శ్రీ స్వామినారాయణ దేవాలయం (కొలోనియా)

అమెరికాలోని న్యూజెర్సీలో (కొలోనియా)లో ఉన్న స్వామినారాయణ హిందూ దేవాలయం.

శ్రీ స్వామినారాయణ దేవాలయం, అమెరికాలోని న్యూజెర్సీలో (కొలోనియా)లో ఉన్న స్వామినారాయణ హిందూ దేవాలయం.[1] 2005, సెప్టెంంబరు 4న ఆచార్య మహారాజశ్రీ కోశలేంద్రప్రసాద్ పాండే అధికారికంగా ప్రారంభించారు.[2] భారతదేశం వెలుపల నరనారాయణుల జంట రూపాన్ని ప్రధాన దేవతలుగా కలిగి ఉన్న మొదటి, ఏకైక స్వామినారాయణ దేవాలయమిది.

శ్రీ స్వామినారాయణ దేవాలయం (కొలోనియా)
ఆలయంలోని శిఖరాలు
స్థానం
దేశం:యునైటెడ్ స్టేట్స్
రాష్ట్రం:న్యూజెర్సీ
భౌగోళికాంశాలు:40°36′18″N 74°18′46″W / 40.6051°N 74.3129°W / 40.6051; -74.3129

చరిత్ర మార్చు

గతంలో యూదుల ప్రార్థనా స్థలంగా ఉన్న ఓహెవ్ షాలోమ్ స్థలంలో ఈ దేవాలయం ఏర్పాటు చేయబడింది. యూదుల దేవాలయం మూసివేయబడిన తర్వాత ఈ ప్రాంతాన్ని నివాస సముదాయంగా మారాలని భావించారు, దేవాలయ నిర్వాహకులు అక్కడి స్థానికులతో మాట్లాడి దేవాలయాన్ని నిర్మించడానికి బిల్డర్‌తో ఒప్పందానికి చేసుకున్నారు.[2]

నిర్మాణం మార్చు

ప్రధాన గది నాలుగు గోడలు, నేల కాంక్రీట్ స్లాబ్ ను అలాగే ఉంచి కొత్త దేవాలయానికి అనుగుణంగా మిగతావాటిని పునరుద్ధరించారు. దేవాలయం పైన ఉన్న గోపురం కూడా కొత్తగా నిర్మించబడింది.

ప్రారంభం మార్చు

దేవాలయ ప్రారంభ సందర్భంగా ఒక వారంరోజులపాటు గ్రంథాల పఠనంతో కూడిన వేడుకలు జరిగాయి. 2005 సెప్టెంబరు 4న ప్రారంభోత్సవం జరిగింది. ఈ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వీక్షించారు.[2]

అమెరికా మొత్తంలో గోపురాలు (లేదా శిఖరాలు) కలిగిన మొదటి దేవాలయాల్లో ఇది కూడా ఒకటి.[1][2] అమెరికాలో నిర్మించిన ఎనిమిదవ స్వామినారాయణ దేవాలయం, 2009 నాటికి అమెరికాలో ఇరవై దేవాలయాలు ఉన్నాయి.[2][3]

చిత్రమాలిక మార్చు

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "Shree Swaminarayan Temple - Colonia, NJ (ISSO)". Archived from the original on 2009-05-08. Retrieved 2022-03-26.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 "New temple one of only 8 in the United States". Sentinel. 2005-09-14. Archived from the original on 2006-03-26. Retrieved 2009-05-27.
  3. "Local Hindu temple offers peace". Hudson Reporter. 2009-02-27. Archived from the original on 2011-07-12. Retrieved 2009-05-27.

బయటి లింకులు మార్చు