సత్యం శివం 1981 లో వచ్చిన యాక్షన్ చిత్రం. ఈశ్వరి క్రియేషన్స్ పతాకంపై, కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో డి. వెంకటేశ్వరరావు నిర్మించాడు. ఈ చిత్రంలో ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి, రతి అగ్నిహోత్రి ప్రధాన పాత్రల్లో నటించారు.[1] చక్రవర్తి సంగీతం సమకూర్చాడు. ఇది హిందీ చిత్రం సుహాగ్ (1979) కు రీమేక్.

సత్యం శివం
(1981 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.రాఘవేంద్రరావు
నిర్మాణం డి. వెంకటేశ్వరరావు
కథ ప్రయాగ్ రాజ్
చిత్రానువాదం కె. రాఘవేంద్రరావు
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
నందమూరి తారక రామారావు,
శ్రీదేవి
సంగీతం కె. చక్రవర్తి
సంభాషణలు సత్యాసత్యానంద్
ఛాయాగ్రహణం కె.ఎస్. ప్రకాష్
కూర్పు రవి
నిర్మాణ సంస్థ ఈశ్వరి క్రియేషన్స్
భాష తెలుగు

కథ మార్చు

నాగరాజు (సత్యనారాయణ), జానకి (పుష్పలత) వివాహితులు. కానీ నాగరాజు జానకిని ఎప్పుడూ భార్యగా భావించక చివరికి ఆమెను వదిలేస్తాడు. జానకి కవలలకు జన్మనిస్తుంది. శేషు (ప్రభాకర్ రెడ్డి) అనే దొంగల ముఠా నాయకుడు వారిలో ఒకరిని దొంగిలించి, కుంటి (త్యాగరాజు) అనే దొంగకు విక్రయిస్తాడు. నాగరాజు పెద్ద ఎత్తున నేరానికి పాల్పడ్డ నేరస్థుడు. అతడికి ప్రత్యర్థి గ్యాంగ్ స్టర్ శేషుకూ విరోధం ఉంది. తన కొడుకు తప్పిపోయిన బాధలో ఉన్న జానకి చాలా ఇబ్బందులతో, రెండవ కొడుకు సత్యం (అక్కినేని నాగేశ్వరరావు) ను పెంచుతుంది. అతను పోలీసు అధికారి అవుతాడు. మరోవైపు, కుంటి శివంని (ఎన్.టి.రామారావు) నిరక్షరాస్యుడిగా, నేరస్థుడిగా, మద్యపాన లోలుడిగా తయారు చేస్తాడు. ఈ లక్షణాల వల్ల అతడికి సత్యంతో గొడవ వస్తుంది. కాని వాళ్ళిద్దరూ తమ విభేదాలను పరిష్కరించుకుని త్వరగా మిత్రులై పోతారు. నాగరాజుకు తన ఇద్దరు కుమారులు, భార్య సజీవంగా ఉన్నట్లు తెలియదు. తన గుర్తింపును వెల్లడించకుండా, నాగరాజు ముఠాను పట్టుకోవడానికి సత్యాన్ని నియమిస్తారు. శివం అతనికి మద్దతు ఇస్తాడు. వారు, ఇతర పోలీసు సిబ్బందితో కలిసి అప్రమత్తంగా ఉంటారు. అనుకున్నట్లు పనులు జరగవు; వాళ్ళ దాడిలో సత్యం కంటి చూపును కోల్పోతాడు. ఈ నేరం వెనుక ఉన్న వ్యక్తిని గుర్తించే బాధ్యతను శివం తీసుకుంటాడు.

నటీనటులు మార్చు

సాంకేతిక వర్గం మార్చు

పాటలు మార్చు

సం. పాట గాయనీ గాయకులు నిడివి
1 "మోత గున్నవో పిల్లో" ఎస్పీ బాలు, పి.సుశీల 3:29
2 "అంధమే అందమా" ఎస్పీ బాలు, ఎస్.జానకి 4:26
3 "ఎనకా ముంధు" ఎస్పీ బాలు, ఎస్.జానకి 4:25
4 "జంబలగిరి పంబకాడ" ఎస్పీ బాలు, పి.సుశీల 3:03
5 "మంచి తరుణం" ఎస్పీ బాలు, పి.సుశీల, ఎస్పీ శైలజ 5:25
6 "వెలుగు నీడలలో" ఎస్పీ బాలు, ఎస్. జానకి, ఎస్.పి.శైలజ 4:34
7 "సాగే నదులే" ఎస్పీ బాలు 4:21

మూలాలు మార్చు

  1. "సత్యం శివం స్టోరి | Satyam Shivam Tollywood Movie Story, Preview in Telugu - Filmibeat Telugu". telugu.filmibeat.com. Archived from the original on 2020-08-17. Retrieved 2020-08-17.