుడు ఘట్టమనేని కృష్ణ ముప్పలనేని శివ
83 20.04.1994 హలో బ్రదర్ సింగపూర్ సింహాచలం అక్కినేని నాగార్జున ఇ.వి.వి. సత్యనారాయణ
84 1995 స్ట్రీట్ ఫైటర్ ఆలీ, బ్రహ్మానందం బి. గోపాల్
85 1994 దొరగారికి దొంగ పెళ్లాం ఘట్టమనేని కృష్ణ ఎస్.ఎస్. రవిచంద్ర
86 1993 మేజర్ చంద్రకాంత్ ఎన్.టి.ఆర్, మోహన్ బాబు కె. రాఘవేంద్రరావు
87 17.01.1993 ముఠా మేస్త్రి చిరంజీవి ఎ.కోదండరామిరెడ్డి
88 1993 అల్లరి ప్రియుడు డాక్టర్ రాజశేఖర్ కె. రాఘవేంద్రరావు
89 1993 కుంతీపుత్రుడు మోహన్ బాబు దాసరి నారాయణరావు
90 1993 ధర్మ క్షేత్రం నందమూరి బాలకృష్ణ ఎ.కోదండరామిరెడ్డి
91 1992 భారతం
92 1989 మాపిల్లయ్ (తమిళం) రజినీకాంత్ రాజశేఖర్

పురస్కారాలు మార్చు

ఫిల్మ్ ఫేర్ అవార్డులు

మూలములు మార్చు

  1. Srihari Profile on IMDB
  2. మరణ వార్త
  3. ఐడ్రీమ్ పోస్ట్, సినిమాలు (7 April 2020). "గురి తప్పిన 'సాహస వీరుడు'". www.idreampost.com (in ఇంగ్లీష్). Archived from the original on 5 ఆగస్టు 2020. Retrieved 22 June 2020.

4. మంచి మనసున్న రియల్ హీరో