షేన్ వార్న్

ఆస్ట్రేలియా దేశపు క్రికెట్ ఆటగాడు

షేన్ వార్న్ (1969 సెప్టెంబరు 13 - 2022 మార్చి 4) ఆస్ట్రేలియా దేశానికి చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఆయన ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో 1000 వికెట్లు తీశాడు. షేన్ వార్న్ టెస్టుల్లో అత్యధిక వికెట్లు (708), 194 వన్డేలు ఆడిన వార్న్ 293 వికెట్లు, ఐపీఎల్‌లో 55 మ్యాచ్‌లు ఆడి 57 వికెట్లు తీశాడు. షేన్ వార్న్ టెస్టుల్లో అత్యధిక వికెట్లు (708) సాధించిన రెండో బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కి, 2013 జులై లో క్రికెట్‌లో అన్ని రకాల ఫార్మాట్స్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించి, తర్వాత మరణించేదాకా వ్యాఖ్యాతగా కొనసాగాడు.

షేన్ వార్న్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
షేన్ కీత్ వార్న్
పుట్టిన తేదీ(1969-09-13)1969 సెప్టెంబరు 13
విక్టోరియా , ఆస్ట్రేలియా
మరణించిన తేదీ2022 మార్చి 4(2022-03-04) (వయసు 52)
కోహ్ సముయ్, థాయిలాండ్
మారుపేరువార్ని
ఎత్తు1.83 m (6 ft 0 in)
బ్యాటింగుకుడి చేతి
బౌలింగుకుడి చేతి లెగ్‌స్పిన్నర్‌
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 350)1992 జనవరి 2 - [[ భారతదేశం క్రికెట్ జట్టు| భారతదేశం]] తో
చివరి టెస్టు2007 జనవరి 2 - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 110)1993 మార్చి 24 - న్యూజీలాండ్ తో
చివరి వన్‌డే2005 జనవరి 10 - ఆసియ XI తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.23
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1990/91–2006/07విక్టోరియా (స్క్వాడ్ నం. 23)
2000–2007హాంప్షైర్ (స్క్వాడ్ నం. 23)
2008–2011రాజస్తాన్ రాయల్స్ (స్క్వాడ్ నం. 23)
2011/12–2012/13మెల్బోర్న్ స్టార్స్ (స్క్వాడ్ నం. 23)
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డే ఫస్ట్ - క్లాస్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 145 194 301 311
చేసిన పరుగులు 3,154 1,018 6,919 1,879
బ్యాటింగు సగటు 17.32 13.05 19.43 11.81
100లు/50లు 0/12 0/1 2/26 0/1
అత్యుత్తమ స్కోరు 99 55 107 నాటౌట్ 55
వేసిన బంతులు 40,705 10,642 74,830 16,419
వికెట్లు 708 293 1,319 473
బౌలింగు సగటు 25.41 25.73 26.11 24.61
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 37 1 69 3
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 10 0 12 0
అత్యుత్తమ బౌలింగు 8/71 5/33 8/71 6/42
క్యాచ్‌లు/స్టంపింగులు 125/– 80/– 264/– 126/–
మూలం: ESPNcricinfo, 2008 మార్చి 29

క్రీడా జీవితం మార్చు

వార్న్ 1992లో భారత్ పై సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో టెస్ట్ క్రికెట్ రంగప్రవేశం చేసాడు. ఆస్ట్రేలియా తరఫున బౌలర్‌గా 145 టెస్టులు మ్యాచ్‌లు ఆడి 708 వికెట్లు, 194 వన్డేలు ఆడి 293 వికెట్లు, బ్యాట్స్ మెన్ గా 3,154 పరుగులు చేశాడు. ఆయన టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్ లో అత్యధికంగా ఎనిమిది వికెట్లు, ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఒక మ్యాచ్ లో 12 వికెట్లు, టెస్టుల్లో 37 సార్లు 5 వికెట్లు, 10 సార్లు 10 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు.

షేన్ వార్న్ 1999లో ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా టీమ్‌లో సభ్యుడిగా, 1993, 2003 మధ్య ఐదు కాలంలో ఆస్ట్రేలియా యాషెస్ గెలిచిన టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. ఆయన 2007 జనవరి 7న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి మొత్తం 55 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో 57 వికెట్లు తీశాడు.[1]

మరణం మార్చు

52 ఏళ్ల షేన్‌ వార్న్‌ 2022 మార్చి 4న థాయ్‌లాండ్‌లోని కోహ్ సమీపంలో తన విల్లాలో గుండెపోటుతో మరణించాడు.[2][3]

ఆస్ట్రేలియా మాజీ వికెట్‌ కీపర్‌ రాడ్‌ మార్ష్‌ క్వీన్స్‌ల్యాండ్‌లో 2022 మార్చి 4న ఉదయం కన్నుముశారు. ఆయన మరణానికి సంతాపం తెలుపుతూ షేన్‌ వార్న్‌ ట్వీట్‌ చేశాడు. ఆ తరువాత సరిగ్గా 12 గంటలకే వార్న్‌ మరణించాడు.[4]

మూలాలు మార్చు

  1. Namasthe Telangana (మార్చి 4 2022). "2013లో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు షేన్ వార్న్ వీడ్కోలు.. ఆయ‌న క్రికెట్ ప్ర‌స్థానం ఇదీ". Retrieved మార్చి 4 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help); Check date values in: |accessdate=, |date=, and |archivedate= (help)
  2. 10TV (మార్చి 4 2022). "ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ హఠాన్మరణం" (in telugu). Retrieved మార్చి 4 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help); Check date values in: |accessdate=, |date=, and |archivedate= (help)CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. TV9 Telugu (మార్చి 4 2022). "క్రికెట్ లెజెండ్ షేన్ వార్న్ కన్నుమూత.. దిగ్భ్రాంతికి గురైన క్రికెట్ ప్రేమికులు". Retrieved మార్చి 4 2022. క్రికెట్ లెజెండ్ షేన్ వార్న్ కన్నుమూత.. దిగ్భ్రాంతికి గురైన క్రికెట్ ప్రేమికులు {{cite news}}: |archive-date= requires |archive-url= (help); Check date values in: |accessdate=, |date=, and |archivedate= (help)CS1 maint: numeric names: authors list (link)
  4. "Shane Warne: విధి అంటే ఇదేనేమో క్రికెటర్‌ మృతికి సంతాపం తెలిపిన కొన్ని గంటలకే". EENADU. Retrieved 2022-03-04.

బయటి లింకులు మార్చు