షియోపూర్ జిల్లా

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో షియోపూర్ జిల్లా (హిందీ:श्योपुर जिला) ఒకటి. జిల్లా రాష్ట్ర ఉత్తరభూభాగంలో చంబల్ డివిజన్‌లో ఉంది. షియోపూర్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 6606 చ.కి.మీ. జిల్లాలో బిజయ్పూర్, కరహల్, బరోడా వంటి ప్రధాన నగరాలు ఉన్నాయి.2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 559,495..[1]2011 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 687,952. జనసంఖ్యా పరంగా షియోపూర్ జిల్లారాష్ట్రంలో 3 వ స్థానంలో ఉంది. మొదటి 2 స్థానాలలో హర్దా, ఉమరియా జిల్లాలు ఉన్నాయి.[2] మధ్యప్రదేశ్‌లోని 21 గిరిజన జిల్లాలలో ఇది ఒకటి.[3]

Sheopur జిల్లా
श्योपुर जिला
మధ్య ప్రదేశ్ పటంలో Sheopur జిల్లా స్థానం
మధ్య ప్రదేశ్ పటంలో Sheopur జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
డివిజనుChambal
ముఖ్య పట్టణంSheopur
మండలాలు1. Sheopur, 2. Baroda, 3. Vijaypur, 4. Veerpur, 5. Karahal,
Government
 • లోకసభ నియోజకవర్గాలుMorena (shared with Morena district)
 • శాసనసభ నియోజకవర్గాలు1. Sheopur, 2. Vijaypur
Area
 • మొత్తం6,606 km2 (2,551 sq mi)
Population
 (2011)
 • మొత్తం6,87,952
 • Density100/km2 (270/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత58.0
 • లింగ నిష్పత్తి902
Websiteఅధికారిక జాలస్థలి
కునో నేషనల్ పార్క్‌లోని నది

చరిత్ర మార్చు

1998లో మొరేనా జిల్లాలోని కొంత భూభాగం వేరు చేసి షియోపూర్ జిల్లా రూపొందించబడింది.

ఆర్ధికం మార్చు

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో షియోపూర్ జిల్లా ఒకటి అని గుర్తించింది..[4] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర 24 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[4]

విభాగాలు మార్చు

  • జిల్లా 3 ఉపవిభాగాలు ఉన్నాయి: షియోపూర్, బిజయ్‌పూర్, కరహల్.
  • షియోపూర్ఉపవిభాగం:- షియోపూర్, బరోడా
  • బిజయ్‌పూర్ ఉపవిభాగం: బిజయ్‌పూర్, విరాపూర్
  • కరహల్ ఉపవిభాగం: కరహల్
  • నగర పాలితాలు: షియోపూర్, బరోడా
  • నగరపంచాయితీ: బిజయ్‌పూర్
  • జిల్లాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి:- షియోపూర్, బిజయ్‌పూర్
  • పార్లమెంటు నియోజకవర్గం: మొరేనా [5]

2001 లో గణాంకాలు మార్చు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 687,952,[2]
ఇది దాదాపు. ఈఖ్వెటోరియల్ గునియా దేశ జనసంఖ్యకు సమానం.[6]
అమెరికాలోని. నార్త్ డకోటా నగర జనసంఖ్యకు సమం.[7]
640 భారతదేశ జిల్లాలలో. 505 వ స్థానంలో ఉంది..[2]
1చ.కి.మీ జనసాంద్రత. 104 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 22.96%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 920:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 58.02%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Districts of India - Madhya Pradesh". india.gov.in website. Retrieved 4 February 2011.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-08-07. Retrieved 2014-11-23.
  4. 4.0 4.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  5. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. pp. 226, 250. Archived from the original (PDF) on 2010-10-05. Retrieved 2014-11-23.
  6. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Equatorial Guinea 668,225 July 2011 est.
  7. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. North Dakota 672,591

వెలుపలి లింకులు మార్చు

వెలుపలి లింకులు మార్చు