వాణిజ్యవ్యవస్థలో వినియోగదారులకు ఉత్పత్తిని లేదా సేవను అందచేయడంలో పాలుపంచుకునే సంస్థలు, వ్యక్తులు, కార్యకలాపాలు, సమాచారం, వనరులు మొదలైనవాటితో కూడుకున్న వ్యవస్థను సరఫరా గొలుసు అంటారు. సహజ వనరులు, ముడి పదార్థాలు, విడిభాగాలు మొదలైన వాటిని తుది ఉత్పత్తిగా మార్చి వినియోగదారునికి అందించడం సరఫరా గొలుసు కార్యకలాపాల్లో భాగం.[1] [2]

సప్లై, డిమాండ్ లను సూచించే గొలుసు

ఉత్పత్తులను వినియోగించాక వాటిలో ఇంకా పనికొచ్చే విలువ ఉంటే వాటిని ఏ సమయంలోనైనా తిరిగి సరఫరా గొలుసు లోకి ప్రవేశ పెట్టే వీలు, అధునాతన సరఫరా గొలుసు వ్యవస్థలలో ఉంటుంది.

ఇంటర్నెట్‌లో, వినియోగదారులు నేరుగా పంపిణీదారులను సంప్రదించే వీలుంది. దీనివలన మధ్యవర్తులు తగ్గిపోయి గొలుసు పొడవు కొంతవరకు తగ్గింది.

స్థూలంగా మార్చు

సహజ వనరులపై పర్యావరణ, జీవ, రాజకీయ నియంత్రణలు మొదలవడంతో సరఫరా గొలుసు ప్రారంభమవుతుంది. అ తరువాత మానవులు ముడి పదార్థాలను సేకరించడం, వాటిని వినియోగించి ఉత్పత్తులు తయాఅరు చెయ్యడం జరుగుతుంది. ఇందులో అనేక ఉత్పత్తి దశలు (ఉదా., విడిభాగాల నిర్మాణం, వాటి కూర్పు మొదలైనవి), అ తరువాత అనేక దశల్లో నిల్వ చెయ్యడం ఉంటాయి. ఈ నిల్వ దశలు పెరిగే కొద్దీ, నిల్వ పరిమాణాలు తగ్గుతూ, భౌగోళికంగా నిల్వ చేసే స్థలాలు విస్తరిస్తూ పోతాయి. చివరకు వినియోగదారునికి చేరతాయి.

తాము నైతిక పద్ధతులను అనుసరిస్తున్నామని తెలియజెప్పే ప్రయత్నాల్లో భాగంగా, చాలా పెద్ద కంపెనీలు, గ్లోబల్ బ్రాండ్లూ తమ సంస్థాగత సంస్కృతి, నిర్వహణ వ్యవస్థల్లోకి ప్రవర్తనా నియమావళిని, మార్గదర్శకాలనూ అనుసంధానిస్తున్నాయి. తమ సరఫరాదారులు (సౌకర్యాలు, పొలాలు, శుభ్రపరచడం, క్యాంటీన్, భద్రత మొదలైన ఉప కాంట్రాక్ట్ సేవలు అందించేవారు) తమకు అత్యావశ్యకమైన ప్రమాణాలకు లోబడి ఉండాలని సంస్థలు డిమాండ్లు చేస్తున్నాయి, అలా ఉన్నారో లేదో సామాజిక ఆడిట్ ద్వారా ధ్రువీకరించుకుంటున్నాయి. సరఫరా గొలుసులో పారదర్శకత లేకపోవడాన్ని మిస్టిఫికేషన్ అంటారు. దీనివలన వినియోగదారులకు తాము కొనుగోలు చేసే ఉత్పత్తులు ఎక్కడ ఉద్భవించాయో తెలియకుండా పోతుంది. సామాజికంగా బాధ్యతా రహితమైన పద్ధతులకు ఊతమిస్తుంది. సరఫరా గొలుసు నిర్వాహకులు వారి వనరులకు ఉత్తమమైన ధరను పొందుతున్నారో లేదోనని వారి చర్యలు నిరంతరం నిశిత పరిశీలనలో ఉంటాయి. సంస్థలో అంతర్గతంగా పారదర్శకత లేకపోతే ఇది కష్టతరమౌతుంది. పరిశ్రమలో పోటీ ధరలను గుర్తించాలంటే కాస్ట్ బెంచ్‌మార్కింగ్ అనేది ఒక మంచి పద్ధతి. సంధానకర్తలు తమ వ్యూహాన్ని రూపొందించుకోడానికీ, మొత్తం ఖర్చును తగ్గించడానికీ ఇది ఒక బలమైన పునాదిని ఇస్తుంది.

మూలాలు మార్చు

  1. Kozlenkova, Irina; et al. (2015). "The Role of Marketing Channels in Supply Chain Management". Journal of Retailing. 91 (4): 586–609. doi:10.1016/j.jretai.2015.03.003. Retrieved 28 September 2016.
  2. "సరకులకెళ్తే... బె'ధరా'ల్సిందే". www.eenadu.net. Retrieved 2020-05-15.