సతీష్ కాసెట్టి తెలుగు సినిమా రచయిత, దర్శకుడు. 2006లో ఈయన తొలిసారిగా దర్శకత్వం వహించిన హోప్ చిత్రానికి ఉత్తమ సామాజిక స్పృహ కలిగిన చిత్రంగా జాతీయ పురస్కారం బహుమతి వచ్చింది.

సతీష్ కాసెట్టి
జననం
సత్యనారాయణ కాసెట్టి
జాతీయతభారతీయుడు
వృత్తితెలుగు సినిమా రచయిత, దర్శకుడు
వెబ్‌సైటుhttp://satishkasetty.com/

సినిమారంగ ప్రస్థానం మార్చు

సతీష్ 2006లో తొలిసారిగా హోప్ సినిమాకు దర్శకత్వం వహించాడు. నిర్మాత డి. రామానాయుడు, కళ్యాణి ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రం 54వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలులో ఉత్తమ సామాజిక అంశం కలిగిన చిత్రంగా బహుమతిని అందుకుంది. విద్యావ్యవస్థలోని ఒత్తిడి కారణంగా జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యల అంశంపై ఈ చిత్రం రూపొందించబడింది.[1]

2009లో కమల్ కామరాజు, కలర్స్ స్వాతి జంటగా నటించిన కలవరమాయే మదిలో చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో పల్లవించని అనే పాటకు గాయని కె. ఎస్. చిత్రకు ఉత్తమ గాయనిగా నంది పురస్కారం లభించింది.[2] సతీష్ దర్శకత్వంలో 2016, ఫిబ్రవరిలో శ్రీకాంత్ హీరోగా టెర్రర్ సినిమా విడుదలైంది.

దర్శకత్వం వహించిన చిత్రాలు మార్చు

  1. హోప్ (2006)
  2. కలవరమాయే మదిలో (2009)
  3. టెర్రర్ (2016 సినిమా)

మూలాలు మార్చు

  1. "54th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 28 February 2018.
  2. "Kalavaramaye Madilo is appealing". Rediff.com. 17 July 2009. Retrieved 21 February 2013.

ఇతర వివరాలు మార్చు