సత్యమేవ జయతే (ఆంగ్లం : "Truth alone triumphs.") (సంస్కృతం : सत्यमेव जयते) : "సత్యం మాత్రమే జయిస్తుంది") అనేది ముండక ఉపనిషత్తులోని ఒక మంత్రం.[1] భారత జాతీయ నినాదంగా 1950 జనవరి 26న ఆమోదించారు.[2][3]

భారత జాతీయ చిహ్నం.

చరిత్ర మార్చు

ఈ నినాదాన్ని ఉత్తర ప్రదేశ్, సారనాధ్ లోని అశోకుడి ఏక సింహ రాజధాని నుండి సేకరించారు. ఈ నినాద మూలాలు ముండక ఉపనిషత్తు లోని మంత్రం 3.1.6 నుండి గ్రహించారు. ఈ మంత్రం ఇలా సాగుతుంది.

సత్యమేవ జయతే నానృతమ్
సత్యేన పంథా వితతో దేవయానః
యేనాక్రమాంత్యా ఋషయోహ్యాప్తాకామా
యాత్ర తత్సత్యస్య పరమం నిధానమ్


అర్థం : సత్యమే జయిస్తుంది, అసత్యం కాదు. సత్యం ద్వారా దివ్య (దేవ)మార్గం అవగతమౌతుంది. ఆ మార్గంలోనే ఋషులు తమ అభీష్టాలను వెరనేర్చుకొని పరమ నిధానాన్ని చేరుకోగలిగారు.

వాడుక మార్చు

భారత అధికారిక చిహ్నంలోని ధర్మసూత్రం 'సత్యమేవ జయతే' వ్యాక్యాన్ని 'భారత అధికారిక చిహ్నం - 2007' నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలు తమ అధికారిక కార్యకలాపాల్లో తప్పకుండా ముద్రించాలని కేంద్రం సూచించింది.

ఇతర ఆసక్తిగల విషయాలు మార్చు

  • ఖురాన్ సూక్తి "నస్‌రుమ్ మినల్లాహి వ ఫతహ్ ఉన్ ఖరీబ్", సత్యం (అల్లాహ్) యొక్క జయం, అతి దగ్గరలో వుంటుంది. (ఇలాంటి అర్థాన్నే ఇస్తుంది)
  • చెక్ రిపబ్లిక్ దేశ నినాదం "ప్రావ్‌దా విటేజీ" (సత్యమే ఉంటుంది). (ఇలాంటి అర్థాన్నే ఇస్తుంది.)

మూలాలు మార్చు

  1. "Mundaka Upanishad". IIT Kanpur. Archived from the original on 2020-06-04. Retrieved 2020-06-04.
  2. "Motto for State Emblem" (PDF). Press Information Bureau of India - Archive.
  3. Department related parliamentary standing committee on home affairs (2005-08-25). "One hundred and sixteenth report on the state emblem of India (Prohibition of improper use) Bill, 2004". New Delhi: Rajya Sabha Secretariat, New Delhi: 6.11.1. Retrieved 2008-09-26. {{cite journal}}: Cite journal requires |journal= (help)